Don't Miss!
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
‘రౌడీ’తో అభిజిత్ రచ్చ.. పిక్ వైరల్
బిగ్ బాస్ నాల్గో సీజన్ విజేత అభిజిత్ సోషల్ మీడియాలో మరీ అంత యాక్టివ్‌గా ఏమీ ఉండడు. అసలే ఇప్పుడు స్క్రిప్ట్‌లు వినే బిజీలో పడ్డాడు. రోజూ కథలు, స్క్రిప్ట్‌లు వింటూ బిజీగా గడుపుతున్నారు. డైరెక్టర్లు తన ఆఫీస్‌కు వచ్చి కథలు వినిపిస్తూ ఉంటుంటే.. అభిజిత్ మాత్రం ఇంకా ఏ ప్రాజెక్ట్కూ ఓకే చెప్పలేదు. అయితే ఆ విషయాలు కాస్త పక్కన పెట్టేద్దాం. అభిజిత్‌కు మూగ జీవాలంటే ఎంతో ఇష్టం.
బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలోనూ అభిజిత్ మూగ జీవాల గురించి మాట్లాడాడు. అంతే కాకుండా తన పెట్ రౌడీ గురించి పలుమార్లు ఎమోషనల్ అయ్యాడు. పేరెంట్స్ వచ్చినప్పుడు కూడా రౌడీ గురించి అడిగాడు. ఫినాలె వీక్‌లో అభిజిత్ తరుపున రౌడీ కూడా ప్రచారంలో పాల్గొంది. అభిజిత్‌కు ఓటు వేయండి అంటూ మెడలో బోర్డ్ తగిలించుకున్న రౌడీ ఫోటోలు బాగానే వైరల్ అయ్యాయి. బిగ్ బాస్ ఇంటి నుంచి వచ్చాక రౌడీతో అభిజిత్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
అభిజిత్ ఈ ఆదివారాన్ని రౌడీతో బాగానే గడిపినట్టున్నాడు. పదమూడేళ్లుగా రౌడీ నా క్లోజ్ ఫ్రెండ్.. వాడు ఒక్కటే నా శ్రద్దను తన వైపుకు తిప్పుకోగలడు.. అలా ఈ రోజు వాడిని బయటకు తీసుకొచ్చాను.. హ్యాపీగా ఉన్నాడంటూ చెప్పుకొచ్చాడు. మొత్తానికి రౌడీతో అభిజిత్ పిక్ తెగ వైరల్ అవుతోంది. అభిజిత్ ఈ మధ్యే ఓ కథను మూడు గంటల పాటు విన్నాడట. చూస్తుంటే ఆ కథే ఫైనల్ అయ్యేలా కనిపిస్తోంది.