118 మూవీ ప్రీ రిలీజ్ రివ్యూ: నివేదా థామస్ హైలెట్.. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కంటతడి!

Recommended Video

Kalyan Ram's 118 Movie Pre Release Review | Filmibeat Telugu

ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై మ‌హేష్ ఎస్‌.కోనేరు నిర్మాతగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహ‌న్ ర‌చించి, ద‌ర్శ‌క‌త్వం వ‌హించి, కెమెరాను హ్యాండిల్ చేస్తున్న చిత్రం 118. నందమూరి కల్యాణ్ రామ్, నివేదా థామస్, షాలిని పాండే హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. యువ మ్యూజిక్ డైరెక్టర్ శేఖ‌ర్ చంద్ర సంగీతాన్ని అందిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్ర టీజర్లు, ట్రైలర్లు ఆసక్తిని రేపడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో 118 గురించి ఆసక్తికరమైన విషయాలు మీ కోసం..

118 మూవీ స్టోరి ఏంటంటే

118 మూవీ స్టోరి ఏంటంటే

కలలో కనిపించిన అమ్మాయి కోసం ఓ యువకుడు తిరిగే కథ ఇది. కలలో కనిపించిన అమ్మాయి నిజ జీవితంలో ఉందా? ఉంటే ఆమె ఎవరు? చివరకు యువకుడు ఆ అమ్మాయిని కలుసుకొన్నారా? కలుసుకొంటే యువకుడికి ఎదురైన పరిస్థితి ఏంటి? సినిమా కథ.

వెరైటీగా మూవీ టైటిల్

వెరైటీగా మూవీ టైటిల్

118 అనే సినిమా టైటిల్‌ వెరైటీగా ఉండటంతో దాని వెనుక అర్ధం ఏమిటని చాలా మంది ఉత్సాహంగా అనేక విధాలుగా అనుకొన్నారు. అర్ధరాత్రి ఒంటిగంట పద్దెనిమిది నిమిషాలకు యువకుడికి వచ్చిన కల నేపథ్యంలో ఈ సినిమాకు 118 అని టైటిల్ ఫిక్స్ చేశారు.

 నివేదా థామస్ రోల్ గురించి

నివేదా థామస్ రోల్ గురించి

118 సినిమా నిడివి 2 గంటల 7 నిమిషాలు. అయితే నివేదా థామస్ కనిపించేది కేవలం 20 నిమిషాలే. అయితే మిగితా రెండు గంటల కథ నా పాత్ర చుట్టే తిరుగుతుంది. సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్‌ నిజజీవితంలోని అనుభవంలోంచి పుట్టిన కథ. వాటికి అక్షరరూపాన్ని కల్పించి 118 సినిమాను తెరకెక్కించారు.

ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కంటతడి పెట్టించిన

ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కంటతడి పెట్టించిన

ఇక 118 చిత్రంలో నివేదా థామస్ పాత్ర గురించి అనేక వర్గాల నుంచి పాజిటివ్ టాక్ వెలువడుతుంది. ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్లో కల్యాణ్ రామ్, ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఎన్టీఆర్.. నివేదా థామస్ నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. కొన్ని సీన్లలో నివేదా భావోద్వేగ నటనను చూసి కంటతడి పెట్టుకొన్నాను అని చెప్పడంతో మరింత అంచనాలు పెరిగాయి.

హైటెక్నికల్ వ్యాల్యూస్‌తో సినిమా

హైటెక్నికల్ వ్యాల్యూస్‌తో సినిమా

హైటెక్నికల్ వ్యాల్యూస్, కథ, కథనాలే బలంగా 118 రూపొందినట్టు సినీ వర్గాల్లో ప్రచారమైంది. స్పస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో అనుక్షణం ఉత్కంఠను రేపే చిత్రంగా ఈ సినిమా రూపొందినట్టు ట్రైలర్ స్పష్టం చేసింది. రొటీన్‌కు భిన్నంగా కల్యాణ్ రామ్ మరో ప్రయోగానికి సిద్దమయ్యారని అర్ధమైంది.

రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్

రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్

118 సినిమా థియేట్రికల్ హక్కులు రికార్డుస్థాయిలో అమ్ముడుపోవడం మరింత క్రేజీగా మారింది. ఈ చిత్ర హక్కులను రూ.14 కోట్లకు అమ్మినట్టు ట్రేడ్ రిపోర్టు. కల్యాణ్ రామ్ కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ప్రీ రిలీజ్ బిజినెస్. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేశారు.

యూఎస్‌లో మంచి క్రేజ్‌తో

యూఎస్‌లో మంచి క్రేజ్‌తో

యూఎస్‌లో 118 చిత్రం భారీగా విడుదలవుతున్నది. దాదాపు 100 స్క్రీన్లకుపైగా ప్రదర్శించనున్నారు. అమెరికాలో ఈ చిత్రాన్ని నిర్వాణ సినిమాస్ విడుదల చేస్తున్నది. సినిమాపై క్రేజ్‌కు తగినట్టుగానే అడ్వాన్స్ బుకింగ్‌కు భారీగానే స్పందన కనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X