చిరంజీవి సినిమా రీమేక్.. నానితో మూవీనీ నాగ ఆశ్విన్ ఎందుకు ఆపేసాడో తెలుసా?
తెలుగు సినిమా దగ్గర ఎలాంటి బ్యాక్గ్రౌండ్ కూడా లేకుండా వచ్చి తమకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్న స్వయం కృషీ వలుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆ లెక్క మెగాస్టార్ చిరంజీవి పేరు నుంచే మొదలవుతుంది అని చెప్పాలి. కాగా నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కావడంతో ఇండస్ట్రీలో ప్రముఖులు సహా దేశ వ్యాప్తంగా కూడా చాలా మంది చిరుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అయితే తెలుగు సినిమా దగ్గర తన ఇన్స్పిరేషన్ తో ఇండస్ట్రీ లోకి వచ్చిన హీరోస్ కూడా చాలా మంది ఉన్నారు. మరి వీరిలో మాస్ మహారాజా రవితేజ ఇంకా నాచురల్ స్టార్ నాని ఇంకా యువ హీరో కార్తికేయ కూడా ఒకడు. అయితే ఈ హీరోస్ లో నాచురల్ స్టార్ నాని చిరంజీవి కెరీర్ లో ఒక ఐకానిక్ హిట్ సినిమాని రీమేక్ చేయాల్సి ఉందట. అది కూడా రీసెంట్ పాన్ ఇండియా హిట్ "కల్కి 2898 ఎడి" లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో అనుకున్నారట.

ఆల్రెడీ వీరి కాంబినేషన్ లో వచ్చిన "ఎవడే సుబ్రహ్మణ్యం" ఎలాంటి క్లాసిక్ గా నిలిచిందో తెలిసిందే. అయితే ఈ సినిమా కాకుండా వీరి కాంబినేషన్ లో అప్పట్లో ఇంకో సినిమాని కూడా ప్లాన్ చేసారని నాని రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపాడు. కాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన కామెడీ స్పై డ్రామా "చంటబ్బాయ్" కోసం అందరికీ తెలిసే ఉంటుంది. మరి ఈ సినిమానే నాగ్ అశ్విన్ నానితో ప్లాన్ చేసాడట. అందులో మెయిన్ పాయింట్ పట్టుకొని ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ డ్రామాగా ప్లాన్ చేశారట.
కానీ ఆ సినిమా ఆగిపోయింది అని నాని తెలిపాడు. అది ఎందువల్ల అంటే.. అప్పట్లో ఇదే తరహాలో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన "ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ" వచ్చేయడంతో ఇక ఆ ఐడియా అండ్ ప్రాజెక్ట్ నుంచి నాని, నాగ్ అశ్విన్ లు తప్పుకున్నారట. మరి నాని కామెడీ టైమింగ్ కి ఇలాంటి సినిమా కానీ పడుంటే మరోలా ఉండేది అని చెప్పాలి. అయితే తెలుగులో చాలా మంది హీరోస్ వదులుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి.

అలాంటి లిస్ట్ లో ఈ సినిమా కూడా యాడ్ అయ్యింది. ఇలా సెల్ఫ్ మేడ్ మెగాస్టార్ సినిమా మరో సెల్ఫ్ మేడ్ స్టార్ హీరో నానికి మిస్ అయ్యింది.. ప్రస్తుతం నాని హీరోగా నటించిన చిత్రం దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన సినిమా "సరిపోదా శనివారం" ఈ 9న గ్రాండ్ గా పాన్ ఇండియా భాషల్లో విడుదలకి రాబోతుంది.


Click it and Unblock the Notifications











