twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    13ఏళ్ల జల్సా.. ఆ ఒక్క కారణంతో వాయిస్ ఓవర్ ఇచ్చిన మహేష్ బాబు!

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఎంతమంది ఉన్నా కూడా పవర్ స్టార్ కు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న ఈ స్టార్ హీరో కెరీర్ లో పవర్ఫుల్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో జల్సా ఒకటి. 2008 ఏప్రిల్ 2న విడుదలైన ఆ సినిమా నేటితో 13ఏళ్ళను పూర్తి చేసుకుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం అప్పట్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. అయితే మహేష్ ఒప్పుకోవడానికి ఒక బలమైన కారణం కూడా ఉంది.

    Recommended Video

    Jalsa Movie Philosophy And Review. it's 13 years for classic jalsa | Filmibeat Telugu
    'అతడు' వర్కౌట్ కాకపోవడంతో

    'అతడు' వర్కౌట్ కాకపోవడంతో

    టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన సినిమా జల్సా. దర్శకుడు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని కెరీర్ మొదటి నుంచి ప్రయత్నిస్తూ వస్తున్నాడు. ముందు 'అతడు' సినిమాను పవన్ కళ్యాణ్ తోనే చేయాలని అనుకున్నారు. కానీ అది వర్కౌట్ కాలేదు. ఇక జల్సా స్క్రిప్ట్ ను పవన్ స్టైల్ కు తగ్గట్లుగా డిజైన్ చేయడంతో సినిమా చాలా ఫాస్ట్ గా సెట్స్ పైకి వచ్చింది.

    8ఏళ్ల తరువాత వచ్చిన విజయం

    8ఏళ్ల తరువాత వచ్చిన విజయం

    జల్సా సినిమా మెయిన్ కథ వినగానే ఏ మాత్రం అనుమానం లేకుండా పవన్ ఒప్పేసుకున్నారు. వరుస అపజయాల అనంతరం పవన్ కెరీర్ కు అదొక మంచి బూస్ట్ ఇచ్చింది. ఖుషి తరువాత పవన్ కు సక్సెస్ రావడానికి 8 ఏళ్ళు పట్టింది. ఆ సినిమా టీవీల్లో వస్తే ఇప్పటికి కూడా మంచి రేటింగ్ ను అందుకుంటోంది.

    1000కి పైగా థియేటర్స్ లో

    1000కి పైగా థియేటర్స్ లో

    సినిమాలో పవన్ నటుడిగా కూడా మంచి టాక్ ను అందుకున్నాడు. కేవలం యాక్షన్ సీన్స్ లోనే కాకుండా ఆలోచింపజేసే డైలాగ్స్ తో ఎంతగానో ఆకట్టుకున్నాడు. అప్పట్లో అదే పర్ఫెక్ట్ ఇంటర్వెల్ సీన్. త్రివిక్రమ్ రాసిన ప్రతి ఒక్క డైలాగ్ ఒక్కో డైమండ్ లా ఉంటుంది. అప్పట్లో అత్యధికంగా 1000కి పైగా థియేటర్స్ లలో ఈ సినిమా విడుదలైంది.

    బలమైన ఆలోచనలను కలిగించే సినిమా

    బలమైన ఆలోచనలను కలిగించే సినిమా

    కుటుంబాన్ని కోల్పోయి, సమాజంలో జరిగే అన్యాయం పట్ల కోపంతో అడవుల్లోకి వెళ్లే ఒక యువకుడు ఆ తరువాత నక్సలైట్ నుంచి సాధారణ జీవితంలోకి వచ్చి ఎలాంటి అనుభవాలను చూశాడు అనేది సినిమాలో చాలా బలమైన ఆలోచనలను కలిగిస్తుంది. యాక్షన్ లవ్ కామెడీ ఎమోషన్ సీన్స్.. ఇలా అన్ని రకాలుగా త్రివిక్రమ్ ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేశాడు.

    మహేష్ వాయిస్ ఓవర్

    మహేష్ వాయిస్ ఓవర్

    అయితే ఈ సినిమాకు అన్నిటికంటే మేజర్ ప్లస్ పాయింట్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం. మహేష్ వాయిస్ ఇవ్వడానికి ప్రధాన కారణం స్టార్ హీరోల మధ్య ఫ్రెండ్లి వాతావరణం ఉంటే చాలా బావుంటుందని అప్పట్లోనే ఆలోచించాడు. త్రివిక్రమ్ తో 'అతడు' చేసిన స్నేహం ఉన్నప్పటికీ అంతకుముందు మహేష్ కు పవన్ తో మంచి స్నేహం ఉంది. అర్జున్ సినిమా సమయంలో పైరసీపై పోరాటంలో పవన్ తోడుగా నిలిచిన విషయం తెలిసిందే.

    English summary
    No matter how many star heroes there are in the Tollywood industry, the fan following for the Power Star is very different. Jalsa is one of the most powerful films in the career of this star hero who has received a special craze of his own. Released on April 2, 2008, the film turns 13 today.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X