2 Years Of Vakeel Saab: బాక్సాఫీస్ వద్ద మొదట్లోనే పెను తుఫాను.. అప్పట్లో కలెక్షన్స్ ఎంతంటే?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలలో పవన్ కళ్యాణ్ అగ్రస్థానంలో ఉంటాడు అని చెప్పవచ్చు. అతను ఎలాంటి సినిమా చేసిన కూడా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో కలెక్షన్స్ అందుతూ ఉంటాయి. దాదాపు పెట్టిన పెట్టుబడి మొత్తం కూడా మొదట్లోనే వచ్చే రేంజ్ లో ఓపెనింగ్స్ నమోదు అవుతూ ఉంటాయి.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి రెండేళ్లు అవుతోంది ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ ఓపెనింగ్స్ అందుకుంది. ఇక సినిమా వచ్చి నేటికి 2 ఏళ్ళు అయ్యింది. ఇక ఒకసారి సినిమా బాక్సాఫీస్ వివరాల్లోకి వెళితే..

2 years of pawan kalyan vakeel saab movie box office collections

డిజాస్టర్ ఎదుర్కొన్న తరువాత: అజ్ఞాతవాసి సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఊహించిన విధంగా డిజాస్టర్ ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత రాజకీయాల్లో చాలా బిజీగా మారిపోయాడు. అయితే మళ్లీ సినిమాల్లోకి వస్తారా రారా అని అనుకుంటున్న సమయంలో కరెక్ట్ గా వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. బాలీవుడ్లో మంచి విజయాన్ని అందుకున్న పింక్ కథకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ గా అదిరిపోయేలా యాక్టింగ్ చేశాడు.

మొదర్లోమే: మహిళల హక్కుల కోసం అలాగే వారి వ్యక్తిగత స్వేచ్ఛ ఇలా అన్ని అంశాలు ఆ సినిమాలో హైలెట్ గా నిలిచాయి. ఇక పవన్ కళ్యాణ్ ఆ సినిమాలో కనిపించిన విధానం అలాగే డైలాగ్ డెలివరీ కూడా ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా 2021 ఏప్రిల్ 9న విడుదల అయింది. దిల్ రాజు ప్రొడక్షన్లో వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది.

2 years of pawan kalyan vakeel saab movie box office collections

ప్రభుత్వం నుంచి ఇబ్బందులు: అయితే ఈ సినిమా విడుదల సమయంలో ఏపీ ప్రభుత్వం నుంచి తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదురైన విషయం తెలిసిందే. టికెట్ల రెట్ల విషయంలో కావాలని టార్గెట్ చేసినట్లుగా కూడా అనేక రకాల కామెంట్స్ అయితే వెలువడ్డాయి. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి రోజే ఏపీ తెలంగాణలో 32 కోట్లు వచ్చాయి. విజయాన్ని సొంతం చేసుకుంది. దిల్ రాజు అయితే సినిమాకు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలను అందుకున్నారు.

అక్కడ ఎంత వచ్చాయంటే: రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 78.77 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకున్న వకీల్ సాబ్ 121 కోట్ల గ్రాస్ సొంతం చేసుకున్నాడు. ఇక కర్నాటక రెస్ట్ ఆఫ్ ఇండియా 3.67 కోట్లు, ఓవర్సీస్ 3.92 కోట్లు వచ్చాయి. ఈ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయని ఎవరు ఊహించలేదు. కేవలం పవన్ స్టార్ ఇమేజ్ తోనే సినిమాకు అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి.

2 years of pawan kalyan vakeel saab movie box office collections

టోటల్ గ్రాస్: ఎంతో కాలంగా పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయాలని అనుకుంటున్నా ఆయన ఈ సినిమా ద్వారా తన కోరికను నెరవేర్చుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొత్తంగా 86 కోట్ల షేర్, 137 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంది. ఇక ఏపీలో టిక్కెట్ల రేట్ల వలన కొన్ని ఏరియాలలో అనుకున్న దానికంటే తక్కువ కలెక్షన్స్ వచ్చాయి.

బౌన్స్ బ్యాక్: పవన్ కళ్యాణ్ గ్యాప్ ఇచ్చినప్పటికీ కూడా ఆయన రేంజ్ ఏ మాత్రం తగ్గలేదు అని ఈ సినిమాతో అర్థమైంది. అంతే కాకుండా ఇది ఒక రీమేక్ కథ అయినా కూడా పవన్ కళ్యాణ్ కోసం ఫ్యాన్స్ ఎగబడి చూశారు. అంతే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా థియేటర్స్ కు క్యూ కట్టారు. ఇక ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయిన పవన్ అదే ఫ్లో లో కొనసాగుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X