నటి ప్రగతిని చుట్టుముట్టిన దుండగులు.. అర్దరాత్రి అలా విన్యాసాలు.. వీడియో వైరల్
నటి ప్రగతి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. మొత్తానికి ప్రగతి ఇన్ని రోజులు పడ్డ కష్టానికి తగిన ప్రతి ఫలం దక్కినట్టు కనిపిస్తోంది. లాక్డౌన్‌లో ప్రగతి డ్యాన్సులు, వర్కవుట్లు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఆమె ఎందుకు అంతగా కష్టపడింది.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో ఏ ఉద్దేశ్యంతో పోస్ట్ చేసిందో ఆ లక్ష్యం నెరవేరింది. సినిమాల్లో తనకంటూ స్పెషల్ రోల్స్ వస్తున్నాయి.

ఇంతకు ముందులా కాకుండా..
ప్రగతి ఇంతకుముందు మోడ్రన్ మదర్ క్యారెక్టర్స్‌ను పోషించేంది. చాలా తక్కువగా డీ గ్లామర్ లుక్‌లో కనిపించేది కాదు. దాదాపు మోడ్రన్ మామ్.. చలాకీ పాత్రల్లో కనిపించేది. సెటైర్లు వేస్తూ కామెడీ క్యారెక్టర్స్ కూడా చేసేది. ఎమోషనల్ పాత్రల్లోనూ ప్రగతి నటించేది. కానీ ఇకపై ప్రగతికి వచ్చే పాత్రల్లో ఎంతో తేడా ఉండబోతోన్నట్టు తెలుస్తోంది.

లేడీ ఓరియెంటెడ్..
ఆ మధ్య ప్రగతి మాట్లాడుతూ.. తన మనసులోని కోరికను బయటపెట్టేసింది. ఓ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రను, లేడీ ఓరియెంటెడ్ స్టోరీలో నటించాలని ఉందని తెలిపింది. అయితే తాజాగా ప్రగతికి అలాంటి ఆఫర్ రాకపోయినా భవిష్యత్తులో మాత్రం వచ్చేలానే కనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం చేస్తోన్న ఓ చిత్రంలో ప్రగతి చిత్రవిచిత్ర విన్యాసాలను చేస్తోంది.

జీపు కూడా నడుపుతోంది..
ప్రగతికి డ్రైవింగ్ అంటే ఎంతో ఇష్టమన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య బైక్ మీద చక్కర్లు కొట్టిన వీడియోలు బాగానే వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు షూటింగ్ చేస్తోన్న ఓ చిత్రంలో ప్రగతి జీప్ నడిపినట్టు కనిపిస్తోంది. జీప్ నడుపుతున్న వీడియోలను ఆ మధ్య ప్రగతి షేర్ చేయగా అది వైరల్ అయింది.
Recommended Video
తాజాగా యాక్షన్ సీక్వెన్స్‌లో..
ప్రస్తుతం ప్రగతి యాక్షన్ సీక్వెన్స్‌లో బిజీగా ఉంది. అర్దరాత్రి పూట షూటింగ్ చేసిన ఈ సీక్వెన్స్‌లో రౌడీ మూకల పని పడుతోంది. కర్రసాముతో ప్రగతి రౌడీలపై విరుచుకుపడింది. మరి రౌడీలను అలా చితకబాదుతున్న సందర్భం ఏంటన్నది సినిమా చూస్తేనే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











