twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    28 Years For Mechanic Alludu: విజయశాంతి - మెగాస్టార్ ఆఖరి సినిమా.. అప్పట్లో అదే అత్యంత ఖరీదైన సాంగ్

    |

    మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలన్నిలో ప్రతి మూవీకి ఒక ప్రత్యేకమైన విశేషం ఉంది. ఎలాంటి సినిమా చేసినా కూడా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకోవడం కాయం. మెగాస్టార్ సినిమాకు టికెట్లు దొరికాయి అంటే అదొక సంబరం. ఇక 90లోని యువత మెకానిక్ అల్లుడు సినిమా టికెట్స్ కోసం కొట్లాడిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఆ సినిమా విడుదలై నేటికి 28 సంవత్సరాలు అవుతోంది. 1993 మే 27న ఈ సినిమా భారీ స్థాయిలో విడుదలైంది. ఒకసారి ఆ విశేషాలపై ఒక లుక్కేస్తే...

    మొదటిసారి ANRతో మెగాస్టార్

    మొదటిసారి ANRతో మెగాస్టార్

    మెగాస్టార్ చిరంజీవి 1993లో ముఠామెస్త్రి సినిమాతో కెరీర్ లోనే మరొక బిగ్గెస్ట్ హిట్ అందుకోవడంతో అభిమానుల ఫ్యాన్స్ ఫాలోయింగ్ అమాంతంగా పెరిగిపోయింది. ఇక ఆ తరువాత చేయబోయే సినిమా అంతకుమించి అనేలా ఉండాలని నిర్మాత అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ లో మెకానిక్ అల్లుడు సినిమాకు శ్రీకారం చుట్టారు. ఇక ఈ సినిమాతో మొదటిసారి అక్కినేని నాగేశ్వరరావు - మెగాస్టార్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

    బీ గోపాల్, సత్యానంద్ కాంబినేషన్ లో..

    బీ గోపాల్, సత్యానంద్ కాంబినేషన్ లో..

    మెగాస్టార్ ఫ్యాన్స్ కు నచ్చే విధంగా కామెడీ, యాక్షన్ వంటి అంశాలను దర్శకుడు బి.గోపాల్ పుష్కలంగా రెడీ చేయించుకున్నారు. సీనియర్ రైటర్ సత్యానంద్ ఈ సినిమాకు కథ మాటలు అందించారు. మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాలో మరింత మాస్ గా ఉండడంతో పాటు స్టైలిష్ గా కూడా ఉంటుంది.

    విజయశాంతి - చిరంజీవి ఆఖరి సినిమా

    విజయశాంతి - చిరంజీవి ఆఖరి సినిమా

    ఇక 18 సినిమాల అనంతరం విజయశాంతి - మెగాస్టార్ చిరంజీవి కలయికలో వచ్చిన 19వ సినిమా కావడంతో అప్పట్లో ఈ కాంబోనే అంచనాల డోస్ ను పెంచేసింది. ఆ తరువాత మళ్ళీ చిరు - రాములమ్మ కాంబినేషన్ లో మరొక సినిమా రాలేదు. అదే ఆఖరి సినిమా. విడుదలైన మొదటిరోజు నుంచే సినిమా పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ ను క్రియేట్ చేసింది.

    ఆ పాట కోసం అత్యధికంగా..

    ఆ పాట కోసం అత్యధికంగా..

    రాజ్ - కోటి మెగాస్టార్ డ్యాన్స్ కోసమని కంపోజ్ చేసిన స్పెషల్ సాంగ్స్ ఒక ట్రెండ్ సెట్ చేశాయి. ఇక సినిమాల్లో అన్ని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే 'జుమ్మని తుమ్మెద వేట' పాట కోసం అప్పట్లో అత్యంతధిక స్థాయిలో ఖర్చు చేశారు. అప్పట్లో ఒక సాంగ్ కోసం 5లక్షలు ఖర్చు చేస్తేనే గొప్ప అలాంటిది ఆ సాంగ్ కోసం ఏకంగా 25లక్షలు ఖర్చు చేశారట.

    Recommended Video

    Ravi Teja Krack Movie To Enter Profit Zone Soon
    ఫస్ట్ వీక్ లోనే సాలిడ్ కలెక్షన్స్..

    ఫస్ట్ వీక్ లోనే సాలిడ్ కలెక్షన్స్..

    100రోజుల వరకు నాన్ స్టాప్ గా హిట్ టాక్ తో వెళ్లిన మెకానిక్ అల్లుడు మెగాస్టార్ బాక్సాఫీస్ స్టామినాను అప్పట్లో అమాంతంగా పెంచేసింది. నాగేశ్వరరావు - మెగాస్టార్ కాంబినేషన్లో వచ్చిన సీన్స్ కు అప్పట్లో విజిల్స్ పడ్డాయి. దాదాపు మొదటి వారంలోనే 100% ప్రాఫిట్ జోన్ లోకి తీసుకొచ్చి నిర్మాతకు, పంపిణీదారులకు ఈ సినిమా ఎంతగానో సంతోషాన్ని ఇచ్చింది.

    English summary
    mechanic alludu movie has the 90s had a lot of incidents of fighting for movie tickets. It has been 28 years since the release of the film. The film was released on a massive scale on May 27, 1993.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X