Don't Miss!
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పర్సనల్ నెంబర్ అడిగిన నెటిజన్.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన హరితేజ
బుల్లితెరపై, వెండితెరపై ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది నటి హరితేజ. అయితే బుల్లితెరపై విలన్ పాత్రలను పోషించిన హరితేజ.. వెండితెరపై మాత్రం నవ్వులు పూయించింది. బిగ్‌బాస్ షో తరువాత హరితేజ ఫేట్ మారిపోయింది. ఆమెలోని టైమింగ్, సెటైర్స్ అందరికీ బాగా నచ్చాయి. అవే ఆమెకు కమెడియన్ రోల్స్‌ను తీసుకొచ్చాయి. అంతేకాకుండా బిగ్‌బాస్ తరువాత.. హోస్టింగ్, యాంకరింగ్‌లోనూ హరితేజకు మంచి అవకాశాలు వచ్చాయి. అలా తన కెరీర్లో బిగ్‌బాస్ రియాల్టీ షో ఎంతగానో ఉపయోగపడింది. ఆమెకు సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్, ఫాలోవర్స్‌ను తెచ్చిపెట్టింది.
డిమాండ్ ఉన్న నటి..
బిగ్‌బాస్ షో కొందరిని ఎవరెస్ట్ ఎత్తున నిలబెట్టే క్రేజ్‌ను తీసుకొస్తే మరికొందరిని అథ: పాతాళానికి తొక్కేసేలా చేస్తోంది. హరితేజ విషయంలో అప్పటి వరకు ఉన్న అభిప్రాయాన్ని మార్చేసి.. తమ సొంతింటి ఆడపిల్లలా అందరూ ఆదరించారు. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక హరితేజకు ఆఫర్స్ వెల్లువెత్తాయి. దీంతో ఆమెకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది.
కామెడీ టైమింగ్..
హరితేజ కామెడీ టైమింగ్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె కామెడీ ట్రాక్ సినిమాలో మెయిన్ హైలెట్‌గా నిలుస్తూ ఉంటుంది. అఆ, ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు వంటి చిత్రాల్లో హరితేజ మంచి హాస్యాన్ని అందించింది. వెండితెరపైనే కాకుండా వేదికలపైనా కామెడీతో అదరగొడుతుంది.
లాక్ డౌన్లో ఎంజాయ్..
నిత్యం బిజీగా గడిపే తారలకు లాక్ డౌన్ బాగా కలిసి వచ్చింది. ఫ్యామిలీతో విలువైన సమయాన్ని గడిపారు. అందులో భాగంగా హరితేజ లాక్ డౌన్లో చేసిన అల్లరి, వండిన వంటలు, కిచెన్‌లో వేసిన స్టెప్పులు, సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు ఓ రేంజ్లో వైరల్ అయ్యాయి. తాజాగా నెటిజన్లతో హరితేజ ముచ్చటించింది. ఆ సంగతులేంటో ఓసారి చూద్దాం.
Recommended Video
పర్సనల్ నంబర్..
లెట్స్ టాక్ అంటూ హరితేజ సోషల్ మీడియాలో ఓ సెషన్ ప్రారంభించింది. దానికి స్పందించిన నెటిజన్.. మీ నెంబర్ ఇవ్వండి రోజు మాట్లాడుకోవచ్చు అని అన్నాడు. దానికి హరితేజ సెటైరికల్‌గా ఓ నవ్వు నవ్వింది. టిక్ టాక్ బ్యాన్పై అభిప్రాయం చెప్పమనగా.. ప్రస్తుతం ఎన్నో పోతున్నాయి.. వాటిలో టిక్ టాక్ ఓ లెక్కా అని చెప్పుకొచ్చింది. తన బయోపిక్కు ఓ టైటిల్ కూడా సజెస్ట్ చేసింది హరితేజ. భమ్ భమ్ భజూకా అంటూ నవ్వేసింది.