గూగుల్‌లో టాప్ ఉద్యోగిగా బాలీవుడ్ నటి.. ఆఫర్లు రాకపోవడం, పరిశ్రమ వెక్కిరించడంతో..

Recommended Video

Vintage Bollywood Actress Is Now Google India Industry Head || Filmibeat Telugu

హిందీ చిత్ర పరిశ్రమ ఆదరించకపోయినా బాలీవుడ్ హీరోయిన్ మయూరి కాంగో గూగుల్‌‌ కంపెనీలో టాప్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం సంపాదించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పాపా కాహ్తే హై చిత్రంలో ఘర్ సే నికల్తే హై పాటతో దేశవ్యాప్తంగా ప్రజాదరణను సంపాదించుకొన్నారు. హీరో జుగల్ హన్స్‌రాజ్‌తో కలిసి హీరోయిన్‌గా ఈ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. సినిమా పరిశ్రమను ఎందుకు వదిలేశారంటే..

 జాతీయ ఉత్తమ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి

జాతీయ ఉత్తమ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి

1995లో జాతీయ అవార్డు గెలుచుకొన్న నసీం అనే చిత్రం ద్వారా మయూరి కాంగో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుకున్న ఈ బ్యూటీ సినిమాలపై మక్కువతో చదువును వదిలేసింది. ఆ తర్వాత అజయ్ దేవగన్, అనుపమ్ ఖేర్, అర్షద్ వార్సీ, శక్తికపూర్, బాబీ డియోల్, రాణి ముఖర్జి, చంద్రచూడ్ సింగ్, జుగల్ హన్స్‌రాజ్‌తో కలిసి నటించారు.

 వెండి తెర నుంచి బుల్లితెరకు

వెండి తెర నుంచి బుల్లితెరకు

వెండితెరపైన సరైన అవకాశాలు రాకపోవడంతో కొన్నాళ్లు బుల్లితెరపైన అదృష్టాన్ని పరీక్షించుకొన్నది. కహీ కిసీ రోజ్, కిట్టి పార్టీ, కుసుమ్, క్యా హద్సా క్యా హకీకత్ అనే సీరియల్స్‌లో నటించింది. ఆ తర్వాత ఆదిత్య దిల్లాన్ అనే వ్యక్తిని వివాహం చేసుకొన్నారు. బుల్లితెరపైన కూడా ఆఫర్లు కష్టమవ్వడంతో ఉన్నత విద్యపై దృష్టిపెట్టింది.

న్యూయార్క్‌లో ఎంబీఏ చదువు, ఉద్యోగం

న్యూయార్క్‌లో ఎంబీఏ చదువు, ఉద్యోగం

అవకాశాలు లేకపోవడంతో పూర్తిగా సినిమాలను వదిలేసిన మయూరి కాంగో న్యూయార్క్‌లోని జిక్లిన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ ఫైనాన్స్ విద్యను అభ్యసించారు. న్యూయార్క్ డిజిటల్ ఏజెన్సీ 360ఐ కొన్నాళ్లు పనిచేశారు. ఆ తర్వాత డిజిటాస్, జెనిత్‌లో చీప్ డిజిటల్ ఆఫీసర్‌గా వర్క్ చేశారు.

గూగుల్‌ కంపెనీలో టాప్ రేంజ్‌కు

గూగుల్‌ కంపెనీలో టాప్ రేంజ్‌కు

అనంతరం న్యూయార్క్ నుంచి ఇండియాకు మకాం మార్చారు. ప్రస్తుతం గుర్‌గావ్‌లో నివసిస్తున్న మయూరి కాంగో గూగుల్ ఇండియాలో టాప్ ఎగ్జిక్యూటివ్ బాధ్యతలను చేపట్టింది. ఉద్యోగంలో భాగంగా ముంబై, బెంగళూరు నగరాల మధ్య చక్కర్లు కొడుతున్నారు. ప్రస్తుతం ఈమెకు ఓ కుమారుడు కూడా ఉన్నారు.

మయూరి కాంగో నటించిన చిత్రాలు ఇవే

మయూరి కాంగో నటించిన చిత్రాలు ఇవే

బాలీవుడ్‌లో పాపా కహ్తే హై, బేతాబీ, హోగీ ప్యార్ కీ జీత్, పాపా ది గ్రేట్ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఉద్యోగంలో బిజీగా మారిన మయూరి కాంగో.. వీలైతే సినిమాలకు తిరిగి వచ్చే ఆలోచన‌లో ఉందట. కానీ తనకు నచ్చిన స్క్రిప్టు లభిస్తే తప్ప సినిమాల వైపు తొంగిచూడని వెల్లడించినట్టు తెలిసింది.

మయూరి కాంగో నటించిన పాపా కహ్తే హై చిత్రంలోని ఘర్ సే నిఖల్తే హీ పాట కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X