Klin Kaara Photo Leak: క్లీం కారా ఫోటో లీక్ చేసిన ఉపాసన... దాచాలని ట్రై చేసినా పట్టేసిన నెటిజన్లు
మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి భాజాలు మరికొద్ది గంటల్లో మోగనున్నాయి. ఇక లావణ్య, వరుణ్ తేజ్ పెళ్లికి అంతా సిద్ధం అయిపోయింది. ఇటలీలో వీరు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ అంతా ఇటలీ చేరుకుని సందడి చేస్తోంది. ఇదిలా ఉండగా... ఉపాసన అక్కడి ఫోటోలను షేర్ చేసింది. అయితే కుటుంబ సభ్యులంతా కలిసి ఫోటోలు దిగారు. ఇక ఆ ఫోటోల్లో క్లీం కారా ఫోటో బయటపడింది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం.
వరుణ్ తేజ్ లావణ్యలు మరికొద్ది గంటల్లో ఒక్కటి కాబోతున్నారు. వీరు ఏడు అడుగులు వేయబోతున్నారు. ఇటలీలో వీరి పెళ్లికి అంతా సిద్ధం అయిపోయింది. ఈ ఏడాది జూన్‌లో ఈ జంట ఇరు కుటుంబాల మధ్య నిశ్చితార్థం చేసుకుంది. ఇప్పుడు ఇటలీలో నవంబర్ 1న వరుణ్ లావణ్యలు ఏడు అడుగులు వేయబోతున్నారు. తమ్ముడి పెళ్లి కోసం అందరికంటే ముందుగా రామ్ చరణ్-ఉపాసన ఇటలీ చేరుకుని సందడి చేస్తున్నారు. అక్కడ పెళ్లి ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు.

ఇటీవలే వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి సైతం ఇటలీ వెళ్లిన వీడియోలు వైరల్ గా మారాయి. తాజాగా మెగాస్టార్ దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇటలీ వెళ్లిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫోటోలను రామ్ చరణ్ -ఉపాసన తమ ఇన్‌స్టా గ్రామ్ వేదికగా షేర్ చేశారు. ఈ ఫోటోల్లో ఉపాసన కుటుంబ సభ్యులు, మెగా ఫ్యామీలి అంతా కలిసి ఉన్నారు. ఇరు కుటుంబాల సభ్యులు కలిసి ఒకే ఫోటోలో కనిపించడంతో ఫ్యాన్స్ కూడా ఖుషి అయిపోయారు.
కొణిదెల- కామినేని ఫ్యామిలీ ఇన్ వన్ ఫ్రేమ్ అంటూ నెటిజన్స్ ట్రెండ్ చేశారు. ఇక ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఇదిలా ఉండగా... ఉపాసన క్లీంకారా ఫోటోను ఎంత దాచాలని ట్రై చేసినా.. నెటిజన్స్ మాత్రం పట్టేశారు. అయితే ఆ ఫోటోల్లో ఉపాసన క్లీం కారా ఫోటోకు అంటే ఫేస్ కు లవ్ సింబల్ ను యాడ్ చేసింది. దీంతో ఆమె ఫోటో కనబడకుండా పోయింది. అయితే నెటిజన్స్ ఊరుకుంటారా.. క్లీం కారా ఫోటోను కనిపెట్టి మరీ ట్రెండ్ చేస్తున్నారు.

మెగా ఫ్యామిలీ అంతా కలిసి దిగిన ఆ ఫోటో ఓ స్విమ్మింగ్ ఫూల్ ముందు పోజులిచ్చారు. దీనితో నీటిలో రివర్స్‌లో కనిపిస్తున్న క్లీంకార ఫేస్‌ను ఉపాసన కవర్ చేయకపోవడంతో... ఇది చూసిన నెటిజన్స్ క్లీం కారా ఫోటోను వైరల్ గా మార్చేస్తున్నారు. ఇక ఉపాసన మేడం.. మీరు క్లీంకార ఫేస్‌ను నీటిలో కవర్ చేయడం మరిచిపోయారు అంటూ కామెంట్స్ చేస్తూ ట్రెండింగ్ మార్చారు. దీంతో మొత్తానికి క్లీం కారా ఫోటోను చూడటంతో మెగా ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.

ఇక వరుణ్ తేజ్ లావణ్యల పెళ్లి నవంబర్ 1వ తేదీన జరగనుంది. ఇక వీరి పెళ్లికి మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ హాజరుకానున్నారు. ఇక చిరంజీవి తల్లి మాత్రం ఆరోగ్య కారణాల రీత్యా ఇంటి వద్దే ఉన్నారట. ఇక హైదరాబాద్లో సినీ ప్రముఖులకు ఓ రిసెప్షన్ ఇవ్వనున్నారు. నవంబర్ 5వ తేదీన రిసెప్షన్ కు సినీ రాజకీయా ప్రముఖులు హాజరు కానున్నారు.


Click it and Unblock the Notifications











