రామ్ చరణ్‌తో సుకుమార్ క్రియేట్ చేసిన వండర్.. రంగస్థలం మూవీకి మూడేళ్లు
టాలీవుడ్ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే అందులో ఎప్పటికి గుర్తుండి పోయే సినిమాలు చాలా తక్కువ. అలాంటి సినిమాల్లో రంగస్థలం ఒకటి. ఎంత పెద్ద స్టార్ అయినా కూడా ఈ సినిమా చూసిన తరువాత కొంతైనా ఈర్ష పడకుండా ఉండలేరు. భవిష్యత్తులో ఇలాంటి సినిమా వస్తే అస్సలు వదులుకోకూడదని అనుకుంటారు.
సుకుమార్ - రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం విడుదలై నేటికి మూడేళ్లవుతోంది. 2018 మార్చి 30న గ్రాండ్ గా విడుదలైన రంగస్థలం బాక్సాఫీస్ వద్ద 200కోట్లను కలెక్ట్ చేసి నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసింది. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరు రామ్ చరణ్ ను పొగడకుండా ఉండలేరు. స్టార్ రేంజ్ ను ఏ మాత్రం లెక్క చేయకుండా చిట్టిబాబు పాత్రలో ఎంతగానో ఒదిగిపోయి మెప్పించాడు.

ఇక సినిమా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో సినిమా పేరును ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత డైరెక్టర్ సుకుమార్ పుష్ప అనే పాన్ ఇండియా సినిమాతో మరో మ్యాజిక్ ను సిద్ధం చేస్తున్నారు. అలాగే భవిష్యత్తులో రామ్ చరణ్ తో మరో సినిమా కూడా చేసే అవకాశం ఉందని మైత్రి మూవీ మేకర్స్ వివరణ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











