2020లో వారిదే హవా.. ఓటీటీలో పోటీ పడ్డ హీరోలు

టాలీవుడ్‌లో 2020 ఎలా గడిచిందో అందరికీ తెలిసిందే. మొదటి రెండు మూడు నెలలు థియేర్లలో సినిమాలు బాగానే ఆడాయి. కానీ మార్చిలో విధించిన లాక్డౌన్ నుంచి ఇప్పటి వరకు థియేటర్లు వెలవెలబోయాయి. ఈ ఏడాది పెద్ద హీరోలెవ్వరూ బాక్సాఫీస్ మీద యుద్దానికి రాలేదు. సంక్రాంతి పోరు తప్పా ఇండస్ట్రీలో మళ్లీ బాక్సాఫీస్ కలెక్షన్ల మాట ఎక్కడా కనిపించలేదు. దాదాపు ఏడెనిమిది నెలలు మొత్తం ఓటీటీ హవానే కొనసాగింది.

ఓటీటీలోనూ కొంత మంది హీరోలు మాత్రం తమ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ అదరగొట్టేశారు. ఓటీటీని ఎక్కువగా వాడుకున్న హీరోల్లో సత్యదేవ్ ముందుంటాడు. ఆ తరువాత సిద్దు జొన్నలగడ్డ ఉంటాడు.నవదీప్ కూడా బాగానే వాడుకున్నాడు.కానీ నవదీప్ మాత్రం వెబ్ సిరీస్ అంటూ కొత్తగా ప్రయత్నించాడు. ఇలా చిన్న హీరోలకు ఓటీటీ మంచి పేరు తెచ్చింది. నటుడిగా నిరూపించుకునేందుకు సత్యదేవ్, సిద్దు జొన్నలగడ్డకు సరైన సినిమాలు పడ్డాయి.

2020 Review Satya dev Navdeep And siddhu jonnalagadda Movies In OTT

సత్య దేవ్ మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. 47 డేస్, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య, గువ్వా గోరింక అంటూ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాడు. గుంటూరు టాకీస్ ఫేమ్ సిద్దుజొన్నలగడ్డ రొమాంటిక్ హీరో అవతారమెత్తాడు. కృష్ణ అండ్ హిజ్ లీల, మా వింతగాధ వినుమా అంటూ దుమ్ములేపాడు. ఈ రెండు చిత్రాలు కూడా సిద్దుకు మంచి ఇమేజ్‌ను తీసుకొచ్చాయి. భానుమతి రామకృష్ణ సినిమాతో నవీన్ చంద్ర, కలర్ ఫోటో సినిమాతో సుహాస్, వెబ్ సిరీస్‌లతో నవదీప్.. ఇలా కొంతమందికి ఓటీటీ ప్రపంచం మంచి గుర్తింపును తీసుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X