twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పోకిరి సినిమాకు మహేష్ హీరో కాదట.. పూరీ ఎంచుకొన్న హీరో.. అసలు టైటిల్ ఏంటో తెలుసా?

    |

    దర్శకుడు పూరి జగన్నాథ్, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వచ్చిన పోకిరి చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. అలాంటి చిత్రం ఏప్రిల్ 28 తేదీకి 14 ఏళ్లు పూర్తి చేసుకొన్నది. అయితే పోకిరి సినిమా వెనుక ఆసక్తికరమైన సీక్రెట్ ఉంది. అదేమిటంటే.. పోకిరి కథ రాసుకొన్నప్పుడు ఈ సినిమాలో మహేష్ కాదట. అంతేకాకుండా టైటిల్ కూడా వేరే ఉండేనట.. ఇంతకు పూరి మదిలో కథ పుట్టినప్పుడు హీరో, టైటిల్ ఏమిటంటే..

    కెరీర్‌ను మలుపు తిప్పే సినిమా కోసం మహేష్

    కెరీర్‌ను మలుపు తిప్పే సినిమా కోసం మహేష్

    పోకిరి సినిమాకు ముందు తన కెరీర్‌ను మలుపు తిప్పే సినిమా కోసం మహేష్‌బాబు ఎదురుచూస్తున్నాడు. ఆ సమయంలోనే పోకిరి కథ చెప్పడం.. ఆ సినిమాకు పోకిరి అనే టైటిల్ అని పూరీ చెబితే మహేష్ షాక్ తినడం జరిగింది. సినిమా టైటిల్ పోకిరి అని పూరి చెప్పినప్పుడు ఇదేం టైటిల్ అనుకొన్నాను అని స్వయంగా మహేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది.

     పూరీ డైలాగ్స్, స్క్రీన్ ప్లేతో

    పూరీ డైలాగ్స్, స్క్రీన్ ప్లేతో

    మహేష్ బాబు కోరుకొన్నట్టుగానే పోకిరి చిత్రం టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. పూరి రాసిన డైలాగ్స్, స్క్రీన్ ప్లే ప్రేక్షకులను థ్రిల్ చేసింది. అంతేకాకుండా మహేష్‌బాబుకు కమర్షియల్ హిట్‌ను ఇవ్వడమే కాకుండా స్టార్ స్టేటస్‌ను కూడా తెచ్చిపెట్టింది. పోకిరి విజయం తర్వాత మహేష్ నంబర్ 1 స్థానాన్ని చేరుకొన్నాడనే విషయం అందరికీ తెలిసిందే.

    పోకిరి టైటిల్‌కు బదులుగా

    పోకిరి టైటిల్‌కు బదులుగా

    ఇక పోకిరి సినిమా కథ రాసుకొన్నప్పుడు పూరీ తన స్క్రిప్టుకు పెట్టుకొన్న పేరు ఉత్తమ్ సింగ్ s/o సూర్యనారాయణ. ఆ సినిమాను రవితేజతో నాగబాబు సొంత ప్రొడక్షన్ అంజనీదేవీ బ్యానర్‌పై నిర్మించాలని ప్లాన్ చేశారట. అయితే తీరా చూస్తే ఆ సినిమా మహేష్‌తో మంజుల ఘట్టమనేనితో కలిసి పూరి సంయుక్తంగా నిర్మించడం జరిగింది.

     నాగబాబుతో చేయకపోవడానికి కారణం

    నాగబాబుతో చేయకపోవడానికి కారణం

    ఉత్తమ్ సింగ్ s/o సూర్యనారాయణ టైటిల్ పోకిరిగా ఎందుకు మారింది? నాగబాబు సొంత ప్రొడక్షన్ కాకుండా పూరీ జగన్నాథ్ సొంత బ్యానర్‌లో ఎందుకు నిర్మించాడు? రవితేజ కాకుండా మహేష్‌తో ఎందుకు తీశాడు అనే మిలియన్ డాలర్ ప్రశ్నలకు పూరీ జగన్నాథ్ సమాధానం చెబితే అసలు విషయం తెలుస్తుంది.

    Recommended Video

    Ileana D’Cruz Viral Pic || మొత్తం చూపించేస్తూ పిచ్చెక్కిస్తోంది..!!
    టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్‌గా

    టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్‌గా

    ఇక పోకిరి చిత్రం అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో చరిత్రను తిరగరాసిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. సుమారు 12 కోట్ల రూపాయాలతో తెరకెక్కించిన చిత్రం ఓవరాల్‌గా 70 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఆ సమయంలో చిరంజీవి కూడా ఆ రేంజ్‌లో వసూళ్లను సాధించకపోకపోవడం గమనార్హం. మహేష్‌ను సూపర్‌స్టార్‌గా నిలబెట్టిన చిత్రం పోకిరి అనడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు.

    English summary
    14 years of Pokiri: Puri Jagannadh's Pokiri was biggest hit in the Tollywood and highest grosser at that time. Reports suggest that, Mahesh Babu was not Puri's choice first. His choice is Ravi Teja as hero, Nagababu as producer for his original title Uttam Singh S/o Surya Narayana.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X