అమ్మ బాబోయ్ ఇది వేరే లెవెల్.. నడి రోడ్డు మీద బుల్లెట్‌పై నటి ప్రగతి

నటి ప్రగతి సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి అందరికీ తెలిసిందే. కరోనా లాక్డౌన్ పుణ్యమా అని ప్రగతి సోషల్ మీడియాలో స్టార్‌గా మారిపోయింది. జిమ్ వీడియోలు, డ్యాన్స్ వీడియోలు షేర్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ప్రగతికి వచ్చే ఆఫర్లు, చాన్స్‌లు, పాత్రలు మొత్తంగా మారిపోయాయి. ఒకప్పుడు ఎమోషనల్ సీన్స్ పడే పాత్రలు వచ్చేవి. కానీ ఇప్పుడు యాక్షన్ సీక్వెన్స్‌లో దుమ్ములేపే సీన్స్ చేసే క్యారెక్టర్స్ వస్తున్నాయి.

ఫుల్ ఫాలోయింగ్..

ఫుల్ ఫాలోయింగ్..

ప్రగతికి సోషల్ మీడియాలో ఇప్పుడు ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఆమె చేసే పోస్ట్‌లు, షేర్ చేసే వీడియోలు, వేసే స్టెప్పులకు అందరూ ఫిదా అవుతుంటారు. సినిమాల్లో తెరపై కనిపించే ప్రగతికి సోషల్ మీడియాలో కనిపించే ప్రగతికి ఇంత తేడా? ఉందంటూ ఆశ్చర్యపోయేవారు.

ఆ మధ్య అలా..

ఆ మధ్య అలా..

లాక్డౌన్‌లో ప్రగతి వీడియోలు వైరల్ అవ్వడంతో ఆ మధ్య ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో కొన్ని విషయాలపై స్పందించింది. తనకు అన్ని రకాల వాహనాలు నడపడం అంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. ట్రైన్, విమానం తప్పా అన్ని నడిపాను అంటూ ఆ మధ్య చెప్పుకొచ్చింది.

షూటింగ్‌లో భాగంగా..

షూటింగ్‌లో భాగంగా..

ఆ మధ్య ఓ మూవీ షూటింగ్‌లో భాగంగా జీప్‌ను రయ్ రయ్ మని నడిపింది. యాక్షన్ సీక్వెన్స్‌లో భాగంగా చేజింగ్ సీన్స్ తెరకెక్కించినట్టున్నారు. అందులో ప్రగతి జీపును నడిపి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతకు ముందు ఓ సారి తన అపార్ట్మెంట్ ముందు బుల్లెట్ బైక్ నడిపింది.

తాజాగా ఇలా..

తాజాగా ఇలా..

అయితే తాజాగా ప్రగతి ఓ వీడియోను షేర్ చేసింది. ఓ మూవీ షూటింగ్‌లో భాగంగా ప్రగతి బుల్లెట్ మీద సవారి చేసింది. నడి రోడ్డు మీద చీరకట్టులో బుల్లెట్ నడిపిన వీడియోను ఆమె షేర్ చేసింది. ఫలితం మీద నమ్మకం ఉంచి ప్రయత్నాలు చేయండి అంటూ ప్రగతి చెప్పుకొచ్చింది.

ఫుల్ బిజీగా..

ప్రస్తుతం ప్రగతికి బుల్లితెర, వెండితెర మీద బోలెడన్ని అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం తమిళంలో జీవీ ప్రకాష్ హీరోగా వస్తున్న సినిమాలో ప్రగతి ఓ ముఖ్య పాత్రను పోషిస్తోంది. ఈ మధ్యే డబ్బింగ్ పనులను కూడా పూర్తి చేసేసింది ప్రగతి. తమిళంలో డైలాగ్‌లు ఇరగదీస్తోన్న వీడియోను ప్రగతి షేర్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X