For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  17 years of arya: 4 కోట్లు పెడితే ఊహించని లాభాలు అందించిన మూవీ.. ఫస్ట్ ఆ హీరోకు చెబితే రిజెక్ట్!

  |

  ఒక సినిమా సెట్స్ పైకి వచ్చింది అంటే తెరవెనుక జరిగే మినీ యుద్ధాలు చాలానే ఉంటాయి. ఏ సినిమా కూడా అంత ఈజీగా పూర్తవ్వదు. దర్శకుడు కథ రాసుకున్న తరువాత కూడా అనేక రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇక ఆర్య విషయంలో కూడా సుకుమార్ ఎన్నో ఇబ్బందులను దాటి తెరపైకి తీసుకువచ్చాడు. ఆ సినిమాకు 4కోట్లు పెడితే ఊహించని లాభాలు అందించింది. ఇక ఆర్య సినిమాను రిజెక్ట్ చేసిన హీరోలు కూడా ఉన్నారు. అలాంటి విషయాలపై ఒక లుక్కేస్తే..

  #17YearsOfAarya : Allu Arjun ఎమోషనల్, లో బడ్జెట్ హెవీ ప్రాఫిట్స్ ! || Filmibeat Telugu
  17 ఏళ్ళ ఆర్య..

  17 ఏళ్ళ ఆర్య..

  2004 మే 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్య నేటితో 17 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించిన పోస్టర్లను షేర్ చేస్తూ ఆనాటి విషయాలను కూడా గుర్తు చేసుకుంటున్నారు. చిత్ర యూనిట్ సభ్యులు కూడా సినిమా అనుభూతులను పంచుకుంటున్నారు.

  రిస్క్ అని టెన్షన్ పెట్టేసారు

  రిస్క్ అని టెన్షన్ పెట్టేసారు

  ఆర్య సినిమాతోనే అల్లు అర్జున్ కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది. అప్పటివరకు వచ్చిన రొటీన్ కమర్షియల్ ప్రేమ కథలకు భిన్నంగా తెరకెక్కిన ఆ సినిమా ఒక ట్రెండ్ సెట్ లా నిలిచింది. ఆ సినిమా కథ విన్న కొంతమంది సినీ ప్రముఖులు కూడా చాలా రిస్క్ తో కూడుకున్న కథ అని నిర్మాత దిల్ రాజుని టెన్షన్ పెట్టేసారు.

  దిల్ సినిమా తరువాత..

  దిల్ సినిమా తరువాత..

  దర్శకుడు సుకుమార్ మొదట దిల్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. ఆ తరువాత దిల్ రాజుకి ఆర్య కథను చెప్పి సింగిల్ సిట్టింగ్ లో ఇంప్రెస్ చేశాడు. దిల్ రాజు కూడా ఆ కథను ఎంతగానో మెచ్చుకున్నాడు. ఇక అప్పుడప్పుడే ఎదుగుతున్న యువ హీరోలతో ఆ సినిమా చేస్తే బావుంటుందని అనుకోని కొంతమందిని కలిశారు.

  కథ మార్చాలని సలహాలు

  కథ మార్చాలని సలహాలు

  కథ వినగానే హీరోయిన్ కు మరో లవర్ ఉండడం ఏమిటని , అలాగే హీరో పాత్రలో కూడా పెద్దగా బలం లేదనే నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. కథ మార్చితే ఒప్పుకుంటామని కొంతమంది అన్నారు. కానీ సుక్కు మాత్రం అందుకోసం ఒప్పుకోలేదు. సినిమాలో ఎమోషన్ మిస్ కాకూడదని తన అనుకున్న పాయింట్ ను కరెక్ట్ గా ప్రజెంట్ చేయాలని బలంగా ఫిక్స్ అయ్యాడు. దిల్ రాజు కూడా అతనికి అండగా నిలిచారు.

  ప్రభాస్ కు చెబితే..

  ప్రభాస్ కు చెబితే..

  ఇక ఈ సినిమా కథ ప్రభాస్ వద్దకు కూడా వెళ్లిందట. అప్పుడే వర్షం సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న ప్రభాస్ కథలతో రిస్క్ చేయకూడదని ఆర్య సినిమా వస్తే నిర్మొహమాటంగా నో చెప్పేశాడట. ఇక సుకుమార్ చివరికి అల్లు అర్జున్ కు కథ చెప్పగానే కంటెంట్ కొత్తగా ఉందని వెంటనే ఒప్పేసుకున్నాడు.

  4 కోట్లు ఖర్చు చేస్తే..

  4 కోట్లు ఖర్చు చేస్తే..

  ఇక ఆర్య సినిమాను దిల్ రాజు కేవలం 4కోట్లతో తెరకెక్కించాడు. ఇక దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ కు అప్పట్లో బాగా బజ్ క్రియేట్ చేసింది. దీంతో వీకెండ్ అనంతరం కంటిన్యూగా హౌజ్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. 56 సెంటర్లలో 100రోజులు ఆడిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 36కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. ఆ సినిమాతో దిల్ రాజు అగ్ర నిర్మాతగా గుర్తింపు అందుకున్నాడు.

  English summary
  Puspa is also one of the biggest pan Indian movies coming out of Tollywood. Needless to say, the range of what fans have been waiting for for this film, which will be directed by creative director Sukumar, is special. This is also the highest budget movie of the stylish star career. The villain role in the film was given a final clarification.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X