మహేశ్ బాబు ఇంట్లో ఆ హీరోయిన్లతో చిరంజీవి.. ఎందుకు వెళ్లారో తెలిస్తే!
ఆరు పదుల వయసు దాటినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నారు టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి. ముఖ్యంగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతూ భారీ ప్రాజెక్టులు చేస్తున్నారు. ఇలా ఇప్పుడు చిరంజీవి 'విశ్వంభర' అనే క్రేజీ సినిమాలో నటిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రమే 'విశ్వంభర'. టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సోషియో ఫాంటసీ జోనర్‌లో రాబోతుంది. దీంతో ఈ మూవీపై ఆరంభంలోనే అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. ఫలితంగా దీనిపై బజ్ మరింతగా పెరుగుతోంది.

విభిన్నమైన కాన్సెప్టుతో తెరకెక్కుతోన్న 'విశ్వంభర' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఇందులో ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేశారు. ఆ తర్వాత చిరంజీవి లేని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. కొద్ది రోజుల క్రితమే మరో షెడ్యూల్ ప్రారంభించి.. ఇందులో మెగాస్టార్ చిరంజీవితో పాటు హీరోయిన్ త్రిష సీన్స్ తీశారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే డిఫరెంట్ సబ్జెక్టుతో రూపొందుతోన్న 'విశ్వంభర' సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో పలు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో ఎన్నో సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్లను పెడుతున్నారు. అలాగే, పేరున్న నటీనటులను తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా షూటింగ్ గురించి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.

మెగాస్టార్ చిరంజీవి - మల్లిడి వశిష్ట కాంబినేషన్‌లో రాబోతున్న 'విశ్వంభర' మూవీ షూటింగ్‌ను 'గుంటూరు కారం' చిత్రంతో మహేశ్ బాబు హౌస్‌గా ఉపయోగించిన సెట్‌లోనే చేస్తున్నారట. దానికి కొన్ని మార్పులు చేసి చిరంజీవి ఇల్లుగా మార్చేశారట. ఇందులో మెగాస్టార్‌తో పాటు త్రిష, సురభి, ఈషా చావ్లాలపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తాజాగా తెలిసింది.
ఇదిలా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న 'విశ్వంభర' మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా.. సురభి, ఈషా చావ్లా కీలక పాత్రను చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన విడుదల కాబోతుంది. ఇందులో విలన్‌గా ఓ స్టార్ హీరో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











