30 ఏళ్ల జగదేకవీరుడు అతిలోక సుందరి..తుఫాన్‌ను ఎదిరించి.. కలెక్షన్ల సునామీ..చిరు 104 డిగ్రీల జ్వరంతో

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రానికి ప్రత్యేకమైన చరిత్ర ఉంది. మెగాస్టార్ చిరంజీవి, అందాల తార శ్రీదేవీ జంటగా ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం రికార్డుల తిరగరాసింది. మే 9వ తేదీ 1990 రోజున విడుదలైన ఈ చిత్రం అనేక ప్రతికూలతను ఎదురించి ఇండస్ట్రీ హిట్‌గా చరిత్ర సృష్టించింది. ఈ చిత్రం 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ..

రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు

రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు

జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్‌కు ముందు సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఆడియో పరంగా మంచి బిజినెస్ జరిగింది. రిలీజ్‌కు ముందే మ్యూజిక్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో రిలీజైన ఈ చిత్రానికి తుఫాన్ భారీ దెబ్బ కొట్టింది. సినిమా రిలీజ్ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి.

కోస్తాంధ్రాలో భారీ తుఫాన్

కోస్తాంధ్రాలో భారీ తుఫాన్

కోస్తా, ఆంధ్రాలో విపరీతమైన గాలులు, భారీ వర్షాలతో చాలా ఇళ్లు నేలమట్టం అయ్యాయి. వరద, తుఫాను ముంపుకు గురైన ప్రజలకు సినిమా థియేటర్లలో ఆశ్రయం ఇవ్వాల్సి వచ్చింది. దాంతో వారంపాటు సినిమా ప్రదర్శనలు నిలిచిపోయాయి. దాంతో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా చాప్టర్ క్లోజ్ అనుకొన్నారు. ఇక పలు ప్రాంతాల్లో సినిమా హిట్ టాక్ రావడంతో సినిమాపై క్రేజ్ పెరిగింది.

తుఫాన్ తర్వాత కలెక్షన్ల వరద

తుఫాన్ తర్వాత కలెక్షన్ల వరద

తుఫాన్ ముగిసిన తర్వాత వారం వరకు సినిమా ప్రదర్శనలు నిలిపివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే మచిలీపట్నం, కృష్ణా జిల్లాలో అభిమానుల ఒత్తిడి మేరకు రెండో రోజు నుంచే జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ప్రదర్శించడం మొదలుపెట్టారు. వారం రోజుల పాటు కుంభవృష్టిని చూసిన ప్రజలు ఆ తర్వాత ఈ చిత్రం కురిపించిన కలెక్షన్ల సునామీకి సాక్షులుగా నిలిచారు. ఆ తర్వాత ఏపీలో ఈ చిత్రం రికార్డులు తిరగరాయడం, చరిత్ర సృష్టించడం తెలిసిందే.

ఇండస్ట్రీ హిట్‌గా

ఇండస్ట్రీ హిట్‌గా

చిరంజీవి స్టయిల్, శ్రీదేవి అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. రాఘవేంద్రరావు టేకింగ్, ఇళయరాజా సంగీతం, కెమెరా పనితనం అన్ని సినిమాకు బాగా కలిసి వచ్చాయి. దాంతో నైజాం, ఆంధ్రా, సీడెడ్ అనే తేడా లేకుండా ఈ చిత్రం కలెక్షన్ల తుఫాన్‌ను సృష్టించింది. విడుదలైన పలు ప్రాంతాల్లో ఈ చిత్రం శతదినోత్సవం జరుపుకొన్నది. అప్పటి వరకు టాలీవుడ్‌లో ఉన్న రికార్డులను తిరగరాసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

Recommended Video

30 Years Of Classic Jagadekaveerudu Athiloka Sundari, Here’s The 1 St Story Behind Film
104 డిగ్రీల జ్వరంతో

104 డిగ్రీల జ్వరంతో

ఇక జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలో చిరంజీవి, శ్రీదేవి మధ్య కెమిస్ట్రీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. డైలాగ్స్ కేకపెట్టించాయి. అలాగే డ్యాన్సులు థియేటర్లలో హోరెత్తించాయి. చిరంజీవి 104 డిగ్రీల జ్వరంతో బాధపడుతూ కూడా పాటల షూటింగ్‌లో పాల్గొన్నారు. ఆ తర్వాత వెంటనే హాస్పిటల్‌లో చేరాల్సి వచ్చింది.

ఇతర భాషల్లోకి డబ్బింగ్

ఇతర భాషల్లోకి డబ్బింగ్

జగదేక వీరుడు అతిలోక సుందరి కలెక్షన్ల రికార్డులు సృష్టించడంతో దక్షిణాది సినీ పరిశ్రమ చూపు ఈ చిత్రంపై పడింది. ఆ తర్వాత ఈ చిత్రం తమిళంలో కాదల్ దేవతైగా, హిందీలో ఆద్మీ ఔర్ అప్సరగా, మలయాళలంలో హాయ్ సుందరాయ్‌గా డబ్బింగ్ అయి అక్కడ ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకర్షించడం తెలిసిందే.

 తెర వెనుక, తెర ముందు

తెర వెనుక, తెర ముందు

నటీనటులు: చిరంజీవి, శ్రీదేవి, అమ్రిష్ పురి, కన్నడ ప్రభాకర్, తనికెళ్ల భరణి తదితరులు
దర్శకత్వం: కే రాఘవేంద్రరావు
నిర్మాత: సీ అశ్వినిదత్
రచన: కే రాఘవేంద్రరావు, జంధ్యాల
స్టోరి: యండమూరి వీరేంద్రనాథ్
సంగీతం: ఇళయరాజా
సినిమాటోగ్రఫి: కేఎస్ ప్రకాశ్, విన్సెంట్
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
రిలీజ్: 2020-05-09
బడ్జెట్: 8 కోట్ల రూపాయలు
వసూలు: 13 కోట్లు.. 2019తో పోల్చితే 103 కోట్లుగా అంచనా

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X