ప్రభాస్ ఫామ్ హౌజ్ విలువ ఎంతో తెలుసా.. లైఫ్ స్టైల్‌కు తగ్గట్లుగానే..
డార్లింగ్ ప్రభాస్ అంటే ఏమిటో ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలుసు. టెన్షన్ లేకుండా ఎల్లప్పుడూ పాజిటివ్ గా ఉండే ప్రభాస్ వీలైనంత వరకు కాంట్రవర్సీలకు దూరంగానే ఉంటాడు. ఇక బాహుబలి అనంతరం ప్రభాస్ లైఫ్ స్టైల్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టారు బాలీవుడ్ మీడియా వాళ్ళు. ప్రభాస్ కు సంబంధించిన అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ టాలీవుడ్ పై ఓ కన్నేసి ఉంచుతున్నారు. ఇక ఇప్పుడు బాలీవుడ్ ఫోకస్ మొత్తం ప్రభాస్ ఫామ్ హౌజ్ పైనే పడింది.

ఫోకస్ పెట్టిన బాలీవుడ్ మీడియా
ప్రభాస్ అంటే ఇప్పుడు పాన్ ఇండియా హీరో. ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే బాహుబలిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాడు. సాహో సినిమా కూడా అక్కడ బాగానే వసూళ్లను అందుకుంది. దీంతో ప్రభాస్ కు అక్కడ సోలో క్రేజ్ దక్కిందని అర్ధమయ్యింది. అందుకే నెక్స్ట్ సినిమాలను బాలీవుడ్ లో ఇంకా భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు. ప్రస్తుతం రాధేశ్యామ్ కు ఫీనిషింగ్ టచ్ ఇస్తున్న విషయం తెలిసిందే.

ఫామ్ హౌజ్ ను మరింత అప్గ్రేడ్ చేసిన ప్రభాస్
అసలు మ్యాటర్ లోకి వెళితే.. బాలీవుడ్ లో ప్రస్తుతం ప్రభాస్ ఫామ్ హౌజ్ కు సంబంధించిన వార్తలు బాగానే వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ శివార్లలో ఉన్న ప్రభాస్ ఫామ్ హౌజ్ పై గతంలోనే అనేక రకాల స్టోరీలు వచ్చాయి. ఇక ఇటీవల ప్రభాస్ ఇంకాస్త అప్గ్రేడ్ చేసినట్లు తెలుస్తోంది. సరికొత్త మొక్కలతో తన ఫామ్ హౌజ్ గార్డెన్ ను నింపేశాడట. అలాగే వ్యవసాయం కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.

దాని ధర ఎంతంటే..
ఇక ప్రభాస్ ఫామ్ హౌజ్ విలువ దాదాపు 60కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. పైగా దాన్ని కొనుగోలు చేసిన తరువాత ప్రభాస్ లైఫ్ స్టైల్ కు తగ్గట్లుగా మార్చుకున్నాడు. షూటింగ్ లేనప్పుడు ఎక్కువగా అక్కడే కాలక్షేపం చేస్తున్నాడు. ప్రభాస్ స్నేహితులు కూడా అక్కడికి వస్తుంటారు. అందులో ఇండస్ట్రీ స్నేహితులు కూడా ఉన్నారు.

అటవీ ప్రాంతాల కోసం కోట్ల రూపాయలు
ఇటీవల ప్రభాస్ నగర శివార్లలో ఉన్నటువంటి కొన్ని అటవీ ప్రాంతాలను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. వాటి సంక్షేమం కోసం ఒక ప్రత్యేక టీమ్ ను ఏర్పటు చేసిన డార్లింగ్ కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాడని తెలుస్తోంది. తగ్గిపోతున్న వనరులపై ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకొని అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ముగా జీవాలకు ఉపయోగపడే విధంగా కూడా కొన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు సమాచారం.
Recommended Video

సినిమాల విషయానికి వస్తే..
ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ షూటింగ్ ను పూర్తి చేస్తున్న విషయం తెలిసిందే. జిల్ దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఆ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ సినిమాతో పాటు ఓం రావత్ అది పురుష్ అలాగే KGF మేకర్స్ తో సలార్ అనే సినిమాను చేయనున్నాడు. వచ్చే ఏడాది నుంచి ఒక్కో సినిమాను సంవత్సరం గ్యాప్ లలో రిలీజ్ చేయాలని ప్రభాస్ ప్లాన్ చేసుకుంటున్నాడు.


Click it and Unblock the Notifications











