బర్త్ డే గర్ల్... నయనతారను సర్‌ప్రైజ్ చేసిన ప్రియుడు, ఫోటోస్ వైరల్!
Recommended Video

సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార నేడు తన 34వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె ప్రియుడు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. హాట్ బ్యూటీ ఊహించని విధంగా బర్త్ డే బాష్ ప్లాన్ చేశాడు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నయనతార కొంతకాలంగా తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. ప్రస్తుతం ఇద్దరూ కలిసే జీవిస్తున్నారు. అయితే అఫీషియల్‌గా పెళ్లి చేసుకోవడమే తరువాయి.

నయనతార బర్త్ డే బాష్
నయనతారను సర్‌ప్రైజ్ చేస్తూ విఘ్నేష్ శివన్ బర్త్ డే బాష్ ప్లాన్ చేశాడు. నయన్ ఫోటోతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన కేక్ తయారు చేయించాడు. విద్యుత్ దీపాలతో అలరించించి తన ప్రేయసిని ఆనందంలో ముంచెత్తాడు.

క్రియేటివిటీ చూపించాడు
విఘ్నేష్ శివన్ దర్శకుడు కావడంతో..... తన క్రియేటివిటీ ఉపయోగించి కేక్ తయారు చేయించాడు. నయనతారను లేడీ సూపర్ స్టార్ అని పేర్కొంటూ... ఫిల్మ్ థీమ్‌తో ఉన్న ప్రత్యేకంగా డిజైన్ చేసినకేక్ తయారు చేయించాడు.

నయన్-విఘ్నేష్
2015లో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో వచ్చిన 'నానుమ్ రౌడీ ధాన్' అనే సినిమాలో నయనతార నటించింది. ఈ సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అప్పటి నుండి ఇద్దరూ సీరియస్ రిలేషన్‌షిప్ కొనసాగిస్తున్నారు.
ముచ్చటగా మూడో ఏడాది
వీరి ప్రేమాయణం మొదలై రెండేళ్లు గడిచిపోయింది. ముచ్చటగా మూడో ఏడాది కూడా ఎలాంటి బ్రేకప్ లేకుండా సక్సెస్‌ఫుల్‌గా వీరి లవ్ ఎఫైర్ రన్ అవుతోంది. త్వరలోనే ఇద్దరూ ఓ ఇంటివారు కాబోతున్నారని టాక్.

ప్రభుదేవాతో బ్రేకప్ తర్వాత
ప్రభుదేవాతో ప్రేమాయణం, సహజీవనం తర్వాత అతడిని పెళ్లి చేసుకోవాలనుకున్న నయనతార తర్వాత పలు కారణాలతో అతడితో విబేధించి విడిపోయిన సంగతి తెలిసిందే. కొంతకాలం ఒంటరిగా ఉన్న నయనతార జీవితంలోకి విఘ్నేష్ శివన్ వచ్చాడు.


Click it and Unblock the Notifications











