twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తమిళ హీరోతో జ్వాలా గుత్తా కుచ్ కుచ్ హోతాహై? క్రికెటర్ అశ్విన్ కూడా డౌట్ పడ్డాడు!

    |

    తమిళ నటుడు విష్ణు విశాల్‌ ట్విట్టర్లో షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తాతో సన్నిహితంగా ఉన్న ఈ పిక్స్ అందరి మెదళ్లలో కొత్త అనుమానాలకు కారణం తావిస్తోంది. ఇద్దరి మధ్య 'సం'బంధం ఏదో ఉందనే రూమర్స్‌కు ఆజ్యం పోస్తోంది.

    విష్ణు విశాల్ ఇటీవలే తన భార్య రజనీతో విడిపోయాడు. జ్వాలా గుత్తా ఆల్రెడీ డైవర్సీ అనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య కొత్త రిలేషన్ మొదలైందనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. కొందరైతే వీరు త్వరలో పెళ్లి చేసుకునే అవకాశం ఉందనే డౌట్స్ సైతం వ్యక్తం చేస్తున్నారు.

    క్రికెటర్ అశ్విన్ కూడా డౌట్ పడ్డాడు!

    వీరు సన్నిహితంగా ఉన్న ఫోటోస్ చూసిన టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ మదిలో కూడా అనుమానాలు తలెత్తాయి. ఇద్దరూ కలిసి బయోపిక్ చేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. దీనికి వెంటనే జ్వాలా రిప్లై ఇస్తూ... ‘నేను నటిని కాదు అశ్విన్' కామెంట్ పెట్టింది.

    విష్ణు విశాల్ ఈమె కోసమే తన భార్యను వదిలేశాడా?

    విష్ణు విశాల్ ఇటీవలే తన భార్య రజనీతో విడిపోయాడు. జ్వాలా గుత్తా కోసమే అతడు తన భార్యను వదిలేశాడా? అనే సందేహాలు వ్యక్తం చేస్తూ కొందరు నెటినట్లు కామెంట్లు పెట్టడం గమనార్హం. వీరి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఈ రూమర్లపై విష్ణు విశాల్ కానీ, జ్వాలా గుత్తాకానీ స్పందించాల్సి ఉంది.

    భార్యతో ఎందుకు విడిపోయాడు?

    భార్యతో ఎందుకు విడిపోయాడు?

    తన భార్య రజనీతో విడిపోవడానికి గల కారణం అర్థం కావడం లేదంటూనే... విష్ణు విశాల్ కొన్ని రోజుల క్రితం ఆసక్తికర కామెంట్స్ చేశారు. నా వ్యక్తిత్వానికి భిన్నంగా నేను ఇతరులతో చనువుగా ఉండటమే నా విడాకులకు కారణమా? అనే అనుమానం కలుగుతున్నది. ఇతరులతో సన్నిహితంగా ఉండమే నా జీవితంలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకొన్నాయని అనిపిస్తున్నది. నాలోని మార్పులే నాకు కష్టాలు తెస్తున్నాయా? ఆ కారణంగానే ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకొన్నానా? అనే భావన కలిగిందా అనే సందేహాలు నన్ను వెంటాడుతున్నాయి.... అంటూ కొన్ని రోజుల క్రితం విష్ణు విశాల్ సోషల్ మీడియా ద్వారా తన మనసులోని భావాలు బయట పెట్టారు.

    విష్ణు విశాల్

    విష్ణు విశాల్

    విష్ణు విశాల్ ప్రస్తుతం రానా దగ్గుబాటితో కలిసి ‘హాథీ మేరీ సాతీ' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ప్రభు సాల్మన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఏనుగు, మావటి నేపథ్యంలో సాగుతుంది. కొన్ని రోజుల క్రితం షూటింగులో గాయపడ్డ విష్ణు విశాల్ ఇటీవలే రికవరీ అయ్యాడు.

    English summary
    Actor Vishnu Vishal shared pictures with badminton player Jwala Gutta, and this has led to a lot of speculations. Even Ravichandran Ashwin seems to be intrigued by the post. He asked Vishnu if they are making a biopic. But Jwala replied saying, "I am not an actress Ashwin."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X