Just In
- 9 min ago
బుట్టబొమ్మ ఫుల్ బిజీ.. కుదరకపోయినా మెగా హీరో కోసం ఒప్పుకుందట
- 16 min ago
జాకెట్ బటన్స్ విప్పేసి పాయల్ రాజ్‌పుత్ రచ్చ: ఎద అందాలతో కనువిందు చేస్తూ హాట్ వీడియో పోస్ట్!
- 1 hr ago
పవన్ కల్యాణ్ కొత్త సినిమా ప్రారంభం: నెల రోజుల పాటు అక్కడే.. కలవనున్న మరో హీరో
- 1 hr ago
ప్రభాస్ తమ్ముడిగా యాక్షన్ హీరో: కండల వీరుడిని ఫైనల్ చేసిన బాలీవుడ్ డైరెక్టర్
Don't Miss!
- Finance
మరో'సారీ': యాక్సెంచర్‌ను వెనక్కి నెట్టి ప్రపంచ నెంబర్ వన్, TCS ఆనందం కాసేపు
- News
సుప్రీం తీర్పుతో వేగంగా నిమ్మగడ్డ అడుగులు- మారిన షెడ్యూల్- కేంద్ర సిబ్బందికి వినతి
- Automobiles
భారత్‌కు హ్యుందాయ్ 'ఎన్-లైన్' పెర్ఫార్మెన్స్ కార్లు వస్తున్నాయ్..
- Sports
ఆసీస్ పర్యటనలో నా విజయ రహస్యం ఇదే: మహ్మద్ సిరాజ్
- Lifestyle
తమకు కాబోయే వారిలో ప్రతి ఒక్కరూ ఎక్కువగా ఏమి కోరుకుంటారో తెలుసా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
2020 లవ్ ఎఫైర్లు: షాక్‌కు గురి చేసిన టాలీవుడ్ స్టార్లు.. లవర్ల పేర్లు లీక్ చేసిన నటులు వీళ్లే
సినీ పరిశ్రమకు చెందిన వారు ఏది చేసినా సంచలనం అవుతుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ హీరో, హీరోయిన్ల లవ్ స్టోరీలంటే అవి ఎంతగా హైలైట్ అవుతాయో.. గతంలో చాలా సందర్భాల్లో రుజువైంది. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన ఎంతో మంది నటీ నటులు తమ తమ లవ్ స్టోరీలను రివీల్ చేశారు. అందులో చాలా మంది ఆ బంధాన్ని పెళ్లి పీటల వరకూ తీసుకెళ్లగా, కొందరు మాత్రం మధ్యలోనే బ్రేకప్ చెప్పేశారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాదిలో అనూహ్యంగా కొందరు బడా స్టార్లు తమ ఎఫైర్లను లీక్ చేసి షాకిచ్చారు. 2020 పూర్తవుతోన్న సందర్భంగా వాళ్ల గురించి స్పెషల్ స్టోరీ మీకోసం!

పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టి లీక్ చేసిన హీరో
టాలీవుడ్‌కు చెందిన యంగ్ హీరో నిఖిల్ చాలా కాలంగా ప్రేమలో ఉన్నాడు. ఈ విషయం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న పుకార్లకు పుల్‌స్టాప్ పెడుతూ తన ప్రియురాలు పల్లవి వర్మను వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. ఇందులో భాగంగానే లాక్‌డౌన్‌లో 2020 మే 14న పెద్దలు నిశ్చయించిన ముహూర్తానికి ఆమె మెడలో తాళి కట్టాడు.

ఏకంగా పెళ్లినే ప్రకటించిన టాలీవుడ్ స్టార్
ఈ ఏడాది తన ప్రేమను రివీల్ చేసిన వారిలో టాలీవుడ్ స్టార్ హీరో నితిన్ కూడా ఉన్నాడు. అతడు కూడా చాలా కాలంగా షాలిని కందుకూరితో ప్రేమలో ఉన్నాడు. ఈ విషయాన్ని ఈ ఏడాది ప్రారంభంలో వెల్లడించిన అతడు.. పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించాడు. ఆ తర్వాత కరోనా నిబంధనలు పాటిస్తూ 2020 జూలై 26న తన ప్రియురాలిని వివాహం చేసుకున్నాడు.

ప్రేమను ప్రకటించి షాకిచ్చిన హంక్ రానా
ఎంతో మందితో ఎఫైర్ సాగిస్తున్నట్లు ప్రచారంతో తరచూ వార్తల్లో నిలిచేవాడు టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా. ఇలాంటి పరిస్థితుల్లో తాను మిహీక బజాజ్ అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నానని ప్రకటించి షాకిచ్చాడతను. ఈ నేపథ్యంలోనే 2020 ఆగస్టు 8న పెద్దల సమక్షంలో ఆమెను వివాహమాడాడు. లాక్‌డౌన్ సమయం కావడంతో ఈ వేడుకకు కుటుంబ సభ్యులే హాజరయ్యారు.

రివీల్ చేసి... నిరాశ పరిచిన చందమామ
టాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలు చేసి స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది కాజల్ అగర్వాల్. ఆమె కూడా 2020లో అనూహ్యంగా తన లవ్ స్టోరీని రివీల్ చేసింది. చాలా కాలంగా ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు వెల్లడించింది. ఆ తర్వాత 2020 అక్టోబర్ 30న అతడిని వివాహం చేసుకుంది. దీనికి కూడా కుటుంబ సభ్యులే హాజరయ్యారు.

అనుమానాలను నిజం చేసిన పాయల్
‘RX100' అనే సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయం అయింది పాయల్ రాజ్‌పుత్. ఆ సినిమాలో ఎంతో బోల్డ్‌గా నటించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత కూడా గ్లామర్‌కు ప్రాధాన్యం ఉన్న సినిమాల్లోనే నటించింది. ఇక, ఈ మధ్య పంథాను మార్చి వైవిధ్యమైన చిత్రాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె తన లవర్ పేరు సౌరబ్ డింగ్రా అని, అతడి ఫొటోను రివీల్ చేసింది.

ఈ జాబితాలో చేరిన తాప్సీ.. రచ్చ రచ్చ
తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించినా సరైన హిట్‌ను తన ఖాతాలో వేసుకోలేకపోయింది బోల్డ్ బ్యూటీ తాప్సీ పన్ను. టాలీవుడ్‌లో రాణించలేకపోయిన ఆమె.. బాలీవుడ్‌లో మాత్రం సత్తా చాటుతోంది. ఇక, ఈ ఏడాది తాను ప్రేమిస్తున్న వ్యక్తి పేరు మాతియస్ బో అని రివీల్ చేసిందామె. అతడు బ్యాడ్మింటన్ ప్రేయర్. ప్రేమ గురించి తెలిసిన తర్వాత లవర్‌తో రచ్చ రచ్చ చేస్తుంది తాప్సీ.