3 Years of RRR: 1450 కోట్ల గ్లోబల్ సెన్సేషన్.. RRR మూవీకి 3 ఏళ్లు.. రాజమౌళి సంచలనాల చిట్టా ఇదే!

భారతీయ సినిమా చరిత్రలో గర్వించదగ్గ చిత్రాలు ఏమన్నా ఉన్నాయి అంటే డెఫినెట్ గా ఉండే కొన్ని చిత్రాల్లో దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా కూడా అని చెప్పవచ్చు. నేషనల్ లెవెల్లో తన బాహుబలి సినిమా సంచలనం సెట్ చేస్తే తాను ఏమనుకొని ఇద్దరు బిగ్గెస్ట్ ఫోర్సెస్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లతో చేయాలి అనుకున్నారో అక్కడే దీనిపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.

కాగా ఇలా వచ్చిన ఈ చిత్రం ఎప్పుడో 2018 లోనే అనౌన్స్ అయ్యినప్పటికీ రాజమౌళి చాలా త్వరగానే తెరకెక్కించి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ అందుకు ప్రకృతి సహకరించాలేదు. ఇలా ఎన్నో అవాంతరాల నడుమ నేడు ఇదే మార్చ్ 25న గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకొచ్చారు. కాగా ఈ ఎపిక్ సినిమా ఈరోజుతో మొత్తం మూడేళ్లు పూర్తి చేసుకుంది.

3 years of global sensation RRR

మరి ఈ మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర ముచ్చట్లు తెలుసుకుందాం. నిజానికి ఈ చిత్రాన్ని మేకర్స్ రామ్ చరణ్ తో 2017 కంటే ముందే అనుకున్నారట. నిర్మాత డీవీవీ దానయ్య రామ్ చరణ్ కి అడ్వాన్స్ కూడా ఇచ్చి డేట్స్ లాక్ చేసుకున్నారు. అయితే ఈ సినిమాలో చరణ్ తో పాటుగా మరో ముఖ్య పాత్ర కూడా ఉండడంతో దానికి జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకున్నారట.

ఇక ఈ సినిమాలో సెన్సేషన్ సెట్ చేసిన నాటు నాటు సాంగ్ కోసం జక్కన్న ఇద్దరు హీరోలని ఏ రేంజ్ లో హింస పెట్టారో అందరికీ తెలిసిందే. అలా దాదాపు 18 టేకులు ఇద్దరితో చేయించి ఫైనల్ గా మొదటి టేక్ నే ఓకే చేశారట. ఇక వీటితో పాటుగా ఈ చిత్రం వచ్చినప్పటికీ నిజానికి ఇప్పుడుకి కూడా ఇండియన్ సినిమా దగ్గర అత్యంత ఖరీదైన సినిమా కూడా RRR నే అట. ఈ సినిమాకి డీవీవీ దానయ్య అప్పుడులో సుమారు 550 కోట్లకి పైగా ఖర్చు చేశారట.

కాగా ఇందులో కేవలం గ్రాఫిక్స్ కోసమే మేకర్స్ ఏకంగా 200 కోట్లకి పైగా ఖర్చు చేశారట. అలాగే ఈ సినిమా నిడివి థియేటర్స్ లోనే 3 గంటలకి పైగానే ఉంటుంది కానీ ఇంకా చాలా సినిమాని ట్రిమ్ చేసేసారట. మెయిన్ గా రామ్ చరణ్ పై ఎన్టీఆర్ పై చాలా సీన్స్ ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ పై డిలీట్ చేసేసారు. అప్పట్లో వచ్చిన గ్లింప్స్ లు చూస్తే ఇది అర్ధం అవుతుంది.

రామరాజు జీవన విధానం తన విలు విద్యలు ఇలా పలు సీన్స్ చేసినప్పటికీ వాటిని ఇప్పటికీ దాచే ఉంచారు. ఇదే తరహాలో ఎన్టీఆర్ పై వాటర్ ఫోర్స్ పై పలు సన్నివేశాలు తీసి చూపించలేదు. ఇంతే కాకుండా తారక్ పై జైల్లో తనని బంధించి ఉంచినప్పుడు మరికొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు కానీ వాటినీ సినిమాలో పెట్టలేదు. అంతే కాకుండా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ అలానే రామ్ చరణ్ లపై ఒక గ్రాండ్ సాంగ్ ని కూడా షూట్ చేసారని అప్పట్లో టాక్ గట్టిగా వినిపించింది. ఈ పాట ఏమైందో కూడా ఇప్పటికీ తెలీదు.

ఇక మరీ ముఖ్యంగా అయితే సినిమాని ఓ రేంజ్ లో లేపిన ఇంటర్వెల్ బ్లాక్ లో మనకి ఒక 20 నిమిషాల మేర కనిపించే ఫుటేజ్ ని మేకర్స్ ఏకంగా 80 రాత్రులు నిరంతరం కష్టపడి తెరకెక్కిస్తే గాని రాలేదు. ఇక వీటితో పాటుగా రామ్ చరణ్ ఎంట్రీ సీక్వెన్స్ అయితే రాజమౌళి కెరీర్లో చేసిన ఇన్నేళ్ల సినిమాల్లో అత్యంత కష్టతరమైన ఎపిసోడ్ గా చెప్పుకొచ్చారు.

వరల్డ్ బాక్సాఫీస్ వద్ద 1450 కోట్ల రూపాయల కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. థియేట్రికల్‌గానే కాకుండా OTTలో కూడా RRR కి సంచలన రికార్డులు ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్ లో 45 మిలియన్ కి పైగా వ్యూస్ తో ఇప్పటికీ ఆల్ టైం రికార్డు సొంతం చేసుకుంది. అంతే కాకుండా ఇండియన్ సినిమా దగ్గర ఎనీ కేటగిరీలో చూసుకున్నా సరే భారత దేశానికి మొదటి ఆస్కార్ తీసుకొచ్చిన మొదటి సినిమాగా RRR చరిత్ర పుటల్లో నిలిచిపోయింది.

More from Filmibeat

Read more about: ram charan jr ntr rajamouli
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X