For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  2020 తెలుగు మల్టీస్టారర్ మూవీల హవా: మొత్తం మెగా హీరోలవే.. ఆ డైరెక్టర్ కొడుకు కూడా!

  |

  మిగిలిన ఇండస్ట్రీలతో పోలిస్తే తెలుగులో మల్టీస్టారర్ మూవీలు చాలా తక్కువ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి తరం హీరోలు ఆ తరహా సినిమాలు చేయడానికి ఏమాత్రం వెనకాడలేదు. కానీ తర్వతి జనరేషన్ వాళ్లు మాత్రం వాటిని అంతగా పట్టించుకోలేదు. అయితే, నేటి తరం వాళ్లు మాత్రం మల్టీస్టారర్ మూవీలు చేయడానికి బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకోసం ఇగోలను పక్కన పెడుతున్నారు. ఈ కారణంగానే కొన్నేళ్లుగా ఆ సినిమాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే 2020 పూర్తవుతోన్న సందర్భంగా షూటింగ్ జరుపుకుంటోన్న భారీ మల్టీస్టారర్ చిత్రాల గురించి తెలుసుకుందాం!

  మల్టీస్టారర్ మూవీలు రావడానికి కారణం ఇవే

  మల్టీస్టారర్ మూవీలు రావడానికి కారణం ఇవే

  కొన్నేళ్లుగా తెలుగులో మల్టీస్టారర్ మూవీల హవా కనిపిస్తోంది. దీనికి కారణం అటువంటి సినిమాలకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనే. మహేశ్ బాబు, వెంకటేష్ కాంబినేషన్‌లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', వెంకటేష్.. పవన్ కల్యాణ్ కలిసి చేసిన ‘గోపాల.. గోపాల', ‘మనం', ‘F2', ‘వెంకీ మామ' సహా మరికొన్ని చిత్రాలు సూపర్ హిట్ అవడంతో హీరోలు రెడీ అంటున్నారు.

  టాలీవుడ్‌లోనే ప్రతిష్టాత్మకంగా రెడీ అవుతోంది

  టాలీవుడ్‌లోనే ప్రతిష్టాత్మకంగా రెడీ అవుతోంది

  ‘బాహుబలి' లాంటి భారీ విజయం తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం RRR. స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. వాస్తవానికి ఇది 2020లోనే విడుదల కావాల్సింది. కానీ, అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

  మెగా హీరోల మల్టీస్టారర్.. వాయిదా పడిందిగా

  మెగా హీరోల మల్టీస్టారర్.. వాయిదా పడిందిగా

  కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తోన్న చిత్రం ‘ఆచార్య'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమా 2020లో విడుదల కాబోతున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ, లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది. దీంతో సినిమా విడుదల కూడా వాయిదా పడింది. ఇందులో కాజల్ హీరోయిన్‌గా చేస్తోంది.

  మరోసారి ఆ హీరోల కాంబో.. మొదలైన ఎఫ్3

  మరోసారి ఆ హీరోల కాంబో.. మొదలైన ఎఫ్3

  విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ నటించిన ఈ మల్టీ స్టారర్ మూవీ ‘F2'. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అనే క్యాప్షన్‌తో వచ్చిందీ మూవీ. దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘F3'ని చేయబోతున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. వచ్చే ఏడాది ఇది విడుదల కానుంది.

  సూపర్ హిట్ సినిమా రీమేక్‌లో పవన్ కల్యాణ్

  సూపర్ హిట్ సినిమా రీమేక్‌లో పవన్ కల్యాణ్

  ‘వకీల్ సాబ్' తర్వాత పవన్ కల్యాణ్.. క్రిష్‌తోనే సినిమా చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ‘అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్ లైన్‌లోకి వచ్చింది. సాగర్ కే చంద్ర తెరకెక్కించనున్న ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇందులో పవర్ స్టార్‌తో పాటు రానా కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

  యంగ్ హీరోలతో పూర్తయిన మల్టీస్టారర్ ఫిల్మ్

  యంగ్ హీరోలతో పూర్తయిన మల్టీస్టారర్ ఫిల్మ్

  నేషనల్ అవార్డు గ్రహీత సతీష్ వేగేశ్న తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం ‘కోతి కొమ్మచ్చి'. ఈ సినిమా ద్వారా తన కొడుకు సమీర్‌ను హీరోగా పరిచయం చేస్తున్నాడు. ఇందులో మరో హీరోగా శ్రీహరి కుమారుడు మేఘాంశ్ కూడా నటిస్తున్నాడు. పల్లెటూరి బ్యాగ్‌డ్రాప్‌తో మల్టీస్టారర్‌గా రాబోతున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఇది విడుదల కానుంది.

  Solo Bratuke So Better First Day Collections | ఇండస్ట్రీకి జోష్ పెంచిన సాయితేజ్ మూవీ
  English summary
  Ayyappanum Koshiyum is a 2020 Indian Malayalam-language action thriller film written and directed by Sachy. It was produced by Ranjith and P. M. Sasidharan under the company Gold Coin Motion Picture Company. The film stars Prithviraj Sukumaran and Biju Menon in the title roles.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X