For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అక్కినేని వారసుడు నాగ చైతన్య సినీ జీవితం, లైఫ్ స్టైల్!

By Oneindia Staff
|
Naga Chaitanya Biography

అక్కినేని నట వారసత్వాన్ని కొనసాగిస్తూ ..తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న హీరో అక్కినేని నాగ చైతన్య. మొదట్లో తెలుగు ప్రేక్షకుల నుంచి యాక్టింగ్ మరియు హావభావాల పరం గా విమర్శలు ఎదుర్కున్నపటికి ప్రతి సినిమా కి ఇంప్రూవ్ అవుతూ తనలోని స్కిల్ల్స్ ని కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు నాగ చైతన్య. మనకున్న హీరోలలో నాగ చైతన్య ఎంతో ప్రత్యేకం..తన గ్రాండ్ ఫాధర్స్ అక్కినేని నాగేశ్వరావు..దగ్గుబాటి రామానాయుడు ఇద్దరు లెజెండ్స్.. అలాగే తండ్రి నాగార్జున..మామయ్య వెంకటేష్ తెలుగు సినిమా గర్వించదగ్గ నటులు..వీళ్ళందరి సినీ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న హీరో నాగ చైతన్య.

నాగ చైతన్య 1986 నవంబరు 23న జన్మించాడు.ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున,లక్ష్మిల తనయుడు. జోష్ అనే చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమ లోకి ప్రవేశించాడు.ఆ చిత్రం కంటెంట్ పరం గా బాగున్నా అప్పటి పరిస్థితుల వల్ల ఆశించన ఫలితాన్ని ఇవ్వలేదు,కానీ ఈసినిమా ద్వార చైతన్య ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్ మరియు, నంది అవార్డులను పొందాడు . గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రం ఏ మాయ చేసావే ద్వారా మంచి విజయాన్ని నమోదు చేశాడు. ఏ మాయ చేసావే సినిమా ..అందులోని సంగీతం ..ఫీల్ గుడ్ సీన్స్ వేటికవే ప్రత్యేకం..తమ ఇన్నోసెంట్ యాక్టింగ్ తో ఈ సినిమా కి ఫ్రెష్ ఫీల్ తీసుకొచ్చారు నాగ చైతన్య, సమాంత.నేటికీ తెలుగు సినిమాల్లోని ఎన్నో క్లాసిక్స్ లో ఒకటిగా ఈ చిత్రం నిలిచిపోయింది. ఈ సినిమాకి చైతన్యకు ఉత్తమ నటుడికి గాను నాటి ఫిలింఫేర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు.

Actors Biography: Akkineni Naga Chaitanya Biography

ఆ తర్వాత 2011లో సుకుమార్ దర్శకత్వంలో 100% లవ్ సినిమాలో నటించాడు. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సాధించింది. ఇక్కడి దాక సాఫీగా సాగిన నాగ చైతన్య సినీ ప్రయాణం.. ఆ తర్వాత అజయ్ భుయాన్ దర్శకత్వంలో తెరకెక్కిన దడ చిత్రం , వివేక్ కృష్ణ దర్శకత్వంలో అమలాపాల్ కథానాయికగా తెరకెక్కిన బెజవాడ సినిమాలు పరాజయాన్ని చవిచూసాయి. ఈ రెండు సినిమాలు తన కెరీర్ కి ఏ మాత్రం హెల్ప్ అవలేదు. ఆ తర్వాత వచ్చిన దేవా కట్టా డైరెక్షన్ లో వచ్చిన ఆటో నగర్ సూర్య చైతన్య లోని మాస్ యాంగిల్ ని బయటపెట్టింది అని చెప్పవచ్చు. తడాఖ కూడా మాస్ టైప్ లో ట్రై చేసిన మూవీ నే.

ఇక నాగ చైతన్య సినిమాల్లో చెప్పుకోదగ్గ చిత్రం 'మనం'. ఈ చిత్రంలో స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారు నటించడంతో ఫాన్స్ లో, ప్రేక్షకుల్లో అంచనాలు ఎక్కువయ్యాయి. అయితే, ఈ చిత్రం పూర్తి కాకుండానే, ఎ.ఎన్.ఆర్ మరణించడం బాధాకరమైన విషయమే అయినా, 'మనం' సినిమా అంచనాలకు మించి, బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు సృష్టించింది.ఆ తర్వాత 2014 చివర్లో 'ఒక లైలా కోసం'తో మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.2015 లో సుధీర్ వర్మ దర్శకత్వంలో 'దోచేయ్' అనే సినిమా చేసినప్పటికీ అది ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.2016 లో మలయాళం రీమేక్ అయిన 'ప్రేమమ్' సినిమాతో మరొక విజయాన్ని అందుకున్నాడు.ఆ వెంటనే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో 'సాహసమే శ్వాసగా సాగిపో'అనే చిత్రంలో నటించి ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నాడు.2017 లో 'రారండోయ్ వేడుక చూద్దాం'తో మళ్ళీ ఘన విజయం సాధించింది.2018 లో విడుదల అయిన శైలజా రెడ్డి అల్లుడు యావరేజ్ గా ఆడింది.

100% లవ్ సినిమా విడుదలైన కొత్తల్లో తనకీ, ప్రముఖ నటి అనుష్కకి నిశ్చితార్థం జరిగిందని మీడియాలో వార్తలొచ్చాయి. ఐతే అవన్నీ వదంతులని నాగార్జున, చైతన్య, అనుష్కలు తేల్చి చెప్పారు. అయితే, తనతోపాటు 'ఏం మాయ చేసావే', 'మనం' వంటి చిత్రాల్లో కలిసి నటించిన సమంతను 6 అక్టోబర్ 2017 న వివాహం చేసుకున్నారు.

Actors Biography: Akkineni Naga Chaitanya Biography

ఇక నాగ చైతన్య వ్యక్తిగత జీవితం గురించి చూస్తే హైదరాబాద్ లో జన్మించిన నాగ చైతన్య తన తల్లిదండ్రులు విడిపోయాక చెన్నైలో ఉంటున్న తల్లి దగ్గరికి వెళ్ళిపోయాడు. పీ.ఎస్.బీ.బీ. పాఠశాలలో చదువుకున్నప్పుడు చైతన్య తన తండ్రి నాగార్జున, తన పిన్ని అమలతో సఖ్యతగా ఉండేవాడు. తన పాఠశాల బ్యాండ్ లో అప్పుడప్పుడూ గిటార్ వాయించేవాడు. ముంబైలో, కాలిఫోర్నియాలోని స్టూడియోలో నటనలో శిక్షణ పొందాడు.

నేటికి కూడా చైతన్య తనకు కార్లమీద ఉన్న అభిమానంతో కార్ రేసుల్లో పాల్గొంటుంటాడు.నాగ చైతన్య దగ్గర రేంజ్ రోవర్ వోగ్,నిసాన్ GTR, రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ కార్ లు ఉన్నాయి..వీటి అన్నిటి విలువ సుమారు 7 కోట్ల వరకు ఉంటుంది. చైతన్య దగ్గర ఫెరారీ 488 GTB కార్ కూడా ఉంది. ఈ రెడ్ కలర్ కార్ ని చైతన్య ఎంతో ముచ్చట పది కొనుగోలు చేసాడు..అలానే BMW బైక్ కూడా చైతన్య ఇష్టపడి కొనుక్కున్నాడు.తన వెహికల్స్ ని ప్రాణం గా చుస్కుంటాడు నాగ చైతన్య.. ఇవి నాగచైతన్య చైతన్య గురించి సినీ మరియు వ్యక్తిగత విశేషాలు..స్టే ట్యూన్డ్ టూ ఫైల్మిబీట్ తెలుగు..!

English summary
Akkineni Naga Chaitanya Biography & Life Style.Naga Chaitanya is a car fanatic like many on this list. The actor owns a collection of Range Rover Vogue, Nissan GTR, Range Rover Autobiography which all value to an approximate of Rs.7 crores. The actor usually drives the Nissan GTR and it has spotted by quite a few people. Also, he has been known to participate in racing events.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more