2020 బెస్ట్ మూవీస్ లిస్ట్ రిలీజ్ చేసిన ట్విట్టర్: టాప్ -10లో ఐదు తెలుగు సినిమాలు.. ఆ హీరోలకు షాక్!

కొంత కాలంగా తెలుగు సినిమా ఖ్యాతి క్రమ క్రమంగా విశ్వవ్యాప్తం అవుతూనే ఉంది. గతంతో పోలిస్తే ఇప్పుడు భారీ చిత్రాలు తరచుగా వస్తున్నాయి. ఈ కారణంగానే మన సినిమాలు ఇతర భాషల్లోనూ విడుదల అవుతున్నాయి. ఫలితంగా టాలీవుడ్ చిత్రాలు సత్తా చాటడంతో పాటు మన హీరోల మార్కెట్ కూడా గణనీయంగా పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలో ట్విట్టర్ ఇండియా 2020లో ఎక్కువ ట్వీట్లు అందుకున్న సినిమాల జాబితాను తాజాగా విడుదల చేసింది. టాప్- 10లో తెలుగు సినిమాలే ఐదు ఉండడం విశేషం. అదే సమయంలో కొందరు బడా హీరోలకు భారీ షాక్ తగిలింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

Recommended Video

2020 Most Tweeted Movies in Twitter| #Master| #VakeelSaab | #KGF2| #RRR
మొదటి స్థానంలో దక్షిణాది స్టార్ హీరో

మొదటి స్థానంలో దక్షిణాది స్టార్ హీరో

2020లో అత్యధిక ట్వీట్లు అందుకున్న చిత్రాల జాబితాలో ఇళయదళపతి విజయ్ ‘మాస్టర్' మొదటి స్థానంలో నిలిచింది. కాలేజ్ పొలిటికల్ డ్రామా నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో మాలవిక మోహనన్ హీరో విజయ్‌కి జంటగా నటిస్తోంది. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్‌గా చేస్తున్నాడు.

రెండో స్థానంలో పవన్ కల్యాణ్ సినిమా

రెండో స్థానంలో పవన్ కల్యాణ్ సినిమా

సుదీర్ఘ విరామం తర్వాత ‘వకీల్ సాబ్'తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. బాలీవుడ్ ‘పింక్' మూవీకి రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాను వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ట్విట్టర్ విడుదల చేసిన ఉత్తమ చిత్రాల జాబితాలో ఇది రెండో స్థానంలో నిలిచింది.

టాప్‌ 10లో రెండు మహేశ్ సినిమాలు

టాప్‌ 10లో రెండు మహేశ్ సినిమాలు

ఈ ఏడాది అత్యధిక ట్వీట్లు అందుకున్న చిత్రాల జాబితాలో టాప్ -10లో సూపర్ స్టార్ మహేశ్ బాబు చిత్రాలు రెండు చోటు దక్కించుకున్నాయి. ఫలితంగా ఈ ఘనత అందుకున్న ఏకైక హీరోగా అతడు నిలిచాడు. అతడి కొత్త ‘సర్కారు వారి పాట' ఈ లిస్టులో నాలుగో స్థానంలో ఉండగా, గత సంక్రాంతికి విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ‘సరిలేరు నీకెవ్వరు' 8వ ప్లేస్‌లో నిలిచింది.

టాలీవుడ్ స్పెషల్ చిత్రాలు మరో రెండు

టాలీవుడ్ స్పెషల్ చిత్రాలు మరో రెండు

టాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం RRR (రౌద్రం రణం రుధిరం). దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. ఇది ట్విట్టర్ రిలీజ్ చేసిన జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది. అలాగే, సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప' ఏడో స్థానాన్ని అందుకుంది.

మిగిలిన స్థానాల్లో ఆ భాషల చిత్రాలు

ఈ జాబితాలో మిగిలిన స్థానాల్లో... అజిత్ కుమార్ - హెచ్ వినోద్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘వాలిమై' మూడో స్థానంలో ఉంది. సూర్య హీరోగా సుధ కొంగర తీసిన ‘సూరై పొట్రై' (ఆకాశమే నీ హద్దురా) ఐదో స్థానంలో, యశ్ - ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న కన్నడ చిత్రం ‘KGF Chater 2' తొమ్మిదో స్థానంలో, రజినీకాంత్ నటించిన ‘దర్భార్' పదో స్థానంలో నిలిచాయి.

అక్కడి స్టార్ హీరోలకు ఊహిచని షాక్

అక్కడి స్టార్ హీరోలకు ఊహిచని షాక్

2020లో అత్యధిక ట్వీట్లు అందుకున్న చిత్రాల జాబితాలో బాలీవుడ్ నుంచి ఒక్కటంటే ఒక్క చిత్రం కూడా లేకపోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ టాప్ 10 జాబితాలో తెలుగు నుంచి ఐదు సినిమాలు, తమిళం నుంచి నాలుగు, కన్నడం నుంచి ఒక సినిమా చోటు దక్కించుకున్నాయి. దీని బట్టి ఇండియన్ సినిమాపై దక్షిణాది పరిశ్రమ ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X