బాహుబలి2 చరిత్ర, 1000 కోట్ల రికార్డుకు 3 ఏళ్లు.. ప్రభాస్, అనుష్క, తమన్నా ఎమోషనల్‌గా
భారతీయ సినీ బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసిన బాహుబలి2 సినిమా విడుదలై మూడేళ్లు పూర్తి చేసుకొన్నది. బాహుబలి: ది బిగినింగ్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుకొన్నది. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా లాంటి వారికి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చింది. ఈ సినిమా గురించి మరికొన్ని విషయాలు మీ కోసం..

కట్టప్పను ఎందుకు చంపారని...
బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే మిలియన్ డాలర్ల ప్రశ్నకు సమాధానం వెతుక్కొనే విధంగా బాహుబలి2 రిలీజైంది. ఈ చిత్రం సినీ ట్రేడ్ పండితుల అంచనాలను తలకిందులు చేస్తూ రూ.1000 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఏప్రిల్ 28 2017లో రిలీజైన ఈచిత్రం మూడేళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా ప్రభాస్ తదితరులు ట్వీట్ చేశారు.
ప్రభాస్ ఎమోషనల్‌గా
బాహుబలి2 మూడేళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా ప్రభాస్ ఇన్స్‌టాలో .. బాహుబలి2 కేవలం దేశ మొత్తం మెచ్చిన ఓ సినిమా మాత్రమే కాదు. నా జీవితంలో అతిపెద్ద విజయం, సంతృప్తి, ఖ్యాతిని తెచ్చిన సినిమా. అలాంటి గొప్ప సినిమాను అందించిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, సినిమా యూనిట్, నా ఫ్యాన్స్‌కు రుణపడి ఉంటాను అని ప్రభాస్ ఇన్స్‌టాగ్రామ్‌లో పేర్కొన్నారు.

అనుష్క శెట్టి మధురానుభూతులు
బాహుబలి2లో దేవసేనగా నటించిన అనుష్క శెట్టి కూడా సినిమాకు సంబంధించిన మధురానుభూతులు గుర్తు చేసుకొన్నారు. ఈ సినిమా వల్ల కురిపించిన ప్రేమ, అభిమానం, ఆదరణ వెలకట్టలేనిదనే విషయం పలు సందర్భాల్లోనూ వెల్లడించింది. బాహుబలి2 పూర్తి చేసుకొన్న సందర్భంగా #3YrsForMightyBaahubali2 Thank you all" అంటూ తన ఇన్స్‌టాగ్రామ్‌లో పేర్కొన్నారు.
Recommended Video
నాకింకా ఆ రోజు గుర్తుంది
బాహుబలి2 సినిమా గురించి తమన్నా గుర్తు చేసుకొంటూ... అప్పుడే బాహుబలి2 రిలీజై మూడేళ్లు అవుతున్నదంటే ఆశ్చర్యంగా ఉంది. నమ్మలేకపోతున్నాను. ఇంకా తొలి రోజు షూటింగ్ నాకు గుర్తు ఉంది. రాజమౌళి దర్శకత్వంలో నటించాలనే కల సాకారమైన రోజు కళ్లముందే ఉంది. దర్శకుడు రాజమౌళి గారికి బిగ్ థ్యాంక్స్ అంటూ తన ఇన్స్‌టాగ్రామ్‌లో తెలిపారు.


Click it and Unblock the Notifications











