4 years of bahubali 2: ఆ సినిమా ప్లాప్ అయ్యి ఉంటే బాహుబలి వచ్చేది కాదు.. అసలైన బాక్సాఫీస్ లెక్కలు!
తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని ఒక్కసారిగా సినీ ప్రపంచం ముందు నిలబెట్టిన ఏకైక సినిమా బాహుబలి. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ ఎపిక్ యాక్షన్ ఫిల్మ్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక వరల్డ్ వైడ్ గా అత్యదిక కలెక్షన్స్ అందుకున్న ఇండియన్ సినిమాగా నిలిచిన బాహుబలి 2: ది కన్ క్లూజన్ విడుదలై నేటికి 4ఏళ్లవుతోంది. ఇక సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలపై ఒక లుక్కేస్తే..

ముక్కున వేలేసుకున్నారు
బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా అనే పదానికి అసలైన అర్థం వచ్చింది. తెలుగు సినిమా అంటే అంతకుముందు వరకు బాలీవుడ్ తో పాటు కోలీవుడ్ కూడా చిన్నచూపుతో చూసేది. ఎప్పుడైతే బాహుబలి హిట్ అయ్యిందో ఆ తరువాత తక్కువగా చూసిన వారే ముక్కున వేలేసుకున్నారు. అప్పటి నుంచి టాలీవుడ్ లో కూడా వర్క్ చేయాలని బాలీవుడ్ కోలీవుడ్ అగ్ర తారలు ఆసక్తి చూపిస్తున్నారు.

బాహుబలి స్క్రిప్ట్ వర్క్ కోసం
దర్శకుడు రాజమౌళి కెరీర్ మొదటి నుంచి కూడా ఫెయిల్యూర్ ను చూడలేదు. ఎలాంటి సినిమా చేసినా కూడా మాస్ ఆడియెన్స్ చేంజ్ దృష్టిలో ఉంచుకొని అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ను జోడిస్తూ వచ్చారు. ఇక బాహుబలి విషయంలో కూడా ఏడాది పాటు స్క్రిప్ట్ పైనే హార్డ్ వర్క్ చేశారు. మొదట బాహుబలి ఒక పార్ట్ మాత్రమే అనుకున్నారు. ఆ తరువాత కుదరడం లేదని రెండు భాగాలుగా విభజించారు.

మొదటి రికార్డులు
ప్రభాస్ బాహుబలి కోసమే 5 ఏళ్ళు కేటాయించారు. ఏ ఇండియన్ హీరో కూడా ఒక సినిమా కోసం ఆ స్థాయిలో డేట్స్ ఇవ్వలేదు. సినిమా మొదలైనప్పటి నుంచి అయిపోయే వరకు రాజమౌళితోనే ఉన్నాడు. ఇక బహుబలి 2తో మొదటి 100కోట్ల వసూళ్లను అందుకున్న టాలీవుడ్ హీరోగా రికార్డుకు ఎక్కాడు. ఇక మొదటిరోజు ఇండియాలో 100కోట్లు, 200కోట్లు అందుకున్న మొదటి సినిమా ఇదే. ఇక మొదటిసారి ఇండియన్ సినిమా 800కోట్లు అందుకుంది. ఇక 1000 కోట్లు, 1500కోట్లు రాబట్టిన మొదటి సినిమాగా కూడా బాహుబలి రికార్డుకెక్కింది.

వరల్డ్ వైడ్ కలెక్షన్స్
ఇక బాహుబలి 1 విజయం చిత్ర యూనిట్ కు మంచి నమ్మకాన్ని ఇచ్చింది. బాహుబలి 2 అయితే అంతకుమించి అనేలా వసూళ్లను అందుకుంది. 250కోట్లతో ఖర్చు చేసి నిర్మించగా వరల్డ్ వైడ్ గా సినినా రూ.1810 కోట్లను అందించింది. అప్పటివరకు ఏ ఇండియన్ సినిమా కూడా ఆ రేంజ్ లో వసూళ్లను అందుకోలేదు.
Recommended Video

ఆ సినిమా హిట్టవ్వడం వల్లే..
జక్కన్న బాహుబలి లాంటి సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. మగధీర కంటే ముందు నుంచే తన ఊహల్లో బాహుబలి గురించి ఆలోచించేవారు. ఇక అప్పుడప్పుడు తండ్రి విజయేంద్రప్రసాద్ తో మాట్లాడుతూ క్యారెక్టర్లను డెవలప్ చేయించారు. అనంతరం కథ రెడీ అయ్యింది. ఇక మగధీర హిట్టవ్వడం జక్కన్నకు మంచి బూస్ట్ ఇచ్చింది. ఆ సినిమా ఆ స్థాయిలో హిట్టయ్యింది కాబట్టే ఆయనకు బాహుబలితో వండర్ క్రియేట్ చేయవచ్చని నమ్మకం కలిగింది.


Click it and Unblock the Notifications











