కేజీఎఫ్‌ను మించి.. మాఫియా సీన్స్ పీక్స్‌లో!
కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన కేజీఎఫ్ చాప్టర్- 1 చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ సంచలనం సృష్టించింది. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్‌ను కుదిపేసి, అద్భుత వసూళ్లను సాధించింది. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించింది. కన్నడం, హిందీ, తెలుగు, తమిళంలో చక్కని వసూళ్లతో ఆకట్టుకుంది. ప్రస్తుతం కేజీఎఫ్‌కు సీక్వెల్ సినిమాగా కేజీఎఫ్ ఛాప్టర్ 2 రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతోంది. తాజాగా షెడ్యూల్స్ వివరాల్ని చిత్ర యూనిట్ వెల్లడించింది.

ప్రస్తుతం బెంగళూరు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతున్నది. ఆ తర్వాత మైసూర్‌లో షూటింగ్ చేస్తారు. అనంతరం రామోజీ ఫిలింసిటీ షెడ్యూల్ ఉంటుంది. చివరిగా కర్నాటక- బళ్లారిలో షెడ్యూల్‌తో మెజారిటీ పార్ట్ చిత్రీకరణ పూర్తవుతుంది. దాదాపు 80-90శాతం అప్పటికి పూర్తవుతుంది అని కేజీఎఫ్ టీమ్ అధికారికంగా ప్రకటించింది.
చాప్టర్ 2లో సంజయ్ దత్ లాంటి బాలీవుడ్ పలువురు క్రేజీ బాలీవుడ్ స్టార్లు కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ సీక్వెల్‌లో తొలి భాగాన్ని మించి భారీ యాక్షన్ ని చూపించనున్నామని దర్శకుడు ప్రశాంత్ నీల్.. యష్ ఇదివరకూ వెల్లడించారు. కేజీఎఫ్ అంటే కోలార్ బంగారు గనులు (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) అని అర్థం.

దశాబ్ధాల క్రితం కోలార్ బంగారు గనుల్లో మాఫియా కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కేజీఎఫ్ గనులపై ప్రపంచ మాఫియా కన్ను ఎలా ఉండేది అనే అంశాన్ని తొలి భాగంలోనే అద్భుతంగా రివీల్ చేశారు. పార్ట్ 2లో ఇంకా భీకర పోరాటాల్ని తెరపై చూపించనున్నారు. మాఫియాని పీక్స్ లో చూపించబోతున్నారని హోంబలే సంస్థ తెలిపింది.


Click it and Unblock the Notifications











