twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమాల్లోనే పవర్ స్టార్.. ప్రభావం చూపని పవన్ కల్యాణ్.. జనసేన గల్లంతు

    |

    ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ప్రభావం చూపుతుందని ప్రజలు బలంగా విశ్వసించారు. ధన, అధికార బలం లేని రాజకీయాలను చేసేందుకు జనసేన పార్టీతో ప్రజల్లోకి వెళ్లిన పవన్ కల్యాణ్ ప్రభావం చూపలేకపోయారనే వాదన వినిపిస్తున్నది. జనసేన పార్టీ ఫెర్ఫార్మెన్స్ రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఎన్నికల ఫలితాలకు సంబంధించి వివరాల్లోకి వెళితే..

    పవన్ కల్యాణ్ ముందంజ.. వెనుకంజ

    పవన్ కల్యాణ్ ముందంజ.. వెనుకంజ

    జనసేన పార్టీ పెట్టిన తర్వాత పవన్ కల్యాణ్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లాలోని గాజువాకలో, గోదావరి జిల్లాలోని భీమవరం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. అయితే కడపటి వార్తలు అందేసరికి రెండు చోట్ల కూడా పవన్ కల్యాణ్ గెలుపుకు దూరంగా ఉన్నట్టు కనిపిస్తున్నది. కడపటి వార్తలు అందేసరికి గాజువాకలో ముందంజలో, భీమవరంలో రెండో స్థానంలో ఉన్నట్టు సమాచారం.

     ప్రభావం చూపని జనసేన పార్టీ

    ప్రభావం చూపని జనసేన పార్టీ

    ప్రజలను ఆకర్షించే విధంగా జనసేన పార్టీ తన ఎన్నికల ఎజెండాను రూపొందించింది. పవన్ కల్యాణ్ బృందం తయారు చేసిన ఎన్నికల ప్రణాళిక ప్రభావం చూపింది. కానీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో జనసేన పార్టీ ఎక్కడా కూడా ప్రభావం చూపినట్టు కనిపించలేదు. ఈ అంశంపై రాజకీయ వర్గాల విపరీతమైన చర్చ జరుగుతున్నది.

    ప్రత్యక్ష ఎన్నికల్లోకి

    ప్రత్యక్ష ఎన్నికల్లోకి

    గత ఎన్నికలకు ముందు జనసేన పార్టీతో పవన్ కల్యాణ్ జనంలోకి వెళ్లారు. కానీ ప్రత్యక్ష ఎన్నికలకు పవన్ కల్యాణ్ దూరంగా ఉన్నారు. కొత్త రాష్ట్రం కారణంగా తెలుగుదేశం, బీజేపీలకు మద్దతు పలికారు. కానీ 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రజల్లోకి వెళ్లారు. కానీ ప్రజలపై ప్రభావం చూపలేకపోయిందనే మాట వినిపిస్తున్నది.

    ప్రజా జీవితంపైనే పవన్ కల్యాణ్ దృష్టి

    ప్రజా జీవితంపైనే పవన్ కల్యాణ్ దృష్టి

    ఎన్నికల ఫలితాలకు సంబంధం లేకుండా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రజా జీవితంలో ఉంటానని స్పష్టం చేశారు. సీట్లు ముఖ్యం కాదని, 2019లో ఎన్నికలే లక్ష్యంగా పార్టీని బలపేతం చేస్తానని వెల్లడించారు. 2019లో అధికారం మా లక్ష్యం కాదని పలు సందర్భాల్లో పవన్ కల్యాణ్ వెల్లడించారు. వచ్చే ఐదేళ్లు ప్రజల్లోనే ఉంటామని అన్నారు.

    English summary
    Shock to Pawan Kalyan, Prakash Raj in 2019 Election results, They are trailing behind the their opposition leaders. Balakrishna in lead.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X