ఈ వయసులోనూ ఎంతలా కష్టపడుతోంది.. ప్రగతి వర్కౌట్లు చూస్తే దిమ్మ తిరిగి పోవాల్సిందే!!

క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి అంటే ఒకప్పుడు అందరికీ అమ్మ, అత్త పాత్రలు మాత్రమే గుర్తుకువచ్చాయి. ఆ పాత్రల్లోని అమాయకత్వం, ఆ కట్టు బొట్టూ వేషధారణ గుర్తుకువచ్చేవి. కానీ ఈ కరోనా, లాక్ డౌన్ పుణ్యమా అని ప్రగతి లోని కొత్త కోణం అందరికీ తెలిసి వచ్చింది. లుంగీ కట్టి మాస్ స్టెప్పులు వేసినా.. జిమ్‌లో వర్కౌట్లు చేస్తూ చెమట చిందించినా అది ప్రగతికే దక్కింది. మొత్తానికి మరోసారి వీర లెవెల్‌లో వర్కౌట్లు చేస్తూ అందరినీ హడలెత్తించింది.

 రచ్చ రచ్చ..

రచ్చ రచ్చ..

ప్రగతి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ వస్తోంది. మాస్ స్టెప్పులు, వర్కౌట్లు, ఫిట్ నెస్‌కు సంబంధించిన వీడియోలను షేర్ చేయడంతో వంటివి చేస్తూ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. ఈ లాక్డౌన్ ఎవరికైనా కలిసి వచ్చింది అంటే అది ప్రగతికి మాత్రమే అనేంతగా పాపులర్ అయింది.

డ్యాన్సులంటే ఇష్టం..

డ్యాన్సులంటే ఇష్టం..

లుంగీ కట్టుకుని, స్లీవ్ లెస్ టీ షర్ట్ వేసుకుని డ్యాన్సులు, వర్కౌట్లు చేస్తోన్న ప్రగతి దాని వెనుకున్న కారణాలను కూడా చెప్పుకొచ్చింది. తెరపై తాను కేవలం నటిస్తానని, అయితే తనకంటూ వ్యక్తిగత జీవితం ఉంటుంది. అదే ఇదే అని చిన్నతనం నుంచీ డ్యాన్సులు చేయడం, ఫిట్‌గా ఉండటం ఇష్టమంటూ చెప్పుకొచ్చింది.

రీసెంట్‌గా కజరారే..

రీసెంట్‌గా కజరారే..

రీసెంట్‌గా ప్రగతి కజరారే పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఇక ప్రగతి వయ్యారాలు, ఒంపుసొంపులను తిప్పిన తీరుకు నెటిజన్స్ అవాక్కయ్యారు. ఐశ్వర్యా రాయ్‌ను తలపించేలా వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యాయి. ఇక తాజాగా జిమ్‌ చేస్తూ తెగ కష్టపడుతున్న ఫోటోలను షేర్ చేసింది.

Recommended Video

Actress Shiva Parvathi About Her Condition And Rumors Over Social Media
 ఈ వయసులోనూ అలా వర్కౌట్లు..

ఈ వయసులోనూ అలా వర్కౌట్లు..

ప్రగతి నాలుగు పదుల వయసులోకి వచ్చినా సరే ఇంకా కుర్రదానిలానే వర్కౌట్లు చేస్తోంది. పెద్ద మొత్తంలో బరువులను ఎత్తుతోంది. డంబెల్స్‌తో వర్కౌట్లు చేస్తోంది. ఇక వీటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి బాగా వైరల్ అవుతున్నాయి. మొత్తానికి ఎందరో మహిళలకు ప్రగతి స్ఫూర్తిగా నిలుస్తొంది. ఫిట్ నెస్ కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను చాటి చెబుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X