పవన్ - హరీశ్ శంకర్ మూవీపై అనుమానాలు.. బడా నిర్మాణ సంస్థ ప్రకటనే కారణం.!

By Manoj

టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. బలమైన బ్యాగ్రౌండ్‌కు తోడు కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి కావడంతో తక్కువ కాలంలోనే ఎవరూ ఊహించని ఎత్తుకు ఎదిగిపోయాడాయన. సినిమా సినిమాకూ వేరియేషన్ చూపించడంతో పాటు ప్రేక్షకులకు సరికొత్త స్టైల్‌ను పరిచయం చేస్తూ దూసుకెళ్లిపోతున్నాడు. మధ్యలో రాజకీయాల వల్ల కొంత గ్యాప్ వచ్చినా రీఎంట్రీతో దాన్ని మరిపించాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో హరీశ్ శంకర్‌తో చేయబోయే సినిమా ఆగిపోయినట్లు ప్రచారం మొదలైంది. దీనికి ఓ బడా నిర్మాణ సంస్థ చేసిన ట్వీటే కారణమైంది. ఇంతకీ ఏం జరిగింది.? పూర్తి వివరాల్లోకి వెళితే....

పవన్ కల్యాణ్ రీఎంట్రీ.. పాత కథతో ప్రయోగం

పవన్ కల్యాణ్ రీఎంట్రీ.. పాత కథతో ప్రయోగం

రాజకీయాల కోసం సినిమాలకు దూరంగా ఉన్నాడు పవన్ కల్యాణ్. ఈ నేపథ్యంలో సుదీర్ఘ విరామం తర్వాత ‘వకీల్ సాబ్' అనే మూవీతో ఆయన రీఎంట్రీ ఇస్తున్నాడు. బాలీవుడ్‌లో భారీ విజయాన్ని అందుకున్న ‘పింక్'కు రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో నివేదా థామస్, అంజలి, అనన్య హీరోయిన్లుగా చేస్తున్నారు.

మరో ఇద్దరిని లైన్‌లో పెట్టేసిన పవన్ కల్యాణ్

మరో ఇద్దరిని లైన్‌లో పెట్టేసిన పవన్ కల్యాణ్


‘వకీల్ సాబ్' షూటింగ్ ప్రారంభం కాకముందే పవన్ కల్యాణ్... మరో ఇద్దరు దర్శకులను లైన్‌లో పెట్టేశాడు. వీరిలో ఒకరు క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కాగా, రెండో డైరెక్టర్ హరీశ్ శంకర్. వీటిలో మొదటి ప్రాజెక్టును ఏఎమ్ రత్నం నిర్మిస్తుండగా... రెండో దానిని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తీస్తుంది. ఈ రెండు చిత్రాల్లో పవన్ డిఫరెంట్ రోల్స్ చేయబోతున్నారు.

ఒకటి పాత కాలంలోది.. రెండోది ఇప్పటిది

ఒకటి పాత కాలంలోది.. రెండోది ఇప్పటిది


క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించే సినిమా మొగలాయిల కాలం నాటి కథతో రూపొందుతోంది. కోహినూర్ డైమండ్‌ను ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఇందులో పవన్ రెండు రోల్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, హరీశ్ శంకర్ రూపొందించే సినిమా మాత్రం.. సమాజంలోని నేటి పరిస్థితుల ఆధారంగా సోషల్ మెసేజ్‌తో ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

పవన్ సినిమాపై హరీశ్ శంకర్ కీలక ప్రకటన

పవన్ సినిమాపై హరీశ్ శంకర్ కీలక ప్రకటన


ప్రస్తుతం పవన్ చేస్తున్న మూడు సినిమాల్లో హరీశ్ శంకర్ తెరకెక్కించే దానిపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. దీనికి కారణం గతంలో వీళ్లిద్దరి కాంబోలో ‘గబ్బర్ సింగ్' వంటి సూపర్ హిట్ మూవీ రావడమే. ఇటీవల ఆ సినిమా ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకుంది. దాన్ని పురస్కరించుకుని హరీశ్ శంకర్.. పవన్‌తో చేసే సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తాడని ప్రకటించాడు.

నిర్మాణ సంస్థ ప్రకటన.. ఫ్యాన్‌లో అయోమయం

నిర్మాణ సంస్థ ప్రకటన.. ఫ్యాన్‌లో అయోమయం

హరీశ్ శంకర్.. పవన్‌తో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దీన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ.. త్వరలోనే హరీశ్ శంకర్‌తో సినిమా చేయబోతున్నట్లు ట్వీట్ చేసింది. దీంతో హరీశ్.. పవన్ సినిమాను పక్కన పెట్టేసి.. ఆ ప్రాజెక్టు చేయబోతున్నాడా అన్న అనుమానం అందరిలోనూ కలుగుతోంది.

Recommended Video

#HappyBirthDayNTR Hashtag Top Trending In Twitter, Near To 20 Million Tweets
పవన్ కల్యాణ్ తర్వాతనే ఏదైనా.. డైరెక్టర్ క్లారిటీ

పవన్ కల్యాణ్ తర్వాతనే ఏదైనా.. డైరెక్టర్ క్లారిటీ


పవన్ కల్యాణ్‌తో సినిమా కంటే ముందు మరో ప్రాజెక్టు చేయబోతున్నాడని జోరుగా ప్రచారం సాగుతోన్న నేపథ్యంలో... హరీశ్ శంకర్ స్వయంగా స్పందించాడు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా.. ‘నేను ప్రస్తుతం PSPK28 మీదనే దృష్టి సారించాను. స్క్రిప్ట్ వర్క్, మ్యూజిక్ వర్క్ జరుగుతోంది. నేను ఏ ప్రాజెక్ట్ చేయాలన్నీ దీని తర్వాతనే' అంటూ క్లారిటీ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X