twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2020లో సత్తా చాటిన కొత్త డైరెక్టర్లు వీళ్లే: బడా హీరోతో ఆఫర్ పట్టేసిన శైలేష్ కొలను

    |

    2020వ సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంపై ప్రభావం చూపించింది. దీనికి కారణం కరోనా వైరస్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని ప్రభావం ప్రపంచం మొత్తం కనిపించింది. భారతదేశంలోనూ చాలా కష్టనష్టాలను తీసుకొచ్చిందీ మహమ్మారి. మరీ ముఖ్యంగా దీని ప్రభావం సినిమా పరిశ్రమపై ఎక్కువగా చూపించింది. షూటింగులు ఆగిపోయి, థియేటర్లు మూతపడి చాలా మంది ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో 2020లో చాలా మంది కొత్త దర్శకులు చిత్ర సీమకు పరిచయం అయ్యారు. వారిలో సక్సెస్ అయిన పలువురి గురించి తెలుసుకుందాం!

    కలర్‌ఫుల్‌గా సక్సెస్ అయిన సందీప్ రాజ్

    కలర్‌ఫుల్‌గా సక్సెస్ అయిన సందీప్ రాజ్

    సుహాస్, చాందినీ చౌదరి, సునీల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘కలర్ ఫొటో'. అమృత ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై శ్ర‌వ‌ణ్ కొంక‌, లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ స‌మ‌ర్ప‌ణ‌లో సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని నిర్మించిన ఈ సినిమాతో సందీప్ రాజ్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. వర్ణ వివక్షతతో న్యాచురల్‌ లవ్‌ స్టోరీతో తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు కొత్త కుర్రాడు.

    పల్లెటూరి వాతావరణాన్ని చూపించడంతో

    పల్లెటూరి వాతావరణాన్ని చూపించడంతో

    1978 ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978'. రక్షిత్‌, నక్షత్ర జంటగా తెరకెక్కిన ఈ చిత్రంతో కరుణ కుమార్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే సత్తా చాటి, అది విడుదల కాకముందే బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నుంచి అడ్వాన్స్ తీసుకుని సత్తా చాటాడీ డెబ్యూటెంట్ డైరెక్టర్.

    ప్రేమకథకు భావోద్వేగాలు జోడించి సక్సెస్

    ప్రేమకథకు భావోద్వేగాలు జోడించి సక్సెస్

    నవీన్ చంద్ర, సలోనీ లుత్రా, షాలినీ, రాజా, వైవా హర్ష ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘భానుమతి రామకృష్ణ'. శ్రీకాంత్ నాగోతి తెరకెక్కించిన ఈ సినిమా డీసెంట్‌ రిజల్ట్‌ను రాబట్టింది. భావోద్వేగాలతో కూడిన ప్రేమకథతో సినిమా రూపొందించిన విధానం ఆకట్టుకుంది. ఈ చిత్రంతో దర్శకుడికి మంచి పేరు వచ్చింది. ఫలితంగా కొన్ని ఆఫర్లను కూడా అందుకున్నాడు ఈ కొత్త దర్శకుడు.

    మిడిల్ క్లాస్ హీరోతో మెలోడీలు పాడించిన

    మిడిల్ క్లాస్ హీరోతో మెలోడీలు పాడించిన

    ఆనంద్ దేవరకొండ - వర్ష బొల్లమ్మ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘మిడిల్ క్లాస్ మెలోడీస్'. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌ నిర్మించిన ఈ సినిమాను వినోద్ అనంతోజు రూపొందించాడు. ఇందులో మిడిల్ క్లాస్ అబ్బాయి కష్టాలను చూపించి యూత్‌కు కనెక్ట్ అయ్యేలా చేశాడు. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది. దీనికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ దర్శకుడికి మాత్రం పేరొచ్చింది.

    టైటిల్‌తోనే హిట్ కొట్టి... బడా హీరోతో జోడీ

    టైటిల్‌తోనే హిట్ కొట్టి... బడా హీరోతో జోడీ

    చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకున్న చిత్రం ‘హిట్'. విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ సినిమాను హీరో నాని నిర్మించాడు. దీని ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 4.4 కోట్లు జరగగా, దాదాపు రూ. 7.50 కోట్ల రాబట్టి సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో సక్సెస్ అయిన డైరెక్టర్ శైలేష్.. జూనియర్ ఎన్టీఆర్‌తో జోడీ కట్టబోతున్నాడని ప్రచారం జరుగుతోంది.

    English summary
    The Telugu film industry, popularly known as Tollywood, had some great movies to offer to the masses this year, i.e. 2020. While the box office witnessed one of the major clashes of this year with multiple Sankranti releases, Telugu cinema had a wide genre of films to present to its audience.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X