AR Rahman పుట్టినరోజు: అప్పుడు మొదలైన సంగీత ప్రస్థానం నేటికీ..
నేడు (జనవరి 6) ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంగీత దర్శకులు, ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ పుట్టినరోజు. ఇదే తేదీ 1967 సంవత్సరంలో జన్మించిన ఈ సంగీత మాంత్రికుడు నేటితో 53 ఏళ్ళు పూర్తిచేసుకొని 54 ఏళ్లలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్బంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ట్రెడిషనల్ క్లాసిక్స్ నుంచి పాప్ వరకు అన్నిరకాల మ్యూజిక్స్‌ను మిక్స్ చేసి మ్యాజిక్ చేయగల సమర్థుడు ఏఆర్ రెహమాన్. ప్రపంచవ్యాప్తంగా ఈయన సంగీతానికి భారీ డిమాండ్‌తో పాటు సూపర్ ఫాలోయింగ్ ఉంది. భారతీయ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఈ స్వర మాంత్రికుడు.. మణిరత్నం 'రోజా' సినిమాతో ప్రేక్షకులకు పరిచయమై ఎన్నో మధురమైన పాటలకు స్వరాలు సమకూర్చారు.

దాదాపు రెండు దశాబ్ధాలకు పైగా సంగీత సాగరంలో ఈదుతున్న రెహమాన్.. ఏ భారతీయ సంగీత దర్శకుడూ చేరుకోలేని ఉన్నత శిఖరాల్ని అందుకున్నాడు. మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫస్ట్ మూవీతోనే జాతీయ స్థాయి ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు అందుకొని అందరి చూపును తనవైపుకు తిప్పుకున్నాడు.
రెండు ఆస్కార్ అవార్డులను గెలుచుకుని భారతీయ సినిమా సత్తాను అంతర్జాతీయ వేదికపైకి సగర్వంగా తీసుకెళ్లిన ఘనత కూడా రెహమాన్ దే. ఎన్నో ప్రయివేట్ ఆల్బమ్స్ కూడా రూపొందించిన ఆయన మరింత ఉన్నత శిఖరం అధిరోహించాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











