పవర్ స్టార్ ప్రభంజనానికి బీజం వేసిన చిత్రం.. జాతీయ స్థాయిలో, ఆల్ టైం క్లాసిక్ కు 20ఏళ్ళు!
Recommended Video

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో ఎదుగుతున్న రోజులవి. ఇంకా మెగాస్టార్ చిరంజీవి అన్నా చాటు తమ్ముడిగానే పవన్ కళ్యాణ్ సాగుతున్నాడు. ఎలాంటి ప్రయోగాలకు పోకుండా ప్రేమకథలనే ఎంచుకుని పవన్ కళ్యాణ్ వడి వడిగా అడుగులు వేస్తున్నాడు. కొత్త దర్శకుడు కరుణాకరన్ ని పరిచయం చేస్తూ తెరకెక్కించిన తొలిప్రేమ చిత్రం 1998 జులై 24 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ చిత్రం జాతీయ స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తుందని విడుదలకు ముందు ఎవరూ ఊహించివుండరేమో.

సింపుల్ లవ్ స్టోరీ
తొలిప్రేమ చిత్రం అనేది రొమాంటిక్ అండ్ సింపుల్ లవ్ స్టోరీ. పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్, అచ్చతెలుగు కుర్రాడిగా పవన్ నటన, హీరోయిన్ రెడ్డిని దర్శకుడు వెండి తెరపై ప్రజెంట్ చేసిన విధానం యువతకు బాగా కనెక్ట్ అయిన అంశాలు.

జాతీయ స్థాయిలో ప్రశంసలు
సాధారణంగా ప్రేమ వర్గాల ప్రేక్షకులు ఆదరించడం చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటిది ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. అందుకు కారణం చాలా పరిణితితో తెరకెక్కించిన క్లైమాక్స్.

పవిత్రమైన ప్రేమ
క్లైమాక్స్ సన్నివేశంలో ఉన్నత విద్య కోసం హీరోయిన్ ఫారెన్ వెళుతుంటుంది. తమ పవిత్రమైన ప్రేమ వలన విద్యకు ఆటంకం కలుగకూడదు అనే పాయింట్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది.

జాతీయ అవార్డు
ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా తొలిప్రేమ నంది అవార్డుని సొంతం చేసుకుంది. అదే విధంగా ఉత్తమ చిత్రంగా నంది అవార్డులను సైతం ఈ చిత్రం అందుకుంది. తొలిప్రేమ చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రభంజనం టాలీవుడ్ లో కొనసాగడానికి తొలి అడుగు అని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











