For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  2020లో షాకిచ్చిన తెలుగు యాంకర్లు: అందాల ఆరబోతతో ఆమె.. ముగ్గురితో రొమాన్స్ చేసి ఈమె!

  |

  తెలుగు బుల్లితెరపై ఎంతో మంది యాంకర్లు సత్తా చాటుతున్నారు. వీరిలో ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న వారిలో సీనియర్ భామ సుమ మినహా మిగిలిన వారందరూ గ్లామర్‌తోనే ఆకట్టుకున్నారని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా శ్రీముఖి, రష్మీ గౌతమ్, అనసూయ భరద్వాజ్, విష్ణు ప్రియలు ఇలా పేరు సంపాదించారని చెప్పొచ్చు. టెలివిజన్ రంగంలో తమ మార్క్ చూపించిన వీళ్లంతా సినిమాల్లోనూ సత్తా చాటారు. ఇక, ఈ ఏడాది తెలుగు యాంకర్లు కొందరు ఊహించని నిర్ణయాలు తీసుకుని షాక్‌కు గురి చేశారు. 2020 పూర్తవుతోన్న సందర్భంగా స్పెషల్ స్టోరీ మీకోసం!

  జబర్ధస్త్ యాంకర్ అనసూయ స్పైసీగా

  జబర్ధస్త్ యాంకర్ అనసూయ స్పైసీగా

  బుల్లితెరపై తనదైన శైలి యాంకరింగ్‌తో సత్తా చాటుతోంది జబర్ధస్త్ బ్యూటీ అనసూయ భరద్వాజ్. కొన్నేళ్ల క్రితమే సినీ రంగంలోకీ అడుగు పెట్టిందామె. ఇక, 2020లో ఆమె కృష్ణ వంశీ తెరకెక్కిస్తోన్న ‘రంగమార్తాండ'లో నటిస్తోంది. ఇందులో అనసూయ రోల్ ఎంతో స్పైసీగా ఉంటుందని ముందే లీక్ చేశారు. దీనితో పాటు అల్లు అర్జున్ ‘పుష్ప', చిరంజీవి ‘ఆచార్య'లోనూ నటిస్తున్నట్లు తెలుస్తోంది.

  హాట్ బ్యూటీ రష్మీ గౌతమ్ రొమాంటిక్‌

  హాట్ బ్యూటీ రష్మీ గౌతమ్ రొమాంటిక్‌

  యాంకరింగ్ రంగంలో ఆకట్టుకున్నప్పటికీ.. సినిమాల పరంగా పెద్ద సక్సెస్‌ను అందుకోలేకపోయింది రష్మీ గౌతమ్. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆమె నందు విజ‌య్ కృష్ణ హీరోగా నటిస్తోన్న ‘బొమ్మ బ్లాక్‌బస్టర్‌'లో నటిస్తోంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో ఆమె పల్లెటూరి అమ్మాయిలా కనిపించనుంది. దీనికి నూత‌న ద‌ర్శ‌కుడు రాజ్ విరాట్ దర్శకత్వం వహిస్తున్నాడు.

  అందాల ఆరబోతతో షాకిచ్చిన భామ

  అందాల ఆరబోతతో షాకిచ్చిన భామ

  యాంకర్ విష్ణు ప్రియ ‘చెక్‌మేట్' అనే మూవీలో లీడ్ రోల్ చేసింది. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌లో అమ్మడు తన అందంతో అదరగొట్టేసింది. అంతేకాదు, క్లీవేజ్ షో చేయడంతో పాటు లిప్‌లాక్ సీన్లలోనూ రెచ్చిపోయింది. అలాగే, బికినీలోనూ కనిపించి అందరినీ షాక్‌కు గురి చేసింది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో జరిగినా అనివార్య కారణాలతో ఇప్పుడు రిలీజ్ అవుతోంది.

  ముగ్గురితో రొమాన్స్ చేస్తున్న శ్రీముఖి

  ముగ్గురితో రొమాన్స్ చేస్తున్న శ్రీముఖి

  బుల్లితెరతో పాటు వెండితెరపైనా సత్తా చాటింది యాంకర్ శ్రీముఖి. గతంలో ఎన్నో చిత్రాల్లో మంచి మంచి పాత్రలు పోషించిన ఆమె.. ఇప్పుడు ‘క్రేజీ అంకుల్స్' అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తోంది. భరణి, సింగర్ మనో, రాజా రవీంద్ర ప్రధాన పాత్రలు పోషిస్తోన్న ఈ సినిమాను ఇ. సత్తిబాబు తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే విడుదల సినిమా ట్రైలర్‌కు విపరీతమైన స్పందన వచ్చింది.

  మేల్ యాంకర్ రికార్డు క్రియేట్ చేశాడు

  మేల్ యాంకర్ రికార్డు క్రియేట్ చేశాడు

  బుల్లితెరపై తన మార్క్ చూపిస్తోన్న ప్రదీప్... పలు సినిమాల్లో చక్కని పాత్రలు చేసి మెప్పించాడు. ఈ క్రమంలోనే ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. నూతన దర్శకుడు మున్నా తెరకెక్కించిన ఈ మూవీలో ప్రదీప్ లవ్ గురూగా కనిపించనున్నాడు. ఆ మధ్య విడుదలైన ఈ చిత్రంలోని ‘నీలి నీలి ఆకాశం' పాట ఎంత హిట్ అయిందో తెలిసిందే.

  English summary
  Popular Telugu celebrities who breathed their last in 2020 Owing to the devastating impact of the catastrophic pandemic, 2020 has mostly been a tragic year for most population all around the ...
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X