బయోపిక్ జోరు: సీఎం కేసీఆర్‌గా శ్రీకాంత్.. రంగంలోకి నటుడు ఉత్తేజ్

Recommended Video

Srikanth Acts In KCr's Biopic

మహానటి సావిత్రి బయోపిక్ తర్వాత టాలీవుడ్‌లో జీవిత చరిత్రల ఆధారంగా తెరకెక్కే సినిమాల జోరు పెరిగింది. ఎన్టీఆర్ బయోపిక్, లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీత్ వీరగ్రంధం, వైఎస్ఆర్ యాత్ర, సైరా నర్సింహరెడ్డి, కే చంద్రశేఖర్ రావు, పుల్లెల గోపిచంద్, చింతకింది మల్లేషం, కోడి రామకృష్ణ బయోజిక్‌లు వెండితెర హంగామా చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ జీవితం ఆధారంగా శ్రీకాంత్ ముఖ్య పాత్రలో తెలంగాణ దేవుడు అనే చిత్రంలో నటించనునున్నారు.

సీఎం కేసీఆర్‌గా శ్రీకాంత్

సీఎం కేసీఆర్‌గా శ్రీకాంత్

టాలీవుడ్‌లో శత చిత్ర నటుడు శ్రీకాంత్ మరో అరుదైన పాత్రలో వెండితెర మీద కనిపించబోతున్నాడు. తెలంగాణ ఉద్యమ సారథి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాత్రను తెలంగాణ దేవుడు అనే చిత్రంలో పోషిస్తున్నారు. శాంతియుత పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసిన కేసీఆర్ పాత్రలో కనిపించబోతున్నట్టు శ్రీకాంత్ వెల్లడించారు.

తెలంగాణ దేవుడిగా కేసీఆర్

తెలంగాణ దేవుడిగా కేసీఆర్

తెలంగాణ దేవుడు చిత్రం కేసీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్నది. ఆ చిత్రంలో కేసీఆర్ బాల్యం నుంచి ముఖ్యమంత్రి అయ్యేవరకు ఆయన జీవితంలో జరిగిన ముఖ్య ఘట్టాలను ఆధారంగా చేసుకొని సినిమాను తెరకెక్కిస్తున్నాం. ఇంకా పది రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది అని అన్నారు.

కేసీఆర్ పేరు వాడుకోవడం లేదు

కేసీఆర్ పేరు వాడుకోవడం లేదు

తెలంగాణ దేవుడు చిత్రంలో కేసీఆర్ పేరు వాడుకోవడం లేదు. కానీ ఆ పాత్రను ప్రతీ ఒక్కరు ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఆ చిత్రంలో నేను పోషించే పాత్ర పేరు విజయ్ దేవ్. నాకు ఇష్టమైన కేసీఆర్ పాత్రలో నటించే అవకాశం రావడం నిజంగా అదృష్టమే. నా పాత్రలో పరిపూర్ణమైన రాజకీయ నాయకుడిని చూడటానికి వీలు కలుగుతుంది అని శ్రీకాంత్ పేర్కొన్నారు.

నటుడు ఉత్తేజ్ సహకారంతో

నటుడు ఉత్తేజ్ సహకారంతో

ఆ సినిమా కోసం నేను చాలా వీడియోలు చూశాను. ఆయన బాడీ లాంగ్వేజ్‌ను పరిశీలించాను. తెలంగాణ భాష విషయంలో నాకు నటుడు ఉత్తేజ్ సహకారం అందిస్తున్నాడు అని శ్రీకాంత్ తెలిపారు. మహ్మద్ జకీర్ ఉస్మాన్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో సుమన్, బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, అలీ, ప్రగతి, తోటపల్లి మధు తదితరులు నటిస్తున్నారు.

ఆపరేషన్ 2019లో శ్రీకాంత్

ఆపరేషన్ 2019లో శ్రీకాంత్

తెలంగాణ దేవుడు చిత్రంతో పాటు మరో రాజకీయ ప్రధాన్యం ఉన్న ఆపరేషన్ 2019 చిత్రంలో శ్రీకాంత్ నటిస్తున్నారు. ఈ సినిమా కథ ఏపీ రాజకీయాల చుట్టు తిరుగుతుందనే మాట వినిపిస్తున్నది. ప్రస్తుత రాజకీయాలపై భారీగా సెటైర్లు విసినట్టు టీజర్లు, ట్రైలర్లలో స్పష్టమైంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X