ఆ హీరోకు పెళ్లి అయింది.. ఆ రోజు నా గుండె బద్దలైంది.. నాటి అందాల తార మీనా కామెంట్స్

హీరోలకు అయినా హీరోయిన్లకైనా క్రష్, ఇష్టం, ప్రేమ అనేది ఉంటుంది. ఓ హీరోపై ఇంకో హీరోయిన్‌కు అభిమానం ఉంటుంది. ఓ హీరోయిన్‌పై మరో హీరోకు ఇష్టం ఏర్పడుతుంది. అది సహజమే. తాజాగా ఇలాంటి ఘటనను నాటి అందాల తార మీనా బయటపెట్టేసింది. తనకు ఎల్లప్పుడూ ఇష్టమైన, అభిమాన హీరో పెళ్లి అయిందని, తరువాత ఆయన్ను కలుసుకున్నానని, గుండె ముక్కలైందని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా నాటి విషయాలను కూడా నెమరు వేసుకుంది.

దక్షిణాది స్టార్ హీరోయిన్..

దక్షిణాది స్టార్ హీరోయిన్..

బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన మీనా.. ఆపై స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. దక్షిణాది స్టార్ హీరోలందరితోనూ నటించింది. రజినీ, కమల్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇలా 90వ దశకంలో క్షణం కాలం తీరిక లేకుండా గడిపింది. ఇక వివాహానంతరం నటనపై అంతగా ఆసక్తిని కనబర్చలేదు.

తాజాగా నాటి సంగతులు..

తాజాగా నాటి సంగతులు..

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మీనా నాటి సంగతులను గుర్తు చేసుకుంటూ తన అభిమానులతో పంచుకుంది. ఈ మేరకు ఓ పోస్ట్ చేస్తూ.. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. హృతిక్‌ను కలిసినట్టుగా నాటి ఫోటోను కూడా షేర్ చేసింది.

హృదయం బద్దలైంది..

హృదయం బద్దలైంది..

2000లో హృతిక్ వివాహం జరిగిందని, ఆ తరువాత గెట్ టుగేదర్‌కు తాను వెళ్లానని, ఆయన్ను కలిశానని ఆ క్షణంలో నా గుండె బద్దలైనట్టు అనిపించిందని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంలో ఓ పాట షూటింగ్ కోసం మంచును లెక్కచేయకుండా డ్యాన్స్ చేసిన మీనాను హృతిక్ మెచ్చుకున్న ఘటనను ఓ నెటిజన్ మీనాకు గుర్తే చేశాడు. దీంతో మీనా ఉబ్బితబ్బిబ్బైపోయింది.

Recommended Video

Anushka Shetty's Nishabdham To Release On Amazon Prime Video
ఆ పాట షూటింగ్ కోసం..

ఆ పాట షూటింగ్ కోసం..


మీనా పోస్ట్ ను చూసిన ఓ నెటిజన్, అజిత్ హీరోగా నటించిన 'విలన్' సినిమాలో మీరు చేసిన ఓ సాంగ్ ను హృతిక్ చాలా మెచ్చుకున్నారని, ఆ ఆర్టికల్ ను తాను చదివానని చెప్పగా, మీనా, మరో ఘటనను గుర్తు చేసుకున్నారు. ఆ పాట షూటింగ్ మంచులో జరిగిందని ఆ సమయంలో హృతిక్ తో పాటు అమితాబ్, కరీనా కపూర్ లు కూడా అక్కడే ఉన్నారని, దట్టంగా మంచు కురుస్తున్నా షూటింగ్ చేస్తున్నామని, తన గురించి కరీనా తల్లి ఆందోళన చెందేదని చెప్పుకొచ్చింది. షూటింగ్ మధ్య మధ్యలో వేడిని పుట్టించే చాక్లెట్స్ కూడా ఇచ్చిందని గుర్తు చేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X