For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  2020లో పెళ్లి చేసుకున్న ప్రముఖులు వీళ్లే: ఇద్దరిది రెండో వివాహం.. మెగా ఫ్యామిలీలో మరో పండుగ

  |

  2020 సంవత్సరం ఎంతో మందికి చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది. మరీ ముఖ్యంగా సినీ పరిశ్రమ కరోనా దెబ్బకు విలవిలలాడిపోయింది. లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు మూతపడిపోయి, షూటింగ్‌లు ఆగిపోవడంతో ఇండస్ట్రీలో పని చేస్తున్న ఎంతో మంది కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అలాగే, షూటింగ్‌కు అంతరాయం ఏర్పడిన కారణంగా చాలా మంది భారీ నష్టాలను ఎదుర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సినీ పరిశ్రమకు చెందిన కొందరు మాత్రం కరోనా పిరియడ్‌లో పెళ్లిళ్లు చేసుకుని ఈ ఇయర్‌ను స్పెషల్‌గా సెలెబ్రేట్ చేసుకున్నారు. 2020 పూర్తవుతోన్న సందర్భంగా ఈ స్పెషల్ స్టోరీ మీకోసం!

  లాక్‌డౌన్‌లో మొదలెట్టిన హీరో నిఖిల్

  లాక్‌డౌన్‌లో మొదలెట్టిన హీరో నిఖిల్

  లాక్‌డౌన్ సమయంలో కరోనా నిబంధనలు అమలులో ఉన్న సమయంలో హీరో నిఖిల్ ఓ ఇంటి వాడయ్యాడు. 2020 మే 14న పెద్దలు నిశ్చయించిన ముహూర్తం ప్రకారం.. తన ప్రియురాలు పల్లవి వర్మ మెడలో తాళి కట్టాడు. నిరాడంబరంగా జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. తన పెళ్లితో టాలీవుడ్‌ బ్యాచ్‌లర్ హీరోలకు మార్గం చూపించాడు నిఖిల్.

  అతడిని ఫాలో అయిపోయిన నితిన్

  అతడిని ఫాలో అయిపోయిన నితిన్

  నిఖిల్ వివాహం అయిన తర్వాత మరో టాలీవుడ్ హీరో నితిన్ కూడా పెళ్లి పీటలెక్కేశాడు. అతడు కూడా ప్రేమించిన అమ్మాయి షాలిని కందుకూరిని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. 2020 జూలై 26న హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలస్‌లో జరిగిన ఈ వేడుకకు తెలంగాణ మంత్రులు యంగ్ హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, కార్తికేయ తదితరులు హాజరయ్యారు.

   టాలీవుడ్ హంక్ కూడా ఆ దారిలోనే

  టాలీవుడ్ హంక్ కూడా ఆ దారిలోనే

  ఎన్నో రోజులుగా టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా ఉన్న దగ్గుబాటి రానా కూడా లాక్‌డౌన్ సమయంలో వివాహం చేసుకున్నాడు. 2020 ఆగస్టు 8న జరిగిన ఈ వేడుకలో తన ప్రియురాలు మిహీక బజాజ్‌ను పెద్దల సమక్షంలో పెళ్లాడాడు. రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ వేడుకకు 30 మంది మాత్రమే అతిథులు హాజరయ్యారు.

  బడా నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి

  బడా నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి

  దిల్ రాజు భార్య అనిత కొన్నేళ్ల క్రితం గుండెపోటుతో మరణించిన సంగతి విధితమే. ఆమె పోయిన తర్వాత చాలా కాలం పాటు ఒంటరిగానే ఉన్న ఆయన.. 2020 మే 10న హైదరాబాద్‌కు చెందిన తేజస్వినీని వివాహం చేసుకున్నారు. లాక్‌డౌన్ కారణంగా నిరాడంభరంగా జరిగిన ఈ వేడుకను నిజామాబాద్‌ జిల్లా నర్సింగ్‌పల్లిలోగల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిపారు.

  చందమామ కాజల్ కూడా ఘనంగా

  చందమామ కాజల్ కూడా ఘనంగా

  చాలా కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది చందమామ కాజల్ అగర్వాల్. చాలా కాలంగా వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు‌తో ప్రేమాయణం సాగించిన ఆమె.. 2020 అక్టోబర్ 30న అతడిని వివాహం చేసుకుంది. ముంబైలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులతో పాటు కొంత మంది ప్రముఖులు హాజరయ్యారు.

  మరో ఇద్దరు కూడా.. ఒక్కటయ్యారు

  మరో ఇద్దరు కూడా.. ఒక్కటయ్యారు

  జబర్ధస్త్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకుని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు మహేశ్. ‘రంగస్థలం', ‘మహానటి' వంటి భారీ చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న అతడు లాక్‌డౌన్ సమయంలో పెళ్లి చేసుకున్నాడు. అతడితో పాటు బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ సామ్రాట్ కూడా వివాహమాడాడు. గతంలో ఒకరిని పెళ్లి చేసుకున్న ఇతడు.. విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.

  మెగా ఫ్యామిలీలో అసలైన పండుగ

  మెగా ఫ్యామిలీలో అసలైన పండుగ

  మరో రెండు రోజుల్లో మెగా ఫ్యామిలీలో అసలైన పండుగ జరగబోతుంది. నాగబాబు కూతురు నిహారిక.. జోన్నలగడ్డ వెంకట చైతన్యను పెళ్లాడబోతుంది. డిసెంబర్ 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మిథున లగ్నంలో వీళ్ల పెళ్లి జరగనుంది. ఈ వేడుక కోసం ఆసియాలోనే రెండో అతిపెద్ద ప్యాలెస్ అయిన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఉదయ్‌విలాస్‌ ముస్తాబవుతోంది.

  English summary
  This lockdown season has turned into official wedding season for Tollywood. Three most eligible bachelors of Telugu film industry have got hitched leaving all their fans happy and joyous. It all started with young actor Nikhil Siddhartha's wedding with his girlfriend Dr Pallavi on May 14 amidst the Coronavirus lockdown.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X