Don't Miss!
- Sports
IND vs SA: రెండో ఇన్నింగ్స్‌లోనూ విరాట్ కోహ్లీ విఫలం.. భారీ ఆధిక్యం దిశగా భారత్!
- News
ఇద్దరు ఉగ్రవాదులను పట్టుకున్ని గ్రామస్తులు: ఒకరు మాజీ బీజేపీ మైనార్టీ నేత, రూ. 5 లక్షల రివార్డ్
- Finance
Axis Mutual Fund: యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ పై దావా వేసిన మాజీ ఫండ్ మేనేజర్.. ఎందుకంటే..?
- Technology
BSNL కొత్తగా మూడు ప్రీపెయిడ్ ప్లాన్లను జోడించింది!! ఆఫర్స్ మీద ఓ లుక్ వేయండి...
- Automobiles
2022 జూన్ అమ్మకాల్లో స్వల్ప వృద్ధి: హీరో మోటోకార్ప్
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జూలై 03 నుండి జూలై 9వ తేదీ వరకు..
- Travel
మన్యంలో మరుపురాని దృశ్యాలు రెండవ భాగం -2
ఫస్ట్ వెబ్ సిరీస్ ఇదే.. ‘పిట్ట కథలు’పై ప్రగతి కామెంట్స్
నేషనల్ వైడ్‌గా లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ ఎంతగా పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ ఒక్క వెబ్ సిరీస్‌తో కియారా అద్వాణీ ఫేట్ మారిపోయింది. నాలుగు వెరైటీ కథలను విభిన్న రకాల కథనాలను నలుగురు దర్శకులు కలిసి తెరకెక్కించారు. ఆ వెబ్ సిరిస్ హిందీలో బాగా వైరల్ అయింది. బోల్డ్ సీన్లకు కొదవే లేని ఆ వెబ్ సిరీస్‌ను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. గతేడాది ఆ రీమేక్‌ను ప్రారంభించారు.
అక్కడ తెరకెక్కించినట్టుగానే నాలుగు విభిన్న కథలను నలుగురు దర్శకులు తెరెక్కించారు. నందినీ రెడ్డి, సంకల్ప్ రెడ్డి, తరుణ్ భాస్కర్, నాగ్ అశ్విన్ కలిసి తెరకెక్కించిన లస్ట్ స్టోరీస్ రీమేక్ తెలుగులో పిట్ట కథలుగా మారిపోయింది. ఇక్కడ పిట్ట అంటే అమ్మాయిలు అని ఇట్టే అర్థమవుతోంది. అయితే తాజాగా రిలీజ్ చేసిన టీజర్‌లోనే ఎంతో కథను చెప్పేశారు. అమలా పాల్ కాస్త రాధిక ఆప్టే పాత్రను పోషిస్తోన్నట్టు కనిపిస్తోంది.

ఇక కియారా పాత్రను ఈషా రెబ్బా పోషిస్తోన్నట్టు కనిపిస్తోంది. అయితే ఈ వెబ్ సిరీస్‌లో ప్రగతి నటించిందట. ఇదే తన మొదటి వెబ్ సిరీస్ అంటూ ఎగ్జైట్ అవుతోంది. అయితే నందినీ రెడ్డి తెరకెక్కించిన కథలో ప్రగతి నటించినట్టుంది. అందుకే ప్రగతి నందినీ రెడ్డి గురించి స్పెషల్‌గా చెప్పుకొచ్చింది. మొత్తానికి ఫిబ్రవరి ఈ నాలుగు పిట్ట కథల సంగతి తెలియనుంది. తెలుగులోనూ ఇది క్రేజీ వెబ్ సిరీస్‌గా మారనున్నట్టు తెలుస్తోంది.