మళ్లీ పెళ్లికి రెడీ!.. బ్రహ్మాజీ మామూలోడు కాదుగా!!

టాలీవుడ్ ఆర్టిస్ట్‌లో బ్రహ్మాజికి ప్రత్యక స్థానం ఉంటుంది. హీరోగా, విలన్, కమెడియన్, సపోర్టింగ్ రోల్స్ ఇలా ప్రతీ ఒక్క కేటగిరలో తనన తాను నిరూపించకున్నాడు. సింధూరం, ఖడ్గం వంటి సినిమాలో అద్భుత నటనతో అందర్నీ మెప్పించాడు. ఇక విలన్‌గా భయపెట్టినా.. కమెడియన్‌గా అంతకు వంద రెట్లు నవ్వించాడు. అయితే తెరపై బ్రహ్మాజి ఎంత సందడగా ఉంటాడో.. తెర వెనుకా అంతే సరదాగా ఉంటాడు. ఇక సోషల్ మీడియాలో అయితే బ్రహ్మాజి వేసే పంచ్‌లు ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటాయి.

సోషల్ మీడియాలో రచ్చ..

సోషల్ మీడియాలో రచ్చ..

బ్రహ్మాజీ సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నెటిజన్లు వేసే కౌంటర్లకు రివర్స్ కౌంటర్లు వేస్తుంటాడు. మీడియా రాసే గాసిప్స్, రూమర్లపై తనదైన శైలిలో పంచ్‌లు వేసి నవ్విస్తాడు. ఆ మధ్య రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నట్టుగా అందులో యాభై ఏళ్ల వయసున్న అతనికి పాతికేళ్ల వయసున్న అమ్మాయికి పుట్టే ప్రేమ కథ అంటూ ఏవేవో కథనాలు అల్లితే వాటిపై బ్రహ్మాజి ఫైర్ అయ్యాడు.

లాక్ డౌన్‌లో అలా..

లాక్ డౌన్‌లో అలా..

లాక్‌డౌన్‌లో బ్రహ్మాజి చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇక వరుసగా లాక్ డౌన్‌లు పెంచుకుంటూ పోవడంపై అదిరిపోయే సెటైర్ వేశాడు. ఇంకొన్నాళ్లు ఇలాగే పెంచితే తనకు చిప్పకూడే అని సింబాలిక్‌గా చేతిలో ప్లేట్ పట్టుకున్న ఫోటోను షేర్ చేసింది అందర్నీ నవ్వించాడు. అప్పట్లో ఆ ఫోటో తెగ వైరల్ అయింది.

ఆ టీజర్‌పై..

ఆ టీజర్‌పై..

ఆ మధ్య రిలీజ్ అయిన కలర్ ఫోటో టీజర్‌పై బ్రహ్మాజీ స్పందించాడు. వెన్నెల కిషోర్‌తో సంభాషిస్తూ.. నటుడు సుహాస్‌పై కౌంటర్లు వేశారు. కుర్రోడికి బాగా టాలెంట్ ఉన్నట్టుంది.. ఇక మనం అయిపోతాం.. తొక్కేద్దాం అంటూ సెటైర్ వేశాడు. ఇక ఆ వ్యాఖ్యలు అప్పట్లో బాగానే వైరల్ అయ్యాయి. తాజాగా బ్రహ్మాజి సెట్స్‌పైకి వెళ్లినట్టు తెలుస్తోంది.

Recommended Video

Bigg Boss Telugu 4: Noel sean Demands Sorry From Bigg Boss
పెళ్లి కొడుకు గెటప్‌లో..

పెళ్లి కొడుకు గెటప్‌లో..

బ్రహ్మాజీ ప్రస్తుతం సినిమా షూటింగ్‌లో పాల్గొన బోతోన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు మేకప్ వేసుకుని రెడీ అయి సెల్ఫీ కూడా తీసుకున్నాడు. ఇందులో పెళ్లి గెటప్ వేసుకోవడం అది ఎలాంటి సీనో అర్థమవుతోంది. మళ్లీ పెళ్లికి రెడీ అయినట్టున్నాడు.అయితే ఈ సారి ఎవరికి కడతాడో.. అసలు అది ఏ సినిమా షూటింగో.. ఇలాంటి వివరాలేవీ ప్రకటించలేదు. మరోసారి పెళ్లి.. ఇది ఎన్నోసారో లెక్కపెట్టడం మరిచిపోయా అని ఓ కౌంటర్ వేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X