2020లో సంచలన నిర్ణయాలు తీసుకున్న స్టార్స్: విడిపోయిన.. రెండో పెళ్లికి సిద్ధమైన వాళ్లు వీళ్లే!

మిగిలిన రంగాల వారిలో పోలిస్తే సినీ పరిశ్రమకు చెందిన సెలెబ్రిటీల ప్రేమ వ్యవహారాలు, పెళ్లిళ్లపై జనాలకు ఎక్కువ ఆసక్తి ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ అభిమాన నటులకు చెడు జరిగితే బాధ పడడం.. మంచి జరిగితే సంతోషించడం వంటివి చేస్తుంటారు ఫ్యాన్స్. అందుకే బ్రేకప్పులు, పెళ్లిళ్లు, లవ్ ట్రాకులు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో 2020లో విడాకులు తీసుకున్న జంటలు.. పెళ్లికి సిద్ధమైన ప్రముఖులు.. రెండో వివాహం చేసుకున్న సెలెబ్రిటీలు.. బ్రేకప్ ప్రకటించిన కపుల్స్ గురించి ప్రత్యేకమైన స్టోరీ మీకోసం.!

ఒంటరి జీవితానికి పుల్‌స్టాప్ పెట్టేశారు

ఒంటరి జీవితానికి పుల్‌స్టాప్ పెట్టేశారు

గతంలో కంటే ఈ ఏడాది తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా పెళ్లిళ్లు జరిగాయి. మరీ ముఖ్యంగా టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌గా ఉన్న దగ్గుబాటి రానా, నితిన్, నిఖిల్ వంటి వాళ్లు మూడు ముళ్ల బంధంతో తమ ఒంటరి జీవితాలకు పుల్‌స్టాప్ పెట్టేశారు. అలాగే, కాజల్ అగర్వాల్, నిహారిక కొణిదెల వంటి నటీమణులు సైతం పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు.

 ఈ సినీ జంట విడాకులతో మొదలైంది

ఈ సినీ జంట విడాకులతో మొదలైంది

2020లో సంతోషకరమైన విషయాలే కాదు.. విషాదాన్ని మిగిల్చిన కథలూ ఉన్నాయి. అందులో అన్నింటి కంటే ముందు చెప్పుకోవాల్సినది నోయల్ సీన్ - ఎస్తర్ విడాకుల గురించే. గత ఏడాది ప్రేమ వివాహం చేసుకున్న ఈ సినీ జంట.. కొద్ది రోజుల పాటే కలిసి జీవించారు. సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఏడాది ప్రారంభంలో న్యాయపరంగా విడాకులు తీసుకుని దూరమయ్యారు.

 భార్య మరణంతో రెండో పెళ్లి చేసుకుని

భార్య మరణంతో రెండో పెళ్లి చేసుకుని

బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు భార్య అనిత కొన్నేళ్ల క్రితం గుండెపోటుతో మరణించిన సంగతి విధితమే. దీంతో 2020 మే 10న హైదరాబాద్‌కు చెందిన తేజస్వినీని వివాహం చేసుకున్నారు. లాక్‌డౌన్ కారణంగా నిరాడంభరంగా నిజామాబాద్‌లోని ఓ దేవాలయంలో జరిగిందీ వేడుక. దీంతో ఇటీవల జరిగిన పుట్టినరోజు పార్టీలో తన భార్య తేజస్వినీని టాలీవుడ్‌కు పరిచయం చేశారాయన.

భార్యతో విడాకుల వల్ల హీరో రెండో పెళ్లి

భార్యతో విడాకుల వల్ల హీరో రెండో పెళ్లి

ప్రముఖ నటుడు.. బిగ్ బాస్ సీజన్ - 2 కంటెస్టెంట్ సామ్రాట్ గతంలో వ్యక్తిగత కారణాలతో భార్య నుంచి విడిపోయాడు. అప్పట్లో పెద్ద సంచలనం అయిందీ వ్యవహారం. దీంతో అతడు పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇటీవల అతడు అంజనా శ్రీ లిఖిత అనే అమ్మాయిని వివాహమాడాడు. కరోనా కారణంగా ఈ వేడుకకు కొందరు మాత్రమే హాజరయ్యారు.

రెండో పెళ్లికి సిద్ధమైన వాళ్లు ఈ ఇద్దరు

రెండో పెళ్లికి సిద్ధమైన వాళ్లు ఈ ఇద్దరు

ఈ ఏడాది రెండో పెళ్లికి సిద్ధమైన వారిలో మహిళలు కూడా ఉన్నారు. వారిలో ఒకరు సింగర్ సునీత. చాలా కాలం క్రితం భర్తతో విడిపోయిన ఆమె... ఇటీవలే మరో వ్యక్తితో నిశ్చితార్థం చేసుకున్నారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్ మాజీ భార్య కనికా థిల్లాన్ కూడా ఇటీవలే ఓ ప్రొడ్యూసర్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. త్వరలోనే ఈ రెండు పెళ్లిళ్లు జరగనున్నాయి.

 ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ చేసుకున్న జంట

ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ చేసుకున్న జంట

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఆ మధ్య హైదరాబాద్‌కు చెందిన అనీషా రెడ్డి (అర్జున్ రెడ్డి ఫేం)తో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ఇది జరిగి చాలా రోజులు కావొస్తున్నా.. పెళ్లి గురించి మాత్రం అప్‌డేట్ రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అనీషా రెడ్డి.. తాజాగా మరో వ్యక్తితో పెళ్లికి సిద్ధమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తతో ఇటీవలే ఆమె నిశ్చితార్థం కూడా అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X