అందంతో ఎట్రాక్ట్ చేస్తున్న రోజా డాటర్.. హీరోయిన్స్ కంటే తక్కువేమి కాదు, క్యూట్ ఫొటోస్
ప్రస్తుత రోజుల్లో స్టార్స్ కంటే కూడా వారి పిల్లలకే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా పెరుగుతోంది. వారసత్వం అనేది ఈ రోజుల్లో కామన్. రాజకీయాల్లో అలాగే సినీ ఇండస్ట్రీలో స్టార్స్ పిల్లలు పెరుగుతున్న కొద్దీ జనాల దృష్టిని ఆకట్టుకుంటారు. ఇక సీనియర్ హీరోయిన్, నగరి ఎమ్మెల్యే రోజా సెల్వమణి పిల్లలపై కూడా ఇప్పుడు స్పెషల్ ఫోకస్ పడుతోంది. వారికి సంబంధించిన ఫొటోలు చాలానే వైరల్ అవుతున్నాయి.

అందంతో ఆకట్టుకుంటున్న రోజా డాటర్
ముఖ్యంగా రోజా డాటర్ అన్షుమాలిక తన అందంతోనే ఎక్కువగా ఆకర్షిస్తోంది. ఓ వైపు తెలుగుతనం ఉట్టిపడేలా మరోవైపు నేటితరం ట్రెండ్ కి తగ్గట్టుగా గ్లామర్ గర్ల్ గా కనిపిస్తూ తన ఫాలోవర్స్ ని పెంచుకుంటోంది. సోషల్ మీడియాలో అన్షుమాలికకు ఫ్యాన్ పేజిస్ కూడా గట్టిగానే ఉన్నాయి.

బర్త్ డే ఫొటోస్ వైరల్
ఇక అన్షుమాలిక 17వ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో ఆమెకు బర్త్ డే విషెస్ అందిస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి రోజా తన కూతురి పుట్టినరోజు వేడుకను చాలా స్టైలిష్ గా సెలబ్రేట్ చేశారు. అందుకు సంబంధించిన ఫ్యామిలీ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సినిమా ఇండస్ట్రీలోకి వస్తారా?
అన్షుమాలిక చాలా క్యూట్ గా ఉందంటూ చాలా మంది పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. ఇక రోజా ఇంతవరకు తన పిల్లలను సినిమా ఇండస్ట్రీవైపు అడుగు పడనివ్వలేదు. తండ్రి దర్శకుడు అయినప్పటికీ ఆయన కూడా ఎక్కువగా అటు వైపు చూడనివ్వలేదు. ఎడ్యుకేషన్ పూర్తయ్యే వరకు వేరే విషయాలతో డైవర్ట్ కాకుండా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Recommended Video

హీరోగా రోజా తనయుడు
రోజా కూతురు అన్షుమాలిక వెండితెరకు ఎంట్రీ ఇస్తుందా లేదా అనే విషయంలో ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. కానీ తన కొడుకు లోహిత్ మాత్రం హీరోగా ఎంట్రీ ఇస్తాడాని రోజా ఒక ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చింది. ప్రస్తుతం రోజా రాజకీయాలతో బిజీగా ఉంటూనే పలు షోలలో జడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఆమెకు నచ్చితే సినిమాల్లో ప్రత్యేకమైన పాత్రల్లో కూడా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











