అమ్మ బాబోయ్ ఇలా బెదరగొట్టేస్తోందేంటి.. నటి ప్రగతి ఫోటో షూట్ వైరల్

నటి ప్రగతి ఇప్పుడు తెరపై కంటే సోషల్ మీడియాలోనే ఫుల్ ఫేమస్. ఒకప్పుడు తెరపై మాత్రమే చూసిన ప్రగతిని ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా చూస్తున్నారు. పైగా నెటిజన్లు తెర మీద చూసిన ప్రగతి కంటే సోసల్ మీడియాలో రచ్చ చేస్తున్న ప్రగతినే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కరోనా, లాక్డౌన్ పుణ్యమా అని ప్రగతి ఇంతలా ఫేమస్ అయింది. తనలో దాగి వున్న టాలెంట్ అంతా బయటకు వచ్చింది. ఆమెను కొత్తగా చూడటం ప్రారంభించారు. దీంతో ఆమెకు కొత్త కొత్త ఆఫర్లు, క్యారెక్టర్లు వస్తున్నాయి.

సోషల్ మీడియాలో రచ్చ..

సోషల్ మీడియాలో రచ్చ..

లాక్డౌన్ కాలంలో ప్రగతి చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు. ఏ స్టార్ హీరోయిన్‌ కూడా ఆ రేంజ్‌లో సందడి చేయలేదు. డ్యాన్సులు, వర్కవుట్లతో నానా హంగామా చేసింది. వెంట వెంటనే నెటిజన్లు తన ఫీట్లతో ఆశ్చర్యపరుస్తూ వచ్చింది. హాట్ హాట్ స్టెప్పులు, లుక్కులతో ఫాలోవర్లను పెంచేసుకుంది. అలా మొత్తానికి ప్రగతి తన లోని రెండో కోణాన్ని చూపించేసింది.

వెల్లువెత్తిన ఆఫర్లు..

వెల్లువెత్తిన ఆఫర్లు..

అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాక ప్రగతికి ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చాయి. వెంట వెంటనే షూటింగ్‌లతో ఫుల్ బిజీగా అయిపోయింది. సినీ అవకాశాలే కాకుండా ప్రకటనలతోనూ బాగానే సంపాదించడం మొదలు పెట్టేసింది. స్నేహా చికెన్ అంటూ నితిన్‌తో కలిసి ఓ యాడ్ కూడా చేసింది. అది బాగానే క్లిక్ అయింది.

 స్పెషల్ రోల్..

స్పెషల్ రోల్..

అయితే ప్రగతికి ఇంతకు ముందు ఇచ్చినట్టుగా మోడ్రన్ పాత్రలు, వంటింటి కుందేళ్లులా గడిపే క్యారెక్టర్లు ఇవ్వడం లేదు. దర్శకరచయితలు ఆమె కోసం కొత్త తరహా పాత్రలు రాస్తున్నారు. మెయిన్ లీడ్, ఇంట్లో పెద్దరికాన్ని ప్రదర్శించే పాత్రలను ఇస్తున్నారు.

యాక్షన్ సీక్వెన్స్ సైతం..

యాక్షన్ సీక్వెన్స్ సైతం..

ప్రగతి కోసం స్పెషల్‌గా యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా కంపోజ్ చేస్తున్నారు. ఆ మధ్య కర్రసాము చేస్తూ రౌడీలను చితక్కొట్టేసిన వీడియో సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయింది. అయితే అది ఏ సినిమా షూటింగ్ అన్నది మాత్రం బయటకు చెప్పలేదు.

తాజా ఫోటో షూట్..

తాజా ఫోటో షూట్..

తాజాగా ప్రగతి వెరైటీ ఫోటో షూట్‌ను చేసింది. అందులో జుట్టంతా విరబూసుకుని ఉంది. ట్రెండీగా తయారైన ప్యాంట్ టీ షర్ట్, షర్ట్‌లతో రచ్చ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. యంగ్ హీరోయిన్‌లా మారిన ప్రగతి ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

Recommended Video

తమిళ నటి VJ Chitra ఇక లేరు | Pandian Stores తో భారీ క్రేజ్..!!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X