20 years for kushi: ఫస్ట్ భూమికను అనుకోలేదు, షూటింగ్‌లో పవన్ కళ్యాణ్ కోపం.. కలెక్షన్స్ ఎంతంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనగానే అందరికి ఎక్కువగా గుర్తొచ్చే సినిమాల్లో 'ఖుషి' ఒకటి. ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఆ సినిమా తోనే పవన్ అభిమానుల సంఖ్య కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. 2001 ఏప్రిల్ 27న విడుదలైన ఆ సినిమా నేటితో 20 ఏళ్లను పూర్తి చేసుకుంది. ఇక సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను చిత్ర నిర్మాత ఏఎమ్.రత్నం ఇంటర్వ్యూలో తెలియజేశారు.
Recommended Video

విజయ్ కంటే ముందే పవన్ చేయాల్సింది..
నిజానికి ఖుషి కథ మొదట తమిళ్ లో తెరకెక్కినప్పటికి విజయ్ కంటే ముందు పవన్ కళ్యాణ్ కు చెప్పడం జరిగింది. అయితే అప్పుడు పవన్ బిజీగా ఉండడం వల్ల ముందు తమిళ్ లో చేశారట. ఇక బద్రి అనంతరం ఖుషి లాంటి కథ రిస్క్ అని తెలిసినప్పటికీ డైరెక్టర్ మీద నమ్మకంతో పవన్ తుది నిర్ణయం తీసుకున్నాడు.

తెలుగు సినిమాలో మొదటి హిందీ సాంగ్
ఇక సినిమాను తమిళ్ లో తీసినట్లు కాకుండా పూర్తిగా తెలుగు స్టైల్ లో పవన్ కళ్యాణ్ కు తగ్గట్లుగానే మార్చేశారు. పవన్ కూడా చాలా నిర్ణయాల్లో తన సలహాలు ఇచ్చినట్లు నిర్మాత తెలిపారు. తమిళ్ లో మొదటి పాట ఐటెమ్ సాంగ్ తరహాలో ఉంటుంది. కానీ పవన్ కోరిక మేరకు జాతీయ భాషలో ఒక మంచి సందేశాన్ని ఇచ్చే సాంగ్ ను అందించాలని చెప్పాడట. అందుకే హిందీలో 'ఏ మే రాజహా' అనే పాటను అందించారు.

ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు
ఇక సినిమా ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టదు. అన్నిటికంటే ముఖ్యంగా హీరోయిన్ పాత్ర కూడా చాలా హెల్ప్ అయ్యింది. జస్ట్ ఒక అమ్మయి అబ్బాయి మధ్యలో ఉన్నటువంటి ఈగో క్లాష్ ను దర్శకుడు చాలా అందంగా ప్రజెంట్ చేసిన విధానం జనాలను ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. దానికి తోడు మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు.

భూమిక కంటే ముందు..
ఇక సినిమాలో మొదట హీరోయిన్ విషయంలో చాలా చర్చలు జరిగాయట. బద్రి సినిమాలో నటించిన అమీషా పటేల్ ను ఫైనల్ చేయాలని అనుకున్నారు. కానీ ఆమె అప్పుడే హిందీలో వరుసగా ఛాన్సులు అందుకుంటూ బిజీ అవ్వడం వలన డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయిందట. దీంతో నిర్మాత, దర్శకుడు భునికను ఫైనల్ చేశారు.

షూటింగ్ స్పాట్ లో పవన్ కోపం
పవన్ ఆలోచనా విధానం బాధ్యతాయుతంగా నడుచుకునే విధానం గురించి కూడా నిర్మాత రత్నం పలు విషయాలను ఉదాహరణగా చెప్పారు. ఒకసారి పవన్ కు షూటింగ్ స్పాట్ లో చాలా కోపం వచ్చిందట. సినిమా సెట్ కోసం ఒక్క పెద్ద చెట్టు కొమ్మలను నరికేయడంతో అది చాలా తప్పు అని అప్పుడే తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసినట్లు ఏఎమ్.రత్నం వివరించారు.

బాక్సాఫీస్.. ట్రెండ్ సెట్టర్
ఇక సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అప్పట్లోనే అత్యదిక వసూళ్లు అందుకున్న సినిమాగా ట్రెండ్ సెట్ చేసింది. 150రోజులకు పైగా థియేటర్స్ లో సందడి చేసిన ఖుషి దాదాపు 21కోట్ల వరకు ప్రాఫిట్స్ అందించినట్లు టాక్. ఇప్పటి మార్కెట్ తో పోలిస్తే ఆ లెక్కలు మాములుగా ఉండవు. పవన్ కు మాత్రమే కాకుండా భూమిక కెరీర్ కు కూడా ఈ సినిమా ఎంతగానో హెల్ప్ అయ్యింది.


Click it and Unblock the Notifications











