2021 మొత్తం మెగా హీరోలదే హవా.. నెవర్ బిఫోర్ అనేలా బాక్సాఫీస్ పై దండయాత్ర
కారోనా లాక్ డౌన్ వలన చాలా వరకు స్టార్ హీరోల సినిమాలు మిస్ అయిన అభిమానులకు ఈ ఏడాది మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ దొరికేలా ఉంది. ముఖ్యంగా మెగా అభిమానులకు మొత్తం ఒక గోల్డెన్ ప్యాకేజ్ లా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు రాబోతున్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా మెగా ఫ్యామిలీలో ఉన్న ప్రతి హీరో కూడా 2021లో రాబోతున్నారు.

మెగా హీరో ఎంట్రీతో..
అందరికంటే ముందుగా మెగా యువ హీరో వైష్ణవ్ తేజ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అతనికి ఇది మొదటి సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఫిబ్రవరి 12న ఉప్పెన సినిమా రాబోతోంది. దేవిశ్రీప్రసాద్ అందించిన పాట సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. సుకుమార్ శిష్యుడు ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు.

పవర్ స్టార్ తో బాక్సాఫీస్ ఫెస్టివల్
ఇక ఈ ఏడాది అసలైన బాక్సాఫీస్ ఫెస్టివల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మొదలు కానుంది. వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9న గ్రాండ్ గా రిలీక్ కాబోతోంది. ఆ తరువాత అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ సినిమాను కూడా పవర్ స్టార్ ఇదే ఏడాది రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు. ఆగస్టు 15న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానున్నట్లు సమాచారం.

మే నెలలో మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి సైరా అనంతరం ఎంతోగానో ఇష్టపడి చేస్తున్న సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక సినిమాను మే 7న గ్రాండ్ గా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

సాయి ధరమ్ తేజ్ డబుల్ ధమాకా
మరోవైపు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా రెండు సినిమాలతో రాబోతున్నాడు. దేవకట్టా దర్శకత్వంలో రిపబ్లిక్ అనే సోషల్ డ్రామాలో నటిస్తున్న సాయి ఆ సినిమాను ఏప్రిల్ 30న రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. ఇక సుకుమార్ ప్రొడక్షన్ లో ఆయాన శిష్యుడు కార్తిక్ దండు డైరెక్ట్ చేస్తున్న న్యూ మూవీని ఈ ఏడాది చివరలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. కుదిరితే డిసెంబర్ 24న ఆ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుందట.

మెగా ప్రిన్స్ కూడా రెండు సినిమాలు
మెగా ప్రిన్స్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న వరుణ్ తేజ్ కూడా ఈ ఏడాది రెండు సినిమాలతో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. కొత్త దర్శకుడితో చేస్తున్న బాక్సర్ అనే సినిమాను ఇదే ఏడాది జూలై 30న రిలీజ్ చేయబోతున్నాడు. ఇక F3 సినిమా కూడా ఇదే ఏడాది రాబోతోంది.
Recommended Video

మెగాపవర్ స్టార్ పాన్ ఇండియా
ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ ఏడాది రెండు సినిమాలతో వస్తున్నట్లే లెక్క. ఆచార్య సినిమాలో సిద్దా అనే ఒక స్పెషల్ పాత్రలో కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత ఇండియన్ బిగెస్ట్ పాన్ ఇండియా మూవీ RRRతో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా అక్టోబర్ 13న రానున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











