twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2020లో మరణించిన సినీ ప్రముఖులు వీళ్లే: మిస్టరీగా మారిన సీరియల్ నటి ఆత్మహత్య కేసు

    |

    2020 సంవత్సరం ఎంతో మంది జీవితాల్లో విషాదాలను నింపిందనే చెప్పాలి. కరోనా వైరస్ సృష్టించిన విళయానికి ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోగా, దీని వల్ల ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. అలాగే, లాక్‌డౌన్ కారణంగా ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అన్ని రంగాల మాదిరిగానే సినీ పరిశ్రమపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపింది. షూటింగులు నిలిచిపోయి, థియేటర్లు మూతపడిపోయి ఎంతో మంది రోడ్డున పడ్డారు. అదే సమయంలో ఈ ఏడాది పలువురు సినీ ప్రముఖులు సైతం పలు కారణాలతో మరణించారు. 2020 ముగుస్తోన్న కారణంగా వాళ్లను ఓసారి గుర్తు చేసుకుందాం.!

    టాలీవుడ్‌నే కాదు.. దేశాన్నే ఏడిపించిన బాలు

    టాలీవుడ్‌నే కాదు.. దేశాన్నే ఏడిపించిన బాలు

    గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం 2020 సెప్టెంబర్ 25న కన్నుమూశారు. కరోనా పాజిటివ్ రావడంతో ఆస్పత్రిలో చేరిన ఆయన.. దాదాపు రెండు నెలల పాటు వెంటిలేటర్‌పై చికిత్స తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. నాలుగు దశాబ్దాల పాటు 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్ రికార్డు సాధించారు. పలు చిత్రాల్లోనూ ఆయన నటించారు.

    తెలుగు వాళ్లను షాక్‌కు గురి చేసిన జేపీ డెత్

    తెలుగు వాళ్లను షాక్‌కు గురి చేసిన జేపీ డెత్

    రంగస్థల నటుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి.. ఆ తర్వాత సినిమాల్లోకి ప్రవేశించిన జయప్రకాశ్ రెడ్డి 2020 సెప్టెంబర్ 8న గుండెపోటుతో మరణించారు. రాయలసీమ మాండలీకంతో విలనిజం పండిస్తూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్న ఆయన.. ‘ప్రేమించుకుందాం రా', ‘సమరసింహారెడ్డి', ‘జయం మనదేరా', ‘చెన్నకేశవరెడ్డి', ‘టెంపర్‌' తదితర సినిమాల్లో అద్భుతంగా నటించి మెప్పించారు.

    దిగ్గజ నటుడి మరణంతో విషాదంలో పరిశ్రమ

    దిగ్గజ నటుడి మరణంతో విషాదంలో పరిశ్రమ

    దాదాపు ఆరు వందలకు పైగా చిత్రాల్లో నటించిన సీనియర్ నటులు రావి కొండలరావు కూడా 2020లోనే మరణించారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధ పడుతోన్న ఆయన గుండెపోటు రావడంతో జూలై 28న తుదిశ్వాస విడిచారు. 1958లో వచ్చిన ‘శోభ' అనే చిత్రంతో సినీ రంగంలోకి ప్రవేశించిన కొండలరావు.. ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు.

    కోవిడ్ కారణంగా చనిపోయిన సీనియర్ ఆర్టిస్ట్

    కోవిడ్ కారణంగా చనిపోయిన సీనియర్ ఆర్టిస్ట్

    ‘మర్యాద రామన్న', ‘విక్రమార్కుడు', ‘ఛలో', ‘పిల్ల జమిందారు' వంటి సినిమాల్లో విలక్షణ నటనను కనబరిచి మంచి గుర్తింపు తెచ్చుకున్న కోసూరి వేణు గోపాల్ కూడా ఈ ఏడాది సెప్టెంబర్ 23న మృతి చెందారు. కరోనా పాజిటివ్ రావడంతో ఆయనను ఓ ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. అక్కడ చికిత్స పొందుతోన్న సమయంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు.

     గుండెపోటు వల్ల మరణించిన విలక్షణ నటుడు

    గుండెపోటు వల్ల మరణించిన విలక్షణ నటుడు

    విలక్షణ నటనతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు జాన్ కొట్టోలీ. ఈ ఏడాది జనవరి 28న ఆయన గుండెపోటుతో మరణించారు. బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా వచ్చిన ‘మను' సినిమాలో కీలక పాత్ర పోషించిన ఆయన.. ఆ తర్వాత ‘ఫలక్‌నుమా దాస్‌', ‘మహానటి', ‘బ్రోచేవారెవరురా' వంటి చిత్రాల్లో అద్భుతంగా నటించి మెప్పించారాయన.

    Recommended Video

    Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
    మిస్టరీగా మారిన సీరియల్ నటి ఆత్మహత్య కేసు

    మిస్టరీగా మారిన సీరియల్ నటి ఆత్మహత్య కేసు

    బుల్లితెరపై ప్రసారం అయ్యే పలు సీరియళ్లలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్న కొండపల్లి శ్రావణి 2020 సెప్టెంబర్ 8న ఆత్మహత్య చేసుకుంది. ట్రైయాంగిల్ లవ్ స్టోరీ కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకుందని పోలీసుల విచారణలో తేలింది. పెళ్లి విషయంలో ఆమెను వేధించి, ఆత్మహత్యకు ప్రేరేపించిన దేవరాజ్, సాయికృష్ణతో పాటు ఓ నిర్మాత కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యాడు.

    English summary
    2020 has mostly been a tragic year for most population all around the world. The year also witnessed the passing of some talented, dazzling and iconic personalities of Telugu cinema. Leaving millions of his fans in dismay, renowned playback singer of Indian cinema SP Balasubrahmanyam passed away in Chennai on September 25 due to a cardio-respiratory arrest.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X