15 Years of Magadheera: రాంచరణ్ ఇండస్ట్రీ హిట్.. రాజమౌళి పాన్ ఇండియా రిలీజ్ ఎందుకు చేయలేదంటే?
ఇప్పుడు టాలీవుడ్ సినిమా ప్రపంచ పటంలో ఎలాంటి స్థానంలో ఉందో అందరికీ తెలుసు. మరి దీనిని ఎవరు ఆ స్థానంలో పెట్టారో కూడా అందిరికీ తెలుసు. మరి అందుకు కారణమైన ఆ దర్శకుడే ఎస్ ఎస్ రాజమౌళి.. తన మొదటి సినిమా నుంచి కూడా ఎన్నో పవర్ఫుల్ కథలు అందించిన జక్కన్న ఒక్క "మగధీర" అనే సినిమాతో టాలీవుడ్ లో ఒక కొత్త ఒరవిడిని తీసుకొచ్చారని చెప్పడంలో సందేహం లేదు.
అన్నీ పర్ఫెక్ట్ గా సెట్టయ్యి కొన్ని సినిమాలు ఎవర్ గ్రీన్ గా నిలిచిపోతాయి. అలాంటి సినిమాల్లో దర్శకుడు రాజమౌళి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో అది కూడా చరణ్ కెరీర్ లో రెండో సినిమాగానే చేసేసిన చిత్రం ఇది. చరణ్ డెబ్యూ చిత్రం చిరుత 2007 లో వస్తే 2009 లో "మగధీర" వచ్చింది. అప్పటివరకు ఒక ఫార్మాట్ లో వెళుతున్న టాలీవుడ్ ఇండస్ట్రీని ఫాంటసీ, రెండు జన్మల ప్రేమ కథ, 100 మంది ఫైట్ అంటూ జక్కన్న మెగా హీరోతో చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు.

వారియర్ గా రామ్ చరణ్ పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడం ఆ డైలాగ్స్, ఓహో "మగధీర" లో ప్రతి ఎలిమెంట్ కూడా ఒక అద్భుతమే అని చెప్పాలి. ఆ సమయంలో మగధీర అనే సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా ఇండియా లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా. నిర్మాత అల్లు అరవింద్ తన దగ్గర ఉన్న మొత్తాన్ని ఈ ఒక్క సినిమాకే పెట్టేసారు.
ఇలా రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం విడుదల అయ్యాక రెస్ట్ ఈజ్ హిస్టరీ అన్నట్టుగా అప్పటివరకు ఉన్న పోకిరి ఆల్ టైం రికార్డు ని డబుల్ మార్జిన్ లో కొట్టి ఒక్కసారిగా ఇండియా మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసింది. ఇంకా రాజమౌళి బాహుబలి లాంటి సినిమాలు చేయడానికి మగధీర చిత్రమే ఒక నాంది అని రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుడే ఇటీవల చెప్పాడు. ఇన్ని సంచలనాలు సెట్ చేసిన ఈ చిత్రం నేటికి జూలై 30కి విడుదల అయ్యి 15 వసంతాలు పూర్తి చేసుకుంది.
ఈ సినిమాని చూసి దీనిని కొట్టేయాలని ఈ తరహా కాన్సెప్ట్, భారీ బడ్జెట్ లతో కూడా కొన్ని సినిమాలు వచ్చాయి కానీ మగధీర లో సగం వసూళ్లు కూడా రాబట్టలేకపోయాయి. మరి ఇంతలా సెన్సేషన్ అయ్యిన మగధీర కేవలం రీజనల్ గానే ఎందుకు ఆగిపోయింది? ఎందుకు పాన్ ఇండియా రిలీజ్ కాలేదు అని చాలా మందిలో ప్రశ్న ఇప్పటికీ ఉండి ఉంటుంది.

నిజానికి మగధీర సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేయాలని రాజమౌళి మైండ్ లో ఐడియా ఉందట. కానీ ఎందుకు ఆగిపోయింది అనే దానికి కూడా కారణం ఉందట. ఈ సినిమాని అప్పట్లోనే పాన్ ఇండియా రిలీజ్ చేద్దామని జక్కన్న అల్లు అరవింద్ ని అడిగారట. కానీ అప్పటికే మొత్తం డబ్బులు కేవలం సినిమా మీదే పెట్టేసాం ఇక మిగతా భాషల్లో అంటే అయ్యే పని కాదని నిర్మాత చెప్పడంతో అక్కడికి పాన్ ఇండియా రిలీజ్ ఆలోచన నుంచి బయట పడ్డారట.
కానీ రిలీజ్ అయ్యి భారీ సక్సెస్ అయ్యాక ప్లాన్ చేద్దాం అనుకున్నారని ఎందుకో అలా ఇక కుదరలేదట. కానీ ఈ సినిమా కానీ ఈ సమయంలో వచ్చి ఉంటే మాత్రం అప్పటి కన్నా పెద్ద హిట్టయ్యి సంచలన వసూళ్లు రాబట్టి ఉండేది అని అభిమానులు ఇప్పటికీ అనుకుంటారు. మరి కొన్ని క్లాసిక్స్ ఏ సమయానికి రావాలని ఉంటుందో ఆ సమయానికే వస్తాయి గుర్తుండిపోతాయి. వాటి ఎరా అలా నిలిచిపోతుంది అంతే. కాగా ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తే ఆమెకి ఇండస్ట్రీలో ఈ సినిమానే పెద్ద బ్రేక్ గా నిలిచింది. అలాగే ఎం ఎం కీరవాణి అద్భుతమైన సంగీతం అందించారు. అలాగే దివంగత నటుడు శ్రీహరి పవర్ఫుల్ పాత్ర చేశారు.


Click it and Unblock the Notifications











