మొత్తానికి ఇలా కూడా ‘V’కి ప్రమోషన్స్.. లావణ్య, నాని ముచ్చట్లు వైరల్
న్యాచురల్ స్టార్ నాని, లావణ్య త్రిపాఠి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం భలే భలే మగాడివోయ్. డైరెక్టర్ మారుతి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ అండ్ క్లీన్ ఎంటర్టైన్మెంట్ సినిమాగా ఇది రికార్డులకెక్కింది. ఈ చిత్రంతో అప్పటి వరకు యూత్ డైరెక్టర్‌గా ఉన్న మారుతి.. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కూడా దగ్గరయ్యాడు. ఈ సినిమా విడుదలై నేటికి ఐదేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా నాటి విషయాలను గుర్తు చేసుకుంది చిత్రయూనిట్.
భలే భలే మగాడివోయ్ సినిమాకు ఐదేళ్లు అవుతుండటంపై లావణ్య స్పందిస్తూ.. నా జీవితంలోని మరిచిపోలేని చిత్రమిది. ప్రతీ ఒక్కరి హృదయంలో ఈ సినిమాకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. లేదా అంతకు మించి ఉంటుంది. నాని నటన అద్భుతం. నవ్వకుండా ఉంటూ నీతో షూట్ చేయడం చాలా కష్టం నాని అంటూ నాటి విషయాలను పంచుకుంది లావణ్య.

ఇక లావణ్య ట్వీట్‌కు నాని స్పందిస్తూ.. థ్యాంక్యూ నందన.. సినిమాకు వెళ్దామా రేపు ప్రసాద్‌లో.. సారీ మరిచిపోయా.. థియేటర్స్ లేవు కదా అని కౌంటర్ వేశాడు. థియేటర్ ఎందుకు రేపు మంచి మూవీ రిలీజ్ అవుతోంది అమేజాన్ ప్రైమ్‌లో.. V మూవీని అందులో చూద్దాం.. లక్కీ నువ్ మారిపోయావ్ అంటూ నానికి పంచ్ వేసింది. ఇలా మొత్తానికి భలే భలే మగాడివోయ్ సినిమా గురించి టాపిక్ మాట్లాడినా V సినిమా ప్రమోషన్ కూడా జరిగింది. రేపు రిలీజ్ కాబోతోన్న ఈ సినిమాకు ప్రమోషన్స్ పీక్స్‌లో చేస్తున్నారు. నాని, సుధీర్ బాబు, ఇంద్రగంటి మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు.



Click it and Unblock the Notifications











