For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆర్తి అగర్వాల్ వర్ధంతి: మరణానికి ముందు, తర్వాత ఎన్నో అనుమానాలు.. యువ హీరోతో..

  |

  తెలుగు తెర మీద తారాజువ్వలా దూసుకొచ్చిన యువతారల్లో ఆర్తీ అగర్వాల్ ఒకరు. తక్కువ సమయంలోనే అగ్ర హీరోలందరితో జతకట్టి మెప్పించారు. అయితే ఆమె కెరీర్ రివ్వును దూసుకెళ్తున్న సమయంలో అనూహ్యంగా గ్రాఫ్ కిందపడింది. అప్పటి నుంచి మళ్లీ కోలుకోలేకపోయారు. అయితే ప్రేమ విఫలం కావడం, అలాగే వైద్య చికిత్స వికటించడంతో ఆమె తిరిగి రాని లోకాలకు చేరిపోయారు. ఈ రోజు ఆర్తి అగర్వాల్ వర్దంతి సందర్భంగా..

  అమెరికాలో గుజరాతీ కుటుంబంలో

  అమెరికాలో గుజరాతీ కుటుంబంలో

  ఆర్తి అగర్వాల్ మార్ఛి 5వ తేదీన అగర్వాల్ నందినిగా అమెరికాలోని గుజరాతీ కుటుంబంలో జన్మించారు. తండ్రి శశాంక్ వ్యాపారవేత్త, తల్లి వీమా గృహిణి. అమెరికాలో సునీల్ శెట్టి పర్యటించిన సమయంలో ఆర్తీ అగర్వాల్‌ను వేదికపైకి పిలిచి డ్యాన్స్ చేయించడంతో ఆమెలో సినీ తార కావాలనే కోరిక కలిగింది. అందుకు తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించడంతో ఆమె కల సాకారమైంది.

  బాలీవుడ్ టు టాలీవుడ్

  బాలీవుడ్ టు టాలీవుడ్

  పాగల్‌పన్ చిత్రంతో ఆర్తీ అగర్వాల్ సినీ జీవితం బాలీవుడ్‌లో మొదలైంది. ఆ తర్వాత వెంకటేష్‌తో నువ్వు నాకు నచ్చావు, తరుణ్‌తో నువ్వు లేక నేను లేను, ఎన్టీఆర్‌తో అల్లరి రాముడు, చిరంజీవితో ఇంద్ర, ఉదయ్ కిరణ్‌తో నీ స్నేహం, మహేష్‌బాబుతో బాబీ, బాలకృష్ణతో పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాల్లో నటించారు.

  యువ హీరోతో పీకల్లోతు ప్రేమలో

  యువ హీరోతో పీకల్లోతు ప్రేమలో

  ఇలా నాగార్జున, ప్రభాస్, రవితేజతో వరుసగా సినిమాల్లో నటిస్తుండగానే ఓ యువ హీరోతో ప్రేమలో పడిందని, వారిద్దరూ పీకల్లోతు వ్యవహారంలో మునిగి తేలారనే వార్త మీడియాలో వచ్చింది. అయితే చివరకు వారిద్దరి అఫైర్ బ్రేకప్ కావడంతో ఆర్తి అగర్వాల్ కొద్దికాలం మనస్తాపానికి గురైందని, ఆ సమయంలో ఆమె కెరీర్ దెబ్బ తిందనేది సినీ వర్గాల అభిప్రాయం.

   ప్రమాదమా? ఆత్మహత్యాయత్నమా?

  ప్రమాదమా? ఆత్మహత్యాయత్నమా?

  ఆ తర్వాత 2005లో ఆర్తి అగర్వాల్ ప్రమాదానికి గురికావడం సంచలనం రేపింది. అయితే ఆమె ఆత్మహత్య చేసుకొన్నారనే వార్తలు మీడియాలో వచ్చాయి. ఆమె తలకు బలమైన గాయం కావడంతో జూబ్లీ హిల్స్‌లోని అపోలో హాస్పిటల్‌లో చికిత్స అందించారు. ఆమెకు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించడంతో మళ్లీ కోలుకొన్నారు.

   సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌తో పెళ్లి, విడాకులు

  సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌తో పెళ్లి, విడాకులు

  ఇలాంటి సంఘటనల మధ్య ఆర్తి అగర్వాల్ అమెరికాకు వెళ్లిపోయారు. 2007లో తస్వల్ కుమార్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను వివాహం చేసుకొన్నారు. అయితే వారి వైవాహిక జీవితం ఎక్కువ కాలం కొనసాగలేదు. అభిప్రాయ బేధాలు తలెత్తడంతో 2009లో వారిద్దరి విడిపోయారు.

  Indian 2 Financial Hurdles Becoming Headache For Director Shankar
  వైద్య చికిత్స వికటించి

  వైద్య చికిత్స వికటించి

  అయితే ఆర్తి అగర్వాల్ కెరీర్‌పై మళ్లీ దృష్టి పెట్టి నిలదొక్కుకోవాలనే క్రమంలో ఆమెను మృత్యవు కబలించింది. స్థూలకాయాన్ని తగ్గించుకోవాడానికి చేసుకొన్న లైపోసక్షన్ సర్జరీ ఆరు వారాల తర్వాత తిరగదోడింది. శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో జూన్ 6వ తేదీ 2015లో ఆమె మరణించారు. ఆమె మరణానికి కారణం గుండెపోటు అని మేనేజర్ వెల్లడించారు. ఆర్తి అగర్వాల్ నటించిన చిత్రం ఆమె ఎవరు మరణాంతరం రిలీజ్ అయింది.

  English summary
  Aarthi Agarwal was an Indian-American actress who primarily worked in Telugu cinema. She was the older sister of Aditi Agarwal. Aarthi Agarwal was top heroine in the year of 2002.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X