twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్‌, రాంచరణ్‌ను దారుణంగా..ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్వీట్స్.. ట్విట్టర్‌లో ఫ్యాన్ వార్

    |

    ఒక్కప్పుడు సినిమా హీరోల స్టామినా బాక్సాఫీస్ లెక్కల్లో కొలిచేవారు. మా సినిమా ఇన్ని రోజులు ఇన్ని సెంటర్లో అడింది అని చెప్పుకోవడం గొప్ప. అది కాస్తా మారిపోయి వంద కోట్లు రెండు వందల కోట్లు కొల్లగొట్టాడని గొప్పగా చెప్పుకోవడమూ చూస్తున్నాం. కానీ ప్రస్తుతం హీరోల గౌరవం, ప్రతిష్ట అన్నీ సోషల్ మీడియా రికార్డుల మీదే ఉన్నాయి. మా హీరోలకు ఇంత మంది ఫాలోవర్స్ ఉన్నారని చెప్పుకోవడం ఓ గొప్ప అయితే.. బర్త్ డేలు, ఫస్ట్ లుక్, సినిమా పోస్టర్లు, కామన్ డీపీలు, ఏదైనా స్పెషల్ అకేషన్స్‌ను ట్రెండ్ చేయడం ప్రస్తుత రికార్డులు.

    నేడు సింహాద్రి జోరు..

    నేడు సింహాద్రి జోరు..

    నేడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా జూ ఎన్టీఆర్, సింహాద్రి సినిమాలకు సంబంధించిన ట్వీట్లే దర్శనమిస్తాయి. ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ప్రెస్టీజీయస్‌గా తీసుకుని మరీ ట్రెండ్ చేస్తున్నారు. ఇండస్ట్రీ హిట్ కొట్టిన సింహాద్రికి పదిహేడేళ్లు కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

    మిలియన్ల ట్వీట్స్..

    మిలియన్ల ట్వీట్స్..

    ఈ మేరకు 17YearsForIHSimhadri అనే హ్యాష్ ట్యాగ్‌తో నిన్నటి నుంచి ట్రెండ్ చేయడం మొదలు పెట్టారు. ఇప్పటి వరకు 7.6 మిలియన్ల ట్వీట్లతో రికార్డులు బద్దలు కొట్టారు. అయితే ఈ ట్వీట్ల సునామీని చూసి సూపర్ స్టార్ మహేష్ బాబు తెగ కంగారు పడిపోతోన్నాడట. తన పోకిరి చిత్రం పేరిట ఉన్న రికార్డులు చెల్లాచెతురవుతున్నాయని వాపోతున్నాడట. అలా అని ఓ తారక్ ఫ్యాన్ చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.

    మహేష్ బాబు, రామ్ చరణ్ పేరిట..

    మహేష్ బాబు, రామ్ చరణ్ పేరిట..

    సింహాద్రి పేరిట ఫ్యాన్స్ చేస్తున్న రచ్చపై వేరే హీరోలు స్పందించినట్టు తారక్ ఫ్యాన్స్ ఓ ట్వీట్‌ను వైరల్ చేస్తున్నారు. ‘హేయ్ తారక్.. మీ ఫ్యాన్స్‌ను చూస్తుంటే నా పోకిరి ట్రెండ్ రికార్డును బ్రేక్ చేస్తారేమోనని నాకు చాలా భయవేస్తోంది.. మీకు పుచ్చకాయలు కొనిస్తాను వదిలేయండయ్యా.. రాజమౌళి సర్ ప్లీజ్ మీరు నాతో ఓ సినిమా చేయండి త్వరగా.. కావాలంటే మీ సినిమా కోసం గడ్డం పెట్టుకుంటా.. చెస్ట్ ప్యాడ్‌లు వాడతాన'ని మహేష్ బాబు, రామ్ చరణ్ పేర్కొన్నట్టుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్వీట్లతో రెచ్చిపోతున్నారు.

    సోషల్ మీడియాలో రచ్చ..

    సోషల్ మీడియాలో రచ్చ..

    ఇలా తమ హీరోల పేరును పెట్టుకుని మళ్లీ ఎన్టీఆర్ గురించి ట్వీట్ చేయడంపై కొందరు ఫ్యాన్స్ కస్సుమంటున్నారు. అయితే నేడు సింహాద్రి జోరు నడవడంతో అంతా ట్వీట్లు చేయడంలోనే తలమునకలై ఉన్నారు. మొత్తానికి నేడు సింహాద్రి జోరును ఆపడం ఎవరి తరం కాదేమోననిపిస్తోంది.

    Recommended Video

    Amrutha Pranay కామెంట్స్ పై స్పందించిన Ram Gopal Varma
    పదేళ్ల పోకిరి..

    పదేళ్ల పోకిరి..

    ఇక ఓ సారి మహేష్ బాబు పోకిరి చిత్రం గురించి చూద్దాం. ఆ చిత్రం వచ్చి పదేళ్లు గడిచిన సందర్భంగా నాడు సోషల్ మీడియాలో సూపర్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాను ఊపేశారు. మొత్తంగా వారు ట్వీట్ల వర్షం కురిపించి..8.5మిలియన్ల వరకు లాక్కొచ్చారు. అయితే సింహాద్రి పేరిట ఇప్పటికే 8మిలియన్లు దాటిపోయాయి. ఇక పోకిరి ఇంకో గంటలో దాటేస్తారు.

    English summary
    Jr NTR Fans Creates Storm On Social Media On 17 Years For Simhadri. Fans trending Simhadri As Occasion Of completing the 17 Years. mahesh babu Says that
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X